no sale
-
OnePlus: వన్‌ప్లస్ విక్రయాలు నిలిపేస్తున్నాం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో విఫలం అయినందుకు వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్స్, ట్యాబ్లెట్స్, వేరబుల్స్ విక్రయాలను మే 1 నుంచి నిలిపివేస్తున్నట్టు సౌత్ ఇండియన్ ఆర్గనైజ్డ్ రిటైలర్స్ అసోసియేషన్ (ఓఆర్ఏ) నిర్ణయించింది. అతి తక్కువ మార్జిన్స్, వారంటీ క్లెయిమ్స్ ఆలస్యం కావడం, బలవంతంగా కొన్ని ఉత్పత్తులను రిటైలర్లపై రుద్దడం వంటి సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అసోసియేషన్ వెల్లడించింది. ఆన్‌లైన్‌కు అనుకూలంగా వన్‌ప్లస్ వ్యవహరిస్తోందని ఆరోపించింది. ఈ మేరకు వన్‌ప్లస్ టెక్నాలజీ ఇండియా సేల్స్ డైరెక్టర్ రంజీత్ సింగ్‌కు ఓఆర్ఏ లేఖ రాసింది. పూర్విక, బిగ్–సి, సంగీత, హ్యాపీ, బీ–న్యూ, సెలెక్ట్, సెల్ పాయింట్ వంటి 23 ప్రముఖ మల్టీ బ్రాండ్ మొబైల్ రిటైల్ చైన్స్ ఓఆర్ఏ సభ్యులుగా ఉన్నాయి. ఇవి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్లో సుమారు 4,500 స్టోర్లతో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. -
కారు.. జీరో
న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌తో ఆటోమొబైల్ పరిశ్రమ కుదేలైంది. చరిత్రలో మొదటిసారి.. ఏప్రిల్ మాసంలో దేశీయ మార్కెట్లో కార్లు, వాణిజ్య, ద్విచక్ర వాహన సంస్థలు ఒక్క వాహనాన్ని కూడా విక్రయించలేని పరిస్థితిని చూశాయి. కాకపోతే కొన్ని వాహనాలను మాత్రం ఎగుమతి చేయగలిగాయి. కార్ల మార్కెట్లో దిగ్గజ సంస్థలు మారుతి సుజుకీ ఇండియా(ఎంఎస్ఐ), హ్యుందాయ్ మోటార్ ఇండియా (హెచ్ఎంఐఎల్) కంపెనీలు ఒక్క వాహనాన్ని కూడా ఏప్రిల్‌లో విక్రయించలేదని ప్రకటించాయి. దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా ఉత్పత్తితోపాటు, విక్రయాలకు బ్రేక్ పడడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అదే విధంగా ఎంజీ మోటార్ ఇండియా, టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం), ద్విచక్ర వాహన కంపెనీ రాయల్ ఎన్ఫీల్డ్ (ఐచర్ మోటార్స్ అనుబంధ సంస్థ) సైతం దేశీయంగా విక్రయాలు సున్నాగానే ఉన్నాయని ప్రకటించాయి. ఇక మహీంద్రా అండ్ మహీంద్రా సైతం కార్లు, వాణిజ్య వాహన విభాగంలో దేశీయంగా ఒక్క యూనిట్ విక్రయాన్ని కూడా నమోదు చేయలేదు. కాకపోతే విదేశీ మార్కెట్లలో ఈ సంస్థలు కొన్ని వాహనాలను విక్రయించాయి. మారుతి సుజుకీ, హ్యుందాయ్ మోటార్, ఎంఅండ్ఎం, రాయల్ ఎన్ఫీల్డ్ ఎగుమతి చేసిన వాటిల్లో ఉన్నాయి. కొన్ని దేశాల్లో లాక్డౌన్ పరిస్థితులు లేకపోవడం వీటికి కలిసొచ్చింది. పునఃప్రారంభానికి సిద్ధం..: గ్రీన్, ఆరెంజ్ జోన్లలో కార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతించడంతో దేశవ్యాప్తంగా ఆటోమొబైల్ కంపెనీలు ఈ దిశగా సన్నద్ధం అవుతున్నాయి. ఏప్రిల్ చివరి వారం లో గుజరాత్‌లోని హలోల్ ప్లాంట్ లో ఎంజీ మోటార్ ఇండియా తయారీని ఆరంభించింది. కార్యకలాపాల ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్టు టీకేఎం తెలిపింది. ఎన్నో సవాళ్లు: టయోటా వినియోగదారుల కొనుగోలు సెంటిమెంట్ తక్కువ స్థాయిలో ఉండడం, దెబ్బతిన్న సరఫరా వ్యవస్థను