పరిశ్రమలు కాలుష్య రహితంగా ఉండాలి
కాలుష్య నియంత్రణ బోర్డు చైర్మ¯ŒS ఫణికుమార్
సాక్షి, రాజమహేంద్రవరం :
నానో టెక్నాలజీతో పరిశ్రమలను కాలుష్య రహితంగా తీర్చిదిద్దాలని. లేకుంటే ప్రజాఉద్యమాలు తప్పవని రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు చైర్మన్, మాజీ ఐఏఎస్ అధికారి జీఎ¯ŒS ఫణికుమార్ హెచ్చరించారు. స్థానిక ఓ హోటల్లో సోమవారం ‘ఎన్విరా¯ŒSమెంటల్ క్లినిక్ ఆ¯ŒS పేపర్ ఇండస్ట్రీ’అంశంపై రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు ఉభయగోదావరి జిల్లాలలోని పేపర్ పరిశ్రమల యాజమాన్యాలతో సదస్సు నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే పరిశ్రమల కాలుష్యంపై ప్రజా ఉద్యమాలు ప్రారంభమైతే వాటిని ఎవ్వరూ ఆపలేరని అన్నారు. పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్య నివారణకు అనుసరించాలి్సన పద్ధతులు, నీటిని తక్కువగా ఉపయోగించే విధానాలపై పరిశ్రమల యజమానులకు అవగాహన కల్పించారు. పేపర్ ఇండస్ట్రీ వల్ల వాయు, జల, భూమి కాలుష్యం అధికంగా ఉంటుందన్నారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని, ఇందుకోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ఇంటర్నేషనల్ పేపర్ మిల్లు కాలుష్య జలాలు గోదావరి లంకల్లోకి వదిలితే వరద వస్తే కాలుష్య జలాలు దిగువ ప్రాంతంలోని జలాలను కలుషితం చేస్తాయన్న విషయం తెలియదా అని ప్రశ్నించారు. శుద్ధి చేసిన జలాలనే గోదావరిలోకి వదలాలని ఆదేశించారు.
గోదావరి కాలుష్యం కారాదు...
రాజమహేంద్రవరంలోని పేపర్ మిల్లు కాలుష్య జలాలు, నగరంలో నుంచి కలుస్తున్న మురికి నీటితో గోదావరి కలుషితం అవుతోందని కాలుష్య నియంత్రణ బోర్డు విశాఖ జోనల్ అధికారి ఎ¯ŒSవీ భాçస్కరరావుకు తెలిపారు. పేపర్‌మిల్లు నుంచి కాలుష్య జలాలు గోదావరిలో కలుస్తున్న విషయంపై తనిఖీ చేసి చర్యలు చేపడతామని విలేకరుల ప్రశ్నకు సమాధానం చెప్పారు. గంగా ప్రక్షాళన విధంగా గోదావరి ప్రక్షాళన చేపట్టే విషయం పరిశీలిస్తామన్నారు. బోర్డు మెంబర్ బీఎస్ఎస్ ప్రసాద్, కాలుష్య నియంత్రణ నిపుణులు, పేపర్‌మిల్లుల యాజమాన్యాలు, ప్రతినిధులు పాల్గొన్నారు.