no women in cabinet
-
ఒక్క మహిళా కూడా లేదు.. మొత్తం పురుషులతో నిండిన మంత్రివర్గం
కాబూల్: అధికారాన్ని హస్తగతం చేసుకున్న తాలిబన్లు అఫ్తానిస్తాన్‌లో మహిళలపై వివక్ష తీవ్రంగా చూపిస్తున్నారు. మహిళలపై ఇప్పటికే అనేక ఆంక్షలు విధిస్తున్న తాలిబన్ల ప్రభుత్వం ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. మొన్న మహిళా శాఖను ఎత్తేసిన ఆపద్ధర్మ ప్రభుత్వం ఇప్పుడు మంత్రివర్గాన్ని విస్తరించగా వారిలో ఒక్క మహిళకు కూడా చోటు కల్పించలేదు. 1990 కాలాన్ని మళ్లీ తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. చదవండి: యువతకు గుడ్‌న్యూస్.. నిరుద్యోగ భృతి, 80 శాతం ఉద్యోగాలు మీకే.. ఈ విషయాన్ని ఆ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించారు. ఇటీవల అఫ్గాన్‌లో ప్రధానమంత్రితో పాటు మంత్రివర్గాన్ని ఎన్నుకున్న విషయం తెలిసిందే. తాజాగా మంత్రివర్గాన్ని విస్తరించింది. ఈ సందర్భంగా ఉప మంత్రులను ఎన్నుకున్నారు. అయితే ఆ ఉప మంత్రుల్లోనూ.. కేబినెట్ మంత్రుల్లోనూ ఒక్క మహిళకు చోటు కల్పించలేదు. అయితే దీనిపై జబిహుల్లా స్పందిస్తూ ‘ఇది తాత్కాలిక ప్రభుత్వమే. భవిష్యత్‌లో మార్పులు జరుగుతాయి’ అని స్పష్టం చేశాడు. చదవండి: గురజాడ అప్పారావుకు సీఎం జగన్ ఘన నివాళి మొత్తం మహిళలను ఇంటికే పరిమితం చేయాలని అఫ్గాన్ పాలకులు నిర్ణయించారు. ఇటీవల ఓ ప్రతినిధి ‘మహిళలు పిల్లలు కనడానికి మాత్రమే పనికి వస్తారు. మంత్రులుగా కాదు’ అని పేర్కొన్న విషయం తెలిసిందే. మహిళా వ్యవహారాల శాఖను మూసేసిన తాలిబన్లు ధర్మ ప్రచార మంత్రిత్వ శాఖగా మార్చేశారు. ఆదివారం రాజధాని కాబూల్ మునిసిపాలిటీలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మహిళా సిబ్బందిని ఇళ్ల వద్దనే ఉండిపోవాలని హుకుం జారీ చేశారు. ఇక యువతులు, మహిళలు చదువుకునే హక్కును కాలరాస్తున్నారు. కేవలం పాఠశాల విద్యకే మహిళలను పరిమితం చేస్తున్నారు. అఫ్గాన్ పరిణామాలను అంతర్జాతీయ సమాజం ఖండిస్తోంది. అయితే అంతర్జాతీయంగా ఎంతటి విమర్శలు వచ్చినా కూడా తాలిబన్లు మహిళలపై వివక్ష కొనసాగిస్తూనే ఉన్నారు. షరియా చట్టాలకు అనుగుణంగా తమ పాలన ఉంటుందని తాలిబన్లు ఎప్పుడో ప్రకటించారు. తదనుగుణంగా వారి పాలన సాగుతోంది. -
మహిళలను విస్మరించిన ట్రంప్
అమెరికా కొత్త అధ్యక్షుడిగా త్వరలో బాధ్యతలు స్వీకరించనున్న డోనాల్డ్ ట్రంప్ అత్యంత ధనవంతులను తన క్యాబినెట్లోకి తీసుకోవడమే కాకుండా శ్వేత జాతీయులకే ఎక్కువ ప్రాధన్యం ఇచ్చారు. మైనారిటీలు, మహిళలను చిన్నచూపు చూశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ తర్వాత మైనారిటీలకు, మహిళలకు తక్కువ స్థానాలు కల్పించిందీ ట్రంప్ మాత్రమే. నాడు రోనాల్డ్ రీగన్ తన క్యాబినెల్లో ఒక మహిళకు, ఒక మైనారిటీ వ్యక్తికి స్థానం కల్పించగా.. ట్రంప్ తన 21 మంది క్యాబినెట్లోకి ఇద్దరు శ్వేతజాతి మహిళలను, ఇతర జాతులకు చెందిన ఇద్దరు మహిళలతో మొత్తం నలుగురు మహిళలను తీసుకున్నారు. ఒక్క నల్ల జాతీయుడికి మాత్రమే అవకాశం కల్పించారు. అధ్యక్ష పదవి నుంచి దిగిపోతున్న బరాక్ ఒబామా నలుగురు శ్వేతజాతి మహిళలు సహా మొత్తం ఏడుగురు మహిళలకు క్యాబినెట్లో స్థానం కల్పించడమే కాకుండా మైనారిటీ జాతులకు చెందిన ఏడుగురు మగవాళ్లకు క్యాబినెట్లో స్థానం కల్పించారు. జార్జి డబ్ల్యు బుష్ తన క్యాబినెట్లో ముగ్గురు శ్వేతజాతి మహిళలు సహా నలుగురు మహిళలకు, ఐదుగురు మైనారిటీ జాతులకు చెందిన వ్యక్తులకు స్థానం కల్పించారు. ఇక బిల్ క్లింటన్ నలుగురు శ్వేతజాతీయ మహిళలు సహా ఆరుగురు మహిళలకు, ఆరుగురు మైనారిటీ జాతులకు చెందిన మగవారికి తన క్యాబినెట్లో స్థానం కల్పించారు. సీనియర్ జార్జి బుష్ ఇద్దరు శ్వేత జాతీయ మహిళలకు, ముగ్గురు మైనారిటీలకు క్యాబినెట్లో స్థానం కల్పించారు. డోనాల్డ్ ట్రంప్ తన క్యాబినెట్లోకి మరో ఇద్దరు వ్యక్తులను నామినేట్ చేయాల్సి ఉంది. ఏ జాతుల నుంచి వారిని ఎంపిక చేస్తారో చూడాలి.