తిరిగి నిర్మించుకోవడం, కార్మికులు తిరిగి పనిలోకి వచ్చి చేరడం వంటి ఎన్నో సవాళ్లను పరిశ్రమ ఎదుర్కొంటోంది. ఎన్నో ఇతర రంగాల మాదిరే తయారీ, డీలర్‌షిప్‌లను మూసివేయడం వల్ల ఆటోమోటివ్ వ్యాల్యూ చైన్ పూర్తిగా నిలిచిపోయింది. తిరిగి కార్యకలాపాల ప్రారంభానికి వీలుగా డీలర్ భాగస్వాములతో సన్నిహిత సంప్రదింపులు జరుపుతున్నాం. సురక్షిత, ఆరోగ్యకరమైన వాతావరణంలో డిమాండ్‌కు ప్రేరణనిచ్చేందుకు వీలుగా వారికి మా పూర్తి మద్దతును అందిస్తున్నాం. విక్రయాలను పూర్తిగా డిజిటలైజ్ చేశాం. కస్టమర్లు కొనుగోలు చేస్తే ఇంటి వద్దకే వాహనాన్ని డెలివరీ చేసే ఏర్పాటు చేశాం. – నవీన్సోని, టీకేఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ట్రాక్టర్ల డిమాండ్‌కు సానుకూలతలు: ఎంఅండ్ఎం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను కొనసాగించడంతో వ్యాపారంపై ప్రభావం పడింది. కొన్ని రోజుల క్రితమే డీలర్లు పాక్షికంగా కార్యకలాపాలను ప్రారంభించారు. సమీప భవిష్యత్తులో పలు సానుకూలతలు కనిపిస్తున్నాయి. రబీ ఉత్పత్తి మంచిగా ఉండడం, ప్రభుత్వం కొనుగోళ్ల కేంద్రాలను ప్రారంభించడం, పంటలకు చక్కని ధరలు ఉంటాయన్న సంకేతాలు, రిజర్వాయర్లలో నీటి మట్టాలు.. ఇవన్నీ ట్రాక్టర్ల డిమాండ్‌ను పెంచుతాయి. కొన్ని వారాల విక్రయాలకు సరిపడా స్టాక్స్ ఉన్నాయి. లాక్డౌన్ సవరణల తర్వాత ఎన్‌బీఎఫ్‌సీల కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకోవడం, క్షేత్ర స్థాయిలో విక్రయ కార్యకలాపాలపైనే పనితీరు పురోగతి ఆధారపడి ఉంటుంది. – సందీప్ సిక్కా, మహీంద్రా ఫామ్ ఎక్విప్మెంట్ విభాగం ప్రెసిడెంట్ హెచ్ఎంఎస్ఐ చీఫ్‌గా అత్సుషి ఒగాటా హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) ప్రెసిడెంట్, సీఈవో, ఎండీగా అత్సుషి ఒగాటాను మాతృ సంస్థ హోండా మోటార్ కంపెనీ నియమించింది. ఈ నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని కంపెనీ ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న మినోరు కటు తిరిగి హోండా మోటార్ కంపెనీలో ఆపరేటింగ్ ఎగ్జిక్యూటివ్ పదవి చేపట్టనున్నారు. -
‘రియల్’ ఢమాల్
రూ. వెయ్యి, 500 నోట్ల రద్దుతో ఆగిన క్రయ, విక్రయాలు మార్పిడి నగదుపై కేంద్రం ఆంక్షలతో ఇబ్బందులు మరో మూడు నెలలు ఇదే పరిస్థితి ఉంటుందన్న భయంతో అయోమయం దీంతో దిగిరానున్న ఇళ్ల స్థలాలు, ఇంటి ధరలు సాక్షి, రాజమహేంద్రవరం: రూ. వెయ్యి, 500 నోట్ల రద్దుతో జిల్లాలో స్థిరాస్తి వ్యాపారం ఒడుదొడుకులకు గురవుతోంది. పాత నోట్ల స్థానంలో కొత్త రూ.500, రూ. 2000 నోట్లు మార్చుకున్నా నగదు చలామణిపై కేంద్రం విధించిన ఆంక్షలతో ఇప్పట్లో స్థిరాస్తి వ్యాపారం పుంజుకునే అవకాశం లేదని రియల్ వ్యాపారస్తులు వాపోతున్నారు. ప్రస్తుతం పాత నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్లు చేసినా ఖాతాదారుడు ఈ నెల 24 వరకు రోజుకు గరిష్టంగా రూ.10 వేలు, వారానికి రూ.20 వేలు మాత్రమే తీసుకునేలా కేంద్రం ఆంక్షలు విధించడం ... నగదు తీసుకోవడంపై ఆంక్షలు ఎత్తివేస్తామని చెప్పకపోవడంతో రియల్ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో వందల వెంచర్లున్నాయి. ప్లాట్లు మార్చి