No stock boards
-
Sri Lanka: పెట్రోల్ కోసం క్యూలో రోజుల తరబడి..
శ్రీ లంక సంక్షోభం ఇప్పుడు ఏమేరకు చేరిందో తెలుసా?.. పెట్రోల్ కావాలంటే ముందు టోకెన్లు తీసుకోవాలి. గంటల తరబడి కాదు.. రోజుల తరబడి క్యూలో ఎదురు చూడాలి. అవును.. శ్రీలంకలో పరిస్థితి దయనీయమైన స్థితికి చేరుకుంది. పెట్రో అమ్మకాలపై శ్రీలంక ప్రభుత్వమే ఆంక్షలు విధిస్తోంది. అమ్మకాలను దగ్గరుండి పర్యవేక్షిస్తోంది. గత పది పదిహేను రోజులుగా ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పెట్రోల్, డీజిలకోసం లైన్లలో ఎదురు చూపులు తప్పడం లేదు. కొందరైతే క్యూలోనే రోజుల తరబడి ఉండిపోతున్నారు. అక్కడే బస చేస్తున్నారు. అత్యవసరం ఉన్న వాహనాలకు సైతం గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. వ్యాపారులు, వాహనాలనే నమ్ముకుని బతుకుతున్న వాళ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. తీవ్ర సంక్షోభం.. అప్పుల నడుమ శ్రీలంకకు చమురు ఇంధనాలు చేరుకోవడం లేదు. ఇంధన కొరతతో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి చాలా చోట్ల. దీంతో పెట్రో బంకుల వద్ద భారీ క్యూలు, కొట్లాటలు చోటుచేసుకుంటున్నాయి. పరిస్థితి అదుపు చేయడానికి సైన్యం, పోలీసులు రంగంలోకి దిగారు. వాహనాదారులను అదుపు చేయడంతో పాటు టోకెన్లను సైతం వాళ్లే దగ్గరుండి పంచుతున్నారు. గాలే టెస్టును కవరేజ్ చేయడానికి ఓ జర్నలిస్ట్.. సుమారు ఐదు కిలోమీటర్లు సైకిల్ మీద ప్రయాణించాడంటే పరిస్థితి తీవ్రత ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో రిపోర్టర్ ఆండ్రూ ఫైడెల్ ఫెర్నాండోకు ఈ అనుభవం ఎదురైంది. Almost no fuel in the country, so nearly impossible to get a trishaw. Buses unreliable and the ones that come are crammed. Still need to get to the ground to cover the Galle Test this week. There was only one option. pic.twitter.com/av2qVWup7G — Andrew Fidel Fernando (@afidelf) June 30, 2022 -
తెలంగాణ: పెట్రోల్ బంకుల్లో నో స్టాక్.. భారీ క్యూలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రమవు తోంది. డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా చేయకుండా చమురు సంస్థలు వినియోగదారుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం దరిమిలా పెరిగిన క్రూడాయిల్ ధరలకు అనుగుణంగా రిటైల్‌గా పెట్రోల్, డీజిల్ ధరలను భారీ స్థాయిలో పెంచుకోకుండా కేంద్ర ప్రభుత్వం కట్టడి చేస్తుండడం, వాణిజ్య పరంగా వినియోగించే బల్క్ డీజిల్‌ను ఆయా సంస్థలు ఎక్కువ ధర కారణంగా తమవద్ద