50 డివిజన్లు..241 వార్డులు | Municipal elections in Today issued the notification | Sakshi
Sakshi News home page

50 డివిజన్లు..241 వార్డులు

Published Mon, Mar 10 2014 2:08 AM | Last Updated on Sat, Sep 2 2017 4:31 AM

Municipal elections in Today issued the notification

ఏలూరు, న్యూస్‌లైన్: జిల్లాలో పుర‘పోరు’కు పార్టీలు రె‘ఢీ’ అయ్యాయి. జిల్లాలో ఓ నగరపాలక సంస్థ, ఏడు మునిసిపాలిటీలు, ఓ నగర పంచాయతీకు ఎన్నికలు జరగనున్నాయి. కీలకమైన నామినేషన్ల స్వీకరణ ఘట్టం సోమవారం ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు ఏలూరు కార్పొరేషన్‌తో పాటు భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నరసాపురం, పాలకొల్లు, నిడదవోలు, కొవ్వూరు మునిసి పాలిటీలు, జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ కార్యాలయాల్లో ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లాలో మొత్తం 50 డివిజన్లు, 241 వార్డు పదవులకు అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. సోమవారం నుంచి 14వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 15న నామినేషన్ల పరిశీలన 18వ తే దీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. అనంతరం బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రదర్శిస్తారు. 30న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 2న కౌంటింగ్ చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. విజేతలు 7వ తేదీన మేయర్, డెప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్‌లను ఎన్నుకుంటారు.  
 
 విజయమే లక్ష్యంగా పావులు
 బరిలో దిగే అభ్యర్థులను ప్రకటించే దిశగా పార్టీలు పావులు కదుపుతున్నాయి. మేయర్, చైర్మన్ పదవులను ఆశించే వారి పేర్లను బయట ప్రచారంలోకి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. బలంగా ఉన్నామనుకున్న చోట్ల, వివాదాలు లేని పట్టణాల్లో చైర్మన్ల ప్రకటన కూడా జరిగిపోయినట్టు సమాచారం. 
 
 పోటీ నుంచి త ప్పుకుంటే ‘కో-ఆప్షన్’!
 కొన్ని వార్డులు, డివిజన్లలో పార్టీల నుంచి టికెట్ ఆశించి భంగపడాల్సిన పరిస్థితులు కొందరు అభ్యర్థులకు ఎదురయ్యాయి. అలాంటి వారు రెబల్‌గా పోటీలో నిలబడకుండా సహకరిస్తే వారికి కో-ఆప్షన్ పదవిని కట్టబెడతామని పార్టీ పెద్దలు హామీలు గుప్పిస్తున్నారు. అయినా కొన్నిచోట్ల ఈ ప్రతిపాదనకు అభ్యర్థులు అంగీకరించడం లేదని సమాచారం. నామినేషన్ల స్వీకరణ పర్వం నుంచి ఆచితూచి గెలుపు గుర్రం ఎక్కే వరకు ముందస్తు జాగ్ర త్తలను పార్టీలు పాటించే దిశగా సాగుతున్నాయి.
 
 పట్టణం వార్డులు పోలింగ్ కేంద్రాలు ఓటర్లు
 ఏలూరు 50 (డివిజన్లు) 170 1,33,383
 భీమవరం 39 88 1,02,100
 తాడేపల్లిగూడెం 35   64 71,230
 పాలకొల్లు 31 43 44,518
 నరసాపురం 31 45 42,566
 తణుకు 34 68 72,462
 నిడదవోలు 28 28 32,415
 కొవ్వూరు 23 27 28,597
 జంగారెడ్డిగూడెం 20 31 37,218
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement