nominations Start
-
ప్రధాన పార్టీల్లో ఆగని అలకలు
సాక్షి, ఆదిలాబాద్: ప్రధాన పార్టీల ఎంపీ అభ్యర్థులు ఖరారై రోజులు గడిచాయి. కాంగ్రెస్, బీజేపీ నుంచి టికెట్ ఆశించి దక్కని నేతలు అలక బూనారు. కొందరు పార్టీ కూడా మారారు. నామినేషన్ ప్రక్రియ మొదలైంది. భంగపడ్డ నేతలు పార్టీకి వ్యతిరేకంగా అడుగు వేస్తారా? కలిసి నడుస్తారా? అనేది కొద్దిరోజుల్లోనే తేలనుంది. ఇక టికెట్ దక్కించుకున్న అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు రెడీ అవుతున్నారు. ‘హస్తం’ నేతలు అలక వీడేదెప్పుడో! ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ ముఖ్యనేతలు కాంగ్రెస్‌లో చేరారు. దీంతో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో హస్తం నాయకత్వం కనిపిస్తోంది. తాజాగా మాజీ ఎంపీ సముద్రాల వేణుగోపాలాచారి, బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. కాగా, టిక్కెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్, ఏఐసీసీ సభ్యుడు నరేశ్‌జాదవ్ ఇంకా ఎక్కడా ప్రచారంలో పాల్గొనడంలేదు. ఈనెల 22వ తేదీన కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ నామినేషన్ వేయనున్నారు. ఇదేరోజు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఆదిలాబాద్ పర్యటనకు రానున్నారు. జిల్లా కేంద్రంలోని డైట్ మైదానంలో బహిరంగసభకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్య నేతలతో సీఎం సమావేశం కానుండగా, అప్పటికైనా నేతలు అలక వీడుతారో.. లేదో వేచి చూడాలి. కమలంలో ‘తిరుగుబాటు’ తప్పదా? బీజేపీ గోడం నగేశ్‌కు టికెట్ ఇచ్చిన తర్వాత పార్టీలో అసమ్మతి చోటుచేసుకుంది. ఆశావహుల్లో అసంతృప్తి నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కాంగ్రెస్‌లో చేరారు. జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ తిరిగి బీఆర్ఎస్లో చేరారు. మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ సైలెంట్‌గా ఉన్నారు. కాగా, ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్ ఈనెల 24న నామినేషన్ వేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్‌సాయి ఆరోజు ఆదిలాబాద్‌కు రానున్నారు. పార్టీ టికెట్ ఆశించిన సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావుకు పార్టీలో నిరాశ ఎదురు కాగా బీజేపీ రెబెల్‌గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. 24న ఆయన కూడా నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ బీ–ఫాం అందుకున్న సక్కు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆత్రం సక్కు పేరు ఖరారై చాలా రోజులైంది. ఓ దశలో అభ్యర్థిని మార్చుతారనే ప్రచారం జరిగింది. ఈ పరిస్థితుల్లో కొంత గందరగోళం కనిపించింది. రెండ్రోజుల క్రితం మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొనగా అభ్యర్థి మార్పు లేదని స్పష్టమైంది. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో మాజీ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆత్రం సక్కు బీ–ఫాం అందుకున్నారు. ఈ నెల 23న లేదా 24వ తేదీన ఆయన నామినేషన్ వేయనున్నట్లు సమాచారం. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. తొలిరోజు రెండు నామినేషన్లు దాఖలు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి గురువారం నోటిఫికేషన్ విడుదలైంది. ఉదయం 11గంటలకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షిషా నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగనున్న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం మొదలైంది. తొలిరోజు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం జామిడి గ్రామానికి చెందిన రాథోడ్ సుభాష్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అలాగే అలయెన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఆధార్) పార్టీ తరఫున ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గంగాదేవిపాడు గ్రామానికి చెందిన మాలోత్ శ్యామ్‌లాల్‌నాయక్ నామినేషన్ వేశారు. వీరు సాదాసీదాగా అనుచరులతో వచ్చి కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజర్షిషాకు నామినేషన్ పత్రాలు అందజేశారు. పకడ్బందీ బందోబస్తు నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా పోలీసులు పకడ్బందీ బందోబస్తు నిర్వహించారు. వంద మీటర్ల పరిధి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశా రు. ఉదయం 11నుంచి మధ్యాహ్నం 3గంట ల వరకు నామినేషన్ల స్వీకరణ ఉండగా కలెక్టరేట్‌కు వెళ్లే రోడ్డుమార్గాన్ని మూసివేసి ట్రా ఫిక్‌ను మళ్లించారు. నామినేషన్లు వేసేందుకు వచ్చిన అభ్యర్థుల వాహనాలు క్షుణ్ణంగా తని ఖీ చేసి ఐదుగురినే లోనికి అనుమతించారు. గడవు ముగిసేవరకూ ముగ్గురు సీఐలు అ క్కడే విధులు నిర్వహించారు. ఆదిలాబాద్ డీ ఎస్పీ జీవన్‌రెడ్డి బందోబస్తును పరిశీలించి పలు సూచనలు చేశారు. మీడియా సెంటర్‌ను వద్ద వంద మీటర్ల పరిధిలో ఏర్పాటు చేశారు. ఇవి చదవండి: TS: డూప్లికేట్ ఓట్లపై ఫోకస్.. ఈసీ కీలక నిర్ణయం -
టీడీపీ ‘తమ్ముళ్ల’ నిరుత్సాహం..