తీసుకోకుండా రిటైల్ మార్కెట్లో కొనుగోలు చేస్తుండటంతో చమురు సంస్థలు డీలర్లకు ఇచ్చే కోటాను తగ్గిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇండెంట్‌పై 25 నుంచి 40 శాతం వరకు కోత విధించి పెట్రోల్, డీజిల్ సరఫరా చేస్తున్నట్లు డీలర్లు చెపుతున్నారు. ఈ నేపథ్యంలో రాజ ధాని శివార్లతో పాటు జిల్లా కేంద్రాల్లోని చాలా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో స్టాక్ ఉన్న బంకుల్లో వినియోగదారులు క్యూ కడుతున్నారు. తొలుత పారిశ్రామిక ప్రాంతాలు అధికంగా ఉన్న రాజధాని శివారు బంకుల వద్ద బంకుల్లో డీజిల్ కొరత మొదలు కాగా, క్రమంగా పెట్రోల్ కూడా దొరకని పరిస్థితి ఎదురైంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని బంకులతో పాటు జిల్లా కేంద్రాల్లోని బంకుల్లోనూ కొరత కనిపిస్తోంది. ఫిబ్రవరి నుంచి బల్క్ డీజిల్ ధరలను చమురు సంస్థలు పెంచే యడంతో టీఎస్ ఆర్టీసీతో పాటు కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, ఫార్మా కంపెనీలు డీజిల్‌ను ఓపెన్ మార్కెట్లో రిటైల్ బంకుల్లోనే కొనుగోలు చేస్తున్నాయి. ఇలా బల్క్ డీజిల్ కొనుగోళ్లు తగ్గడంతో వాటిల్లుతున్న నష్టాన్ని తగ్గించుకునేందుకు రిటైల్ బంకుల కోటా కు చమురు సంస్థలు కోత పెడుతున్నట్లు డీలర్లు చెబుతున్నారు. రెండేళ్ల క్రితం ఇండెంట్ మేరకు సరఫరా: రాష్ట్రంలో మూడు చమురు సంస్థలకు చెందిన 7 డిపోలు ఉన్నాయి. ఈ సంస్థల ద్వారా 3,520 పెట్రోల్ బంకులకు ప్రతిరోజు సుమారు 50 లక్షల లీటర్లకు పైగా పెట్రోల్, 87 లక్షల లీటర్లకు పైగా డీజిల్ డిమాండ్ ఉంది. ఇందులో సుమారు 60 శాతం వినియోగం జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉంటుంది. కాగా ప్రస్తుతం 60 శాతం నుంచి 75 శాతం కోటాను కూడా పంపిం చడం లేదని, ఎప్పటికప్పుడు డీజిల్, పెట్రోల్ డిమాండ్ పెరుగుతుండగా, రెండేళ్ల క్రితం నాటి ఇండెంట్ అనుసరించి ఆయిల్ కంపెనీలు సరఫరా చేస్తున్నాయని డీలర్లు ఆరోపిస్తున్నారు. మూడు ఆయిల్ కంపెనీలు కరోనా కంటే ముందు నాటి అమ్మకాలను పరిగణనలోకి తీసుకొని కోటా అమలు చేస్తున్నాయని చెబుతున్నారు. ప్రస్తుత ఇండెంట్‌తో నిమిత్తం లేకుండా పాత ఇండెంట్ ప్రకారం అందులో 25 శాతం నుంచి 40 శాతం వరకు కోత విధించి సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. పెట్రోల్, డీజిల్‌కు విడివిడిగా 20 వేల లీటర్ల చొప్పున ఇండెంట్ పెడితే రెండు కలిపి 20 వేల లీటర్లు సరఫరా చేస్తున్నారని ఓ డీలర్ తెలిపారు. ఒక బంక్‌లో నాలుగు చమురు కంపార్టుమెంటులు ఉంటే ఒకే కంపార్ట్మెంటుకు మాత్రమే సరఫరా చేస్తుండడంతో కొరత పెరిగిందని చెపుతున్నారు. ఈ పరిస్థితుల్లో శివార్లతో పాటు జిల్లాల్లో కూడా రెండురోజులకోసారి బంకులు మూత పడే పరిస్థితి ఏర్పడుతోంది. వాస్తవానికి పెట్రోల్ విషయంలో ‘బల్క్’ సమస్య లేనప్పటికీ పెట్రోల్ కోటాను కూడా కంపెనీలు తగ్గించి పంపుతున్నాయి. ఉద్దర లేదు..: గతంలో పెట్రోల్ బంకులకు సరఫరా చేసిన చమురుకు 3 నెలల వరకు క్రెడిట్ ఆప్షన్ ఉండేది. అయితే గత మూడు నెలల నుంచి ఆయిల్ కంపెనీలు ముందుగా డీడీ చెల్లించి ఇండెం ట్ పెడితేనే చమురును సరఫరా చేస్తున్నాయి. అలాగే పాత బకాయిలు చెల్లించని డీలర్లకు సరఫరా నిలిపివేశాయి. దీనివల్ల కూడా చాలాచోట్ల బంకుల్లో నోస్టాక్ బోర్డులు కన్పిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే కోటా తగ్గించడంలో భాగంగానే చమురు కంపెనీలు డీడీలను తప్పనిసరి చేశాయని డీలర్లు ఆరోపిస్తున్నారు. ప్రైవేటు పెట్రోల్ బంకులు మూత: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరల సవరణలు, ఎక్సైజ్ డ్యూటీల తగ్గింపు వల్ల ప్రభుత్వ కంపెనీల ధరలు ప్రస్తుతం పెట్రోల్ రూ.109.64 ఉండగా, డీజిల్ రూ. 97.80గా ఉంది. కానీ నయారా/ఎస్సార్ రేట్లు వరుసగా రూ.111.93, రూ.98.58 గా ఉన్నాయి. ఇక జియో –బీపీ పెట్రోల్ ధర రూ. 116.77 కాగా, డీజిల్ రూ.102.86గా ఉంది. దీంతో వినియోగదారులు ఈ బంకుల వైపు వెళ్లకపోవడంతో ఇవన్నీ దాదాపుగా మూతపడ్డాయి. ఇక బల్క్ డీజిల్ ధర ప్రస్తుతం రూ.128గా ఉంది. బల్క్‌కు నై..రిటైల్‌కు సై: టీఎస్ ఆర్టీసీ తనకు చెందిన డిపోలలోని బంకుల ద్వారా ప్రతిరోజు 5 లక్షల లీటర్ల డీజిల్ వినియోగించేది. అయితే మార్చిలో బల్క్ డీజిల్ ధరను లీటర్ మీద రూ.25 నుంచి రూ.30 వరకు పెంచడంతో ఆర్టీసీ సొంత బంకులను మూసివేసింది. ప్రతిరోజు మూడు సొంత పెట్రోల్ బంకుల ద్వారా 20 వేల లీటర్లకు పైగా డీజిల్ వినియోగించే జీహెచ్ఎంసీ కూడా చెత్త వాహనాలను రాంకీకి అప్పగించి, ఇతర వాహనాలకు రిటైల్‌గానే డీజిల్ కొనుగోలు చేస్తోంది. రాష్ట్రంలో చమురు కొరత లేదు: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్‌కు ఎలాంటి కొరత లేదు. 3 రోజులకు సరపడా నిల్వలు ఎప్పుడూ మెయిన్టైన్ అవుతున్నాయి. అనవసర ప్రచారం వల్ల షార్టేజ్ ఏర్పడుతుందేమో తెలియదు. బల్క్ డీజిల్ కొనుగోలుదారులు రిటైల్ మార్కెట్లో కొనుగోలు చేయడం వల్ల పెద్ద నష్టమేమీ ఉండదు. బంకుల్లో 20 శాతం అమ్మకాలు పెరిగాయి. – మంగీలాల్, ఆయిల్ కంపెనీస్ స్టేట్ లెవల్ కోఆర్డినేటర్ బల్క్ కొనుగోళ్లు లేకే డీలర్ల కోటా తగ్గింపు బల్క్ డీజిల్ ధర ఎక్కువగా ఉండటంతో పలు సంస్థలు రిటైల్‌గా కొనుగోలు చేస్తున్నాయి. దీంతో