అభివృద్ధి చేసి విక్రయానికి సిద్ధంగా ఉంచారు. ప్రస్తుత పరిస్థితుల్లో నగదు అందుబాటులో లేక క్రయవిక్రయాలు నిలిచిపోయే పరిస్థితి తలెత్తడంతో వారంతా దిక్కు తోచని స్థితిలో తలలు పట్టుకుంటున్నారు. స్థలాలపైనే ఎక్కువగా ప్రభావం... ప్రస్తుత పరిస్థితుల్లో మరో మూడు నాలుగు నెలల వరకు పూర్తి స్థాయిలో నగదు చలామణిలోకి వచ్చే అవకాశం లేదు. అప్పటి వరకు భారీ స్థాయిలో నగదు అవసరమయ్యే పొలాలు, స్థలాల క్రయ విక్రయాలు నిలిచిపోనున్నాయి. నగదు కొరత ప్రభావం పొలాలు, ఓపె¯ŒS ప్లాట్ల కన్నా ఇళ్లపై తక్కువగా ఉంటుందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇళ్లు కొనుగోలు చేయడం ద్వారా ఆ మొత్తాన్ని ఆదాయ పన్నులో చూపించుకునే అవకాశం ఉండడంతో అటువైపు ఆసక్తి చూపుతారని వివరిస్తున్నాయి. నగదు రహిత వ్యవహారాలే అధికం కేంద్రం నగదు చలామణిపై ఆంక్షలు విధించడంతో మార్కెట్లోకి కొత్తనగదు ప్రవాహం తక్కువగా ఉంది. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో క్రయవిక్రయాలకు సంబంధించిన ఆస్తుల రిజిస్ట్రేష¯ŒS చాలా వరకు తగ్గింది. ప్రస్తుతం గిఫ్ట్‌లు, మార్ట్గేజ్లు, చెల్లు రసీదులు, ఆస్తుల బదలాయిపు వ్యవహారాలే ఎక్కువగా జరుగుతున్నాయి. దిగిరానున్న ఇళ్ల ధరలు.. ఇప్పటి వరకు ఇళ్ల ధరలు ఆకాశాన్నంటాయి. నల్ల ధనాన్ని అరికట్టడానికి నగదు చెలామణిపై కేంద్రం పరిమితులు విధించడంతో ఇంటి స్థలాల ధరలు తగ్గుతాయని పలువురు భావిస్తున్నారు. ఫలితంగా ప్లాట్లు, ఇళ్ల ధరలు తగ్గించే అవకాశం ఉంటుందని స్థిరాస్తి వ్యాపారులు పేర్కొంటున్నారు. నగదు చెలామణి పెరిగితే యథాతథం రూ.వెయ్యి, 500 నోట్లు రద్దుతో నగదు చెలామణి తగ్గింది. దీని ప్రభావం స్థిరాస్తి వ్యాపారంపై పడింది. గతంలో కన్నా 40 నుంచి 50 శాతం మేర రిజిస్ట్రేషన్లు తగ్గాయి. డిసెంబర్ వరకు ఇదే పరిస్థితి ఉండొచ్చు. నగదు పూర్తి స్థాయిలో చెలామణి అయితే మళ్లీ రిజిస్ట్రేషన్లు పుంజుకుంటాయి. – ఆర్. సత్యనారాయణ, జిల్లా రిజిస్ట్రార్, రాజమహేంద్రవరం. ఇళ్ల కొనుగోళ్లు పెరుగుతాయి స్థల క్రయవిక్రయాల నగదు అధికారికంగా చెల్లిస్తే భూముల విలువ తగ్గుతుంది. తద్వారా ప్లాట్ ధర తగ్గుతుంది. మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరల్లో ఇళ్లు ఉంటాయి. ఇళ్ల కొనుగోళ్లకు బ్యాంకులు రుణాలు ఇస్తాయి. మా వ్యాపారం పెరుగుతుంది. – ఎ.కృష్ణమోహన్, అపార్ట్మెంట్ బిల్డర్ల అసోసియేష¯ŒS సెక్రటరీ, కాకినాడ వీరి రూటే వేరు... డిసెంబర్ నెలాఖరు వరకు రద్దయిన నోట్లు మార్చుకునేందుకు అవకాశం ఉండడంతో పలుకుబడి ఉన్న వ్యాపారస్తులు, రియల్ వ్యాపారంలో ఉన్న రాజకీయ నేతలు తమ వ్యాపారాన్ని కొంతమేరకు నిర్వహిస్తున్నారు. సాధారణంగా మార్కెట్ విలువ కన్నా ప్రభుత్వ విలువ తక్కువగా ఉంటుంది. కొనుగోలుదారుడు ప్రభుత్వ విలువనే చూపిస్తూ రిజిస్ట్రేష¯ŒS చేయించుకుంటాడు. ఆ మొత్తానికే పన్ను చెల్లిస్తాడు. ఇది మార్కెట్ విలువలో కేవలం 15 నుంచి 20 శాతం ఉంటుంది. మిగతా మొత్తం నల్లధనంగా ఇస్తాడు. అయితే పాత నోట్లను మార్చుకునే పలుకుబడి ఉన్న వారు క్రయవిక్రయాలు జరుపుతున్నారు. అయితే నగదు రూపంలో ఇచ్చే మొత్తానికి అదనంగా 10 శాతం తీసుకుంటూ వ్యాపారం చేస్తున్నారు.