సాక్షి, అనంతపురం: ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టంలోనే టీడీపీ కథ తేలిపోయింది. మాజీ మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీతకు తొలిరోజే షాక్ తగిలింది. రాప్తాడు బరిలో ఉంటానని ముందుగానే ప్రకటించిన ప్రొఫెసర్ రాజేష్ స్వతంత్ర అభ్యర్థిగా తొలిరోజే నామినేషన్ దాఖలు చేశారు. ఆయన రాప్తాడు టీడీపీ టికెట్ ఆశించిన సంగతి తెలిసిందే. ఇక మరో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కోడలు పల్లె సింధూరారెడ్డి గురువారం నామినేషన్ పత్రాలు సమర్పించగా, జనం కరువయ్యారు. జనంలేక.. నానా హంగామా.. భారీ జనసమీకరణతో ఆర్భాటంగా నామినేషన్ వేయాలని భావించిన ‘పల్లె’ కుటుంబ సభ్యులకు కార్యకర్తలు ఝలక్ ఇచ్చారు. భోజన వసతి ఏర్పాటు చేసి.. మద్యం, డబ్బు ఎరగా వేసి ఆహ్వానించినా జనం పెద్దగా స్పందించలేదు. ఓడిపోయే వారి వెంట ఎందుకు నడవాలని కార్యకర్తలూ రాలేదు. దీన్ని కవర్ చేసుకునేందుకు తెలుగు ‘తమ్ముళ్లు’ మద్యం మత్తులో పుట్టపర్తి రోడ్ల వెంట ఓవరాక్షన్ చేస్తూ.. సామాన్యులను ఇబ్బందులకు గురి చేశారు. బైక్‌ల సైలెన్సర్లు తీసేసి పెద్దపెద్ద శబ్ధాలతో హడావిడి చేశారు. అనంతరం కొందరు తెలుగు తమ్ముళ్లు మద్యం మత్తులో పుట్టపర్తి ఎమ్మెల్యే కార్యాలయం ముందుకు వెళ్లి హంగామా చేశారు. ప్రచారం రథం ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. వెంటనే అర్బన్ సీఐ కొండారెడ్డి అక్కడకు చేరుకుని వారిని చెదరగొట్టారు. ‘పరిటాల’కు రెబల్స్ బెడద.. రాప్తాడు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా పరిటాల సునీతను అధిష్టానం ఖరారు చేసింది. అయితే ధర్మవరం టికెట్ ఆశించి.. పొత్తులో భాగంగా బీజేపీకి ఇవ్వడంతో ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ రాప్తాడు నుంచి పోటీ చేస్తారని ప్రచారం చేస్తున్నారు. దీంతో కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. రోజుకొకరిని అభ్యర్థిగా ప్రకటిస్తే.. మిగతా ఎక్కడా నాయకులే లేరా? పరిటాల కుటుంబానికే టికెట్ ఇవ్వాలా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రాప్తాడు టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ ప్రొఫెసర్ రాజేష్.. తొలిరోజే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. దీంతో పరిటాల కుటుంబానికి తొలిరోజే షాక్ తగిలింది. ‘తమ్ముళ్ల’ నిరుత్సాహం.. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా.. టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం రాలేదు. ఆయా నియోజకవర్గాల అభ్యర్థులపై ఉన్న వ్యతిరేకతే కారణంగా కార్యకర్తలెవరూ పెద్దగా స్పందించడం లేదు. చాలా చోట్ల అభ్యర్థులను మార్చాలని అధిష్టానానికి విన్నవించినా.. చంద్రబాబు – నారా లోకేశ్ వినకుండా.. వారినే బరిలో దింపడాన్ని చాలామంది సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో టీడీపీలో కొందరు నాయకులు కొనసాగుతున్నా.. వారు అనుచరులందరినీ అధికార పార్టీ వైపు పంపిస్తున్నారు. హిందూపురం పార్లమెంటు వ్యాప్తంగా రోజుకు సగటున వంద పైగా కుటుంబాలు వైఎస్సార్సీపీ గూటికి చేరుకోవడమే ఇందుకు నిదర్శనం. తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ కొత్తచెరువు: ‘పల్లె’ నామినేషన్ అనంతరం గురువారం సాయంత్రం మండలంలోని కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన కమ్మ, బోయ సామాజిక వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జయప్ప