చమురు సంస్థలకు నష్టం వాటి ల్లుతోంది. దీన్ని అధిగమించేందుకే 3 నెలలుగా రిటైల్ కోటాను తగ్గించాయి. కోవిడ్ సమయంలో ఫార్మాసిటీకి డీజిల్‌పై రూ.28 తగ్గించి సరఫరా చేశారు. కానీ ఇప్పుడు దాదాపుగా అంతే మొత్తం ఎక్కువ పెట్టి ఆ సంస్థ బల్క్ డీజిల్ కొనుగోలు చేయడం లేదు. కేంద్రం బల్క్ డీజిల్ లైసెన్స్ ఉన్నవాళ్లు విధిగా వాళ్ల కోటా మేర కొనుగోలు చేసేలా ఒత్తిడి తెస్తే ఈ పరిస్థితి ఉత్పన్నం కాదు. – డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి ‘ఢీ’జిల్ గ్రామాల్లో వ్యవసాయ పనులు ముమ్మరమయ్యాయి. డీజిల్ కోసం రైతులు అగచాట్లు పడుతున్నారు. బంకుల్లో సరిపడా డీజిల్ దొరకట్లేదు. దీంతో స్టాకు రాగానే.. ఒక్కసారిగా ఎగబడుతున్నారు. మంగళవారం రాత్రి తిరుమలగిరిలోని బంకు వద్ద కనిపించిన దృశ్యమిది. – తిరుమలగిరి(తుంగతుర్తి) -
కరోనా: వ్యాక్సిన్ భారతం లెక్కలివే..
సాక్షి, న్యూఢిల్లీ: డిమాండ్‌కి తగ్గట్టుగా కోవిడ్ టీకాల పంపిణీ లేకపోవడంతో టీకా వేయించుకోవడానికి వచ్చిన ప్రజలు వ్యాక్సినేషన్ కేంద్రాల నుంచి వెనుతిరుగుతున్నారు. వ్యాక్సిన్ కొరతనెదుర్కొంటున్న రాష్ట్రాల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. రాష్ట్రాల్లో తరిగిపోతున్న టీకా డోసులు కరోనా సెకండ్‌వేవ్ ఉధృతంగా కొనసాగుతూ ఉండడంతో అన్ని రాష్ట్రాల్లోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకుంది. టీకాల ఉత్పత్తి సామర్థ్యానికి మించి వినియోగిస్తూ ఉండడంతో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దేశంలో కోవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్ల ఉత్పత్తి నెలకి 7 కోట్ల డోసులుగా ఉంది. ఈ ప్రాతిపదికన రోజుకి 25 లక్షల వరకు ఇవ్వొచ్చు. అయితే వైరస్‌ను ఎదుర్కోవడానికి ఏప్రిల్ 1 తర్వాత అనుకున్నదానికంటే ఎక్కువగా 34 లక్షల డోసులు పంపిణీ చేస్తున్నారు. దీంతో టీకాలకి కొరత ఏర్పడింది. మహారాష్ట్రలో ఇప్పటికే పలు వ్యాక్సిన్ కేంద్రాలను మూసివేశారు. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో మహారాష్ట్రలో 60% వరకు వెలుగు చూస్తూ ఉండడంతో ఆ రాష్ట్రంలో రోజుకి 6 లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. కానీ ఆ స్థాయిలో టీకా డోసులు ఆ రాష్ట్రానికి అందలేదు. రాష్ట్రాల జనాభా, కరోనా కేసుల ఆధారంగా వ్యాక్సిన్ పంపిణీ చేయాలని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపె డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆ రాష్ట్రం దగ్గర 4 లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయి. ఇక పంజాబ్ దగ్గర 5.7 లక్షల కోవిడ్ టీకాలు ఉన్నాయి. రోజుకి సగటున 85,000–90,000 మందికి టీకా వేస్తున్నారు. ప్రతీ రోజూ 2 లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని పంజాబ్‌లో అమరీందర్ సింగ్ ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఆ లక్ష్యాన్ని చేరుకుంటే మరో మూడు రోజుల్లోనే వ్యాక్సిన్ నిల్వలు అయిపోతాయి. ఇక రాజస్తాన్ రోజుకి 5 లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని అన్ని ఏర్పాట్లు చేసుకుంది. కానీ ఆదివారం నాటికే అక్కడ కూడా టీకా డోసులు అయిపోతాయి. అందుకే 30 లక్షల టీకాలు పంపాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కేంద్రానికి లేఖ రాశారు. ఛత్తీస్‌గఢ్‌లో 3 రోజుల్లో టీకా డోసులు అయిపోతాయి. టీకా డోసుల్లో 60 శాతం కంటే ఎక్కువ ఎనిమిది రాష్ట్రాలకు కేంద్రం పంపిణీ చేసింది. వాటిలో మహారాష్ట్ర, రాజస్థాన్ ఉన్నప్పటికీ కేసులు ఎక్కువగా వస్తూ ఉండడంతో వ్యాక్సిన్‌కి డిమాండ్ పెరిగింది. కేంద్రం వద్ద 43 లక్షల వ్యాక్సిన్ డోస్‌లు అందుబాటులో ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయి. కేంద్రానికి చేతకావడం లేదు: సోనియా దేశంలో కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడం కేంద్ర ప్రభుత్వానికి చేతకావడం లేదని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కరోనా నిర్వహణ సరిగ్గా చేయకుండా టీకా డోసుల్ని వేరే దేశాలకు ఎగుమతి చేస్తూ ఉండడం వల్ల దేశంలో వ్యాక్సిన్ కొరత ఏర్పడిందని అన్నారు. కరోనా కేసులు అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతూ ఉండడం వల్ల ఎన్నికల ర్యాలీలు, బహిరంగ సమావేశాలపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. శనివారం సోనియా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోవిడ్ పరిస్థితుల్ని సమీక్షించారు. కరోనా టెస్ట్, ట్రాక్, వ్యాక్సినేట్.. ఈ మూడింటికే అత్యధిక ప్రాధాన్యతనివ్వాలన్నారు. కరోనా టీకా కొరత గురించే ఎక్కువగా ప్రస్తావించారు. వ్యాక్సిన్ కొరత ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర, న్యూఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, బిహార్, ఒడిశా, జార్ఖండ్ అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు సీరమ్ ఇనిస్టిట్యూట్ తయారు చేస్తున్న కోవిషీల్డ్, భారత్ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్ నెలకి ఉత్పత్తయ్యే డోసుల సంఖ్య 7కోట్లు ప్రస్తుతం రోజూ ఇస్తున్న డోసులు 34 లక్షలుపైగా ఇప్పటివరకు ఇచ్చిన టీకా డోసులు 9.80కోట్లు -
రేషన్ ‘కోటా’ నో స్టాక్!