నాయుడు, బోయ రామాంజి పుట్టపర్తిలో జరిగిన ‘పల్లె’ సింధూర నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. పార్టీలో తాము గొప్ప అంటే తాము గొప్ప అంటూ ఘర్షణ పడ్డారు. అనంతరం జయప్ప నాయుడు అక్కడినుంచి వెళ్లిపోయాడు. దీంతో రామాంజి పుట్టపర్తి, భైరాపురంలోని తన బంధువర్గాన్ని ఓ ఆటోలో తీసుకుని కమ్మవారిపల్లి వెళ్తున్నాడు. అయితే బండ్లపల్లి క్రాస్ సమీపంలో జయప్ప ఎదురుపడటంతో అతనిపై దాడికి దిగారు. వెంటనే అక్కడకు చేరుకున్న జయప్ప నాయుడు వర్గీయులు సైతం రామాంజి బంధువులపై దాడులు చేశారు. ఒకానొక దశలో ఆటోకు సైతం నిప్పుపెట్టాలని చూడగా... కొత్తచెరువుకు చెందిన ఓ టీడీపీనేత ఇరువర్గాలకు సర్దిచెప్పారు. ఈ ఘటనలో భైరాపురం గ్రామ యువకులు గాయపడినట్లు తెలుస్తోంది. ఇవి చదవండి: అక్కడ వ్యాపారుల సొమ్మంతా ప్రసాదార్పణం.. -
50 డివిజన్లు..241 వార్డులు
ఏలూరు, న్యూస్‌లైన్: జిల్లాలో పుర‘పోరు’కు పార్టీలు రె‘ఢీ’ అయ్యాయి. జిల్లాలో ఓ నగరపాలక సంస్థ, ఏడు మునిసిపాలిటీలు, ఓ నగర పంచాయతీకు ఎన్నికలు జరగనున్నాయి. కీలకమైన నామినేషన్ల స్వీకరణ ఘట్టం సోమవారం ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు ఏలూరు కార్పొరేషన్‌తో పాటు భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం, పాలకొల్లు, నిడదవోలు, కొవ్వూరు మునిసి పాలిటీలు, జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ కార్యాలయాల్లో ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లాలో మొత్తం 50 డివిజన్లు, 241 వార్డు పదవులకు అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. సోమవారం నుంచి 14వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 15న నామినేషన్ల పరిశీలన 18వ తే దీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. అనంతరం బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రదర్శిస్తారు. 30న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 2న కౌంటింగ్ చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. విజేతలు 7వ తేదీన మేయర్, డెప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకుంటారు. విజయమే లక్ష్యంగా పావులు బరిలో దిగే అభ్యర్థులను ప్రకటించే దిశగా పార్టీలు పావులు కదుపుతున్నాయి. మేయర్, చైర్మన్ పదవులను ఆశించే వారి పేర్లను బయట ప్రచారంలోకి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. బలంగా ఉన్నామనుకున్న చోట్ల, వివాదాలు లేని పట్టణాల్లో చైర్మన్ల ప్రకటన కూడా జరిగిపోయినట్టు సమాచారం. పోటీ నుంచి త ప్పుకుంటే ‘కో-ఆప్షన్’! కొన్ని వార్డులు, డివిజన్లలో పార్టీల నుంచి టికెట్ ఆశించి భంగపడాల్సిన పరిస్థితులు కొందరు అభ్యర్థులకు ఎదురయ్యాయి. అలాంటి వారు రెబల్‌గా పోటీలో నిలబడకుండా సహకరిస్తే వారికి కో-ఆప్షన్ పదవిని కట్టబెడతామని పార్టీ పెద్దలు హామీలు గుప్పిస్తున్నారు. అయినా కొన్నిచోట్ల ఈ ప్రతిపాదనకు అభ్యర్థులు అంగీకరించడం లేదని సమాచారం. నామినేషన్ల స్వీకరణ పర్వం నుంచి ఆచితూచి గెలుపు గుర్రం ఎక్కే వరకు ముందస్తు జాగ్ర త్తలను పార్టీలు పాటించే దిశగా సాగుతున్నాయి. పట్టణం వార్డులు పోలింగ్ కేంద్రాలు ఓటర్లు ఏలూరు 50 (డివిజన్లు) 170 1,33,383 భీమవరం 39 88 1,02,100 తాడేపల్లిగూడెం 35 64 71,230 పాలకొల్లు 31 43 44,518 నరసాపురం 31 45 42,566 తణుకు 34 68 72,462 నిడదవోలు 28 28 32,415 కొవ్వూరు 23 27 28,597 జంగారెడ్డిగూడెం 20 31 37,218