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ చౌక ధరల దుకాణాలకు నెలసరి ‘రేషన్ కోటా’ కేటాయింపు ఏ మూలకూ సరిపోవడంతో లేదు. ప్రజా పంపిణీ వ్యవస్థలోసంస్కరణల్లో భాగంగా అమలు చేస్తున్న పోర్టబిలిటీ విధానం తీవ్ర ప్రభావం చూపుతోంది. గడువుచివరిలో స్టాక్ లేదంటూ డీలర్లుచేతులేత్తుస్తుండటంతో ఆహార భద్రత లబ్ధిదారులకు పీడీఎస్ బియ్యంఅందని ద్రాక్షగా తయారైంది.ప్రజాపంపిణీ వ్యవస్థలో జిల్లా, రాష్ట్ర, జాతీయ పోర్టబిలిటీ విధానం అమలవుతోంది. ఆహార భద్రతకార్డు లబ్ధిదారులను రాష్ట్రంలో ఎక్కడైనా సరుకులు తీసుకునే వెసులుబాటు కలిగింది. తాజాగా ఏపీ తెల్లరేషన్ కార్డు లబ్దిదారులు సైతం తెలంగాణ పరిధిలో ఎక్కడైనా సరుకులు డ్రా చేసుకునే జాతీయ పోర్టబిలిటీ విధానం అమలు కూడా ప్రారంభమైంది. హైదరాబాద్ మహా నగరం పరిధిలో సుమారు 30 లక్షలకు పైగా కుటుంబాలు ఉండగా అందులో సగానికిపైగా కుటుంబాలు దారిద్య్రరేఖకు దిగవనున్నాయి. తెలంగాణ నలు మూలలతో పాటు ఏపీకి చెందిన కుటుంబాలు సైతం ఉపాధి, విద్య, ఇతర అవసరాల కోసం హైదరాబాద్ నగరంలో తాత్కాలిక నివాస సముదాయాలు ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని ఆహార భద్రత లబ్ధి కుటుంబాలతోపాటు తెల్లరేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులు సైతం పోర్టబిలిటీ విధానం కారణంగా నగరంలోనే సరుకులు డ్రా చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో లావాదేవీలు పెరిగి కోటా తక్కువగా ఉండటంతో గడువు లోపలే నిల్వలు ఖాళీ అవుతున్నాయి. పెరగని రేషన్ కోటా.. ప్రజా పంపిణీ వ్యవస్థలో పోర్టబిలిటీ విధానం అమలవుతున్న చౌకధరల దుకాణాల కోటా మాత్రం పెరగటం లేదు. జిల్లా, రాష్ట్ర పోర్టబిలిటీ విధానంతో పాటు గత మూడు మాసాలుగా నేషనల్ పోర్టబిలిటీ విధానం కూడా అమలవుతోంది. ఇప్పటికే రాష్ట్రం నలుమూలల నుంచి నగరంలో మకాం వేసి పేద కుటుంబాలు తమ కోటా పీడీఎస్ బియ్యం ఇక్కడే డ్రా చేస్తున్నారు. తాజాగా నేషనల్ పోర్టబిలిటీ కింద ఏపీకి చెందిన తెల్లరేషన్ కార్డు లబ్ధిదారులు సైతం తమ కోటా ఇక్కడే డ్రా చేయడం ప్రారంభించారు. దీంతో మొత్తమ్మీద సుమారు 30 శాతం వరకు సరుకులు అధికంగా డ్రా జరుగుతోంది. పౌరసరఫరాల విభాగం మాత్రం సరుకుల కోటా పెంచడం లేదు. అవసరమైన కోటాలో సైతం కొంత వరకు కోత విధించి కేటాయిస్తూ వస్తోంది. వాస్తవంగా ప్రతి చౌకధరల దుకాణం పరిధిలోని సుమారు 20 నుంచి 30 శాతం వరకు లబ్ధి కుటుంబాలు వివిధ కారణాలతో సరుకులు డ్రా చేయరు. దీంతో డీలర్లు తమకు కేటాయించిన కోటాలో రెండు దశల్లో కేవలం 70 నుంచి 80 శాతం వరకు మాత్రమే స్టాక్ పాయింట్ల నుంచి సరుకుల డ్రా చేస్తుంటారు. దీంతో పోర్టబిలిటీ లావాదేవీల ప్రభావంతో నిల్వలు గడువు లోపలే పూర్తిగా నిండుకుంటున్నట్లు తెలుస్తోంది. 15 వరకు గడువు.. ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా లబ్ధిదారులు సరుకులు డ్రా చేసుకునే గడువు ప్రతి నెలా 15వ తేదీ వరకు ఉంటుంది. నగరంలోని కొందరు లబ్ధిదారులకు పని ఒత్తిడి, ఇతర కారణాలతో మొదటి పది రోజుల వరకు సరకులు డ్రా చేసుకునేందుకు వీలుపడదు. చివరి రోజల్లో డ్రా చేసుకునే ప్రయత్నిస్తే.. స్టాక్ లేదని డీలర్లు పేర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరి రోజుల్లో బియ్యం నిల్వలు ఖాళీ కావడంతో తిరిగి తెప్పించేందుకు డీలర్లు ఆసక్తి కనబర్చడం లేదు. పౌరసరఫరాల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా..పట్టిపట్టనట్లు వ్యవహరిస్తూన్నానే ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ సారైనా సంబంధిత అధికారులు దృష్టి సారించి పీడీఎస్ నిల్వలు పూర్తి కాకముందే డీలర్లు స్టాక్ దిగుమతి చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని పేదలు విజ్ఞప్తి చేస్తున్నారు. -
మహా కిక్కు
ఆదిలాబాద్ క్రైం, న్యూస్‌లైన్ : ఎన్నికల వేళ మద్యం విక్రయాలపై అధికారులు నియంత్రణ విధించడంతో అక్రమార్కులు మహారాష్ట్ర నుంచి మద్యం దిగుమతి చేసుకుంటున్నారు. సరిహద్దు గ్రామాల్లో దాచి రాత్రి వేళ బెల్టుషాపులకు తరలిస్తున్నారు. స్థానిక మద్యం దుకాణాల ఎదుట నో స్టాక్ బోర్డులు దర్శనం ఇచ్చినా బెల్టు దుకాణాల్లో మాత్రం దేశీదారు ఏరులై పారుతోంది. అధికారులు ఎంత కట్టడి చేసినా అక్రమ మద్యం రవాణా ఆగడం లేదని ఇప్పటివరకు పట్టుబడ్డ మద్యాన్ని బట్టి తేటతెల్లమవుతోంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా అక్రమ మద్యం తరలిస్తున్న వారిపై 496 కేసులు నమోదు చేయగా రూ.24.54లక్షల మద్యం పట్టుబడింది. ఇందులో అధికంగా మహారాష్ట్ర నుంచి మద్యం తరలిస్తున్న కేసులే ఉండడం గమనార్హం. దుకాణాల ఎదుట నో స్టాక్ బోర్డులు గతేడాది ఇదే నెలలో మద్యం అమ్మకాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఆ మొత్తంలోనే దుకాణాలకు మద్యం పంపిణీ చేసింది. ఎన్నికల వేళ కావడంతో మద్యం కొరత తీవ్రంగా ఏర్పడింది. మద్యం దుకాణాదారులు వచ్చిన స్టాకును బెల్టు దుకాణాలకు తరలించి దుకాణాల ఎదుట నో స్టాక్ బోర్డులు పెట్టేస్తున్నారు. ఉన్న కొద్ది మద్యాన్ని అమ్ముతుండగా ఈ మద్యం కోసం మందుబాబులు ఉదయాన్నే బారులు తీరుతున్నారు. దొరికిన మద్యాన్ని కూడా మద్యం వ్యాపారులు అధిక ధ రలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మహారా ష్ట్ర నుంచి మద్యం అక్రమంగా దిగుమతి చేస్తూ గ్రామా ల్లో నిల్వ చేస్తున్నారు. ఎన్నికలకు రెండు రోజుల ముం దు జిల్లా అంతట డంప్ చేసేందుకు వ్యూహ రచన చేస్తున్నట్లు సమాచారం. మన జిల్లాలోని సరిహద్దు గ్రామాలకు లింక్‌రోడ్ల ద్వారా మహారాష్ట్ర నుంచి మద్యం దిగుమతి జరుగుతున్నట్లు తెలుస్తోంది. మద్యం లెసైన్సుల గడువు చివరికి రావడం, ఇప్పటికే టార్గెట్ పూర్తి చేసుకున్న మద్యం వ్యాపారులు అక్రమాలకు తెర లేపుతున్నట్లు తెలుస్తోంది. బ్లాక్ దందా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కొందరు మద్యం వ్యా పారులు కొత్త దందాకు తెరలేపారు. స్టాక్ లేదంటూ నో స్టాక్ బోర్డులు పెట్టేస్తున్నారు. తెరవెనుక బ్లాక్ దందాను గుట్టు చప్పుడు కాకుండా నడిపిస్తున్నారు. ఎన్నికల సమయంలో మద్యానికి ఉన్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకొ ని వ్యాపారులు అసలు ధరకన్నా అధిక మొత్తానికి మ ద్యం బాటిళ్లను బ్లాక్‌లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అయితే కొందరు మద్యం వ్యాపారులు మద్యం లేదంటూ దుకాణాలు మూసివేస్తున్నారు. మరో వైపు రా జకీయ నాయకుల ప్రచార కార్యక్రమాల్లో తిరిగే వారు మాత్రం పుష్కలంగా మందుతో విందు చేసుకుంటున్నా రు. ఇదేలా సాధ్యమంటే.. వచ్చిన మద్యం స్టాక్ రాజకీ య నాయకుల రహస్య ప్రదేశాలకు తరులుతోంది. దీం తో దుకాణాల ఎదు నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నా యి. మరోవైపు దుకాణదారులు బ్లాక్ మార్కెట్‌కు తెరలేపారు. మద్యం కావాలని ఎవరైన వస్తే మద్యం లేదని చె బుతున్నారు. ధర ఎంతైన చెల్లిస్తాం.. కచ్చితంగా మ ద్యం కావాలంటే మాత్రం ఎంఆర్పీ ధరకంటే ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. నాయకుల నుంచి ముందస్తు అర్డర్లను తీసుకుంటూ మద్యాన్ని వాహనాల్లో చేరవేస్తున్నట్లు సమాచారం. ఎంఆర్పీ ధరకంటే 30 శాతం అధిక ధరకు విక్రయిస్తున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా లక్షల్లో అక్రమ దందా సాగుతోంది. ఆ రెండు రోజుల కోసం భారీగా నిల్వలు ఎన్నికల నియమావళి ప్రకారం ఎన్నికల పోలింగ్ రోజుకంటే 48 గంటల ముందు మద్యం దుకాణాలు మూసివేస్తారు. ఈనెల 30న పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున మద్యం దిగుమతికి వ్యూహ రచన చేస్తున్నట్లు తెలుస్తోంది. చివరి రెండు రోజులు ఓటర్లకు పెద్ద మొత్తంలో మద్యం పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ రెండు రోజుల కోసమే భారీగా మద్యం నిల్వలు ఉంచుకుంటున్నారు. ఎన్నికల ప్రచారం మొత్తం మద్యం పంపిణీ ఒక ఎత్తై పోలింగ్‌కు ముందు రెండు రోజుల మద్యం పంపిణీ మరో ఎత్తు. చాలా మంది అభ్యర్థులు ప్రచారం కంటే ఎన్నికల ముందు రోజే ఎక్కువగా మద్యం పంపిణీ చేస్తుంటారు. గ్రామాల్లో రాత్రికి రాత్రే ఇంటికొక మద్యం బాటిళ్లు పంపిణీ చేస్తుంటారు. ఉదయం వరకే స్టాక్‌ను సరఫరా చేసేస్తారు. ఎన్నికల్లో ఈ ప్రభావం చాలా మట్టుకు కనిపిస్తోంది. ఏదేమైన మద్యం ఏరులై పారించడమే లక్ష్యంగా అభ్యర్థులు వ్యూహరచన చేస్తుండడంతో అధికారులు దాన్ని ఏమాత్రం అడ్డుకుంటారనేది చూడాల్సిందే.