noorjahan
-
ఈ మామిడి పండు ఖరీదు రూ.1000 గురూ.. ఎందుకంటే!
ఇండోర్: వేసవి కాలం వచ్చిందంటే ఎప్పుడెప్పుడు మార్కెట్లోకి వస్తుందో అని ఎదురుచూసే పండు మామిడి. పండ్లలో రారాజుగా పిలుచుకునే ఈ పండు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు అని ప్రతీతి. బంగిన్‌పల్లి, రసాల్ వంటి రకారకాల పండ్ల ధరలు మనకు అందుబాటులో ఉంటాయి. అయితే మధ్యప్రదేశ్‌కు చెందిన ‘నూర్జాహాన్’ రకం మామిడి పండు మాత్రం చాలా ప్రత్యేకం. ఈ మామిడి పండు బరువు కిలోల్లో ఉంటుంది. ఇప్పుడు దీని ధర వెయ్యి రూపాయలు పలుకుతోంది. మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లాలో పండే ‘నూర్జహాన్’ మామిడి పళ్లకు ఈసారి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఆప్ఘాన్ మూలానికి చెందిన నూర్జహాన్ మామిడిని అలీరాజ్‌పూర్ జిల్లాలోని కత్తివాడ ప్రాంతాలో మాత్రమే పండిస్తారు. అయితే గతేడాదితో పోలిస్తే పండు పరిమాణం ఈసారి పెద్దగా ఉండడంతో.. నూర్జహాన్’ మామిడి ఒక్కోటి ఈ సీజన్లో రూ. 500 నుంచి రూ. 1000 పలుకుతోందని వాటిని పండించిన రైతులు పేర్కొంటున్నారు. "నా పండ్ల తోటలో మూడు నూర్జహాన్ మామిడి చెట్లకు 250 మామిడి పండ్లు పండాయి. ఒక్కో పండుకు రూ. 500 నుంచి రూ. 1,000 ధర పలుకుతోంది. ఈ మామిడి పండ్ల కోసం ముందుగానే బుకింగ్‌లు చేసుకుంటారు. అయితే ఈసారి నూర్జహాన్ మామిడి బరువు 2 కిలోల నుంచి 3.5 కిలోల మధ్య ఉంటుంది. 2019లో ఒక్కో పండు 2.75 కేజీల బరువుతో పండింది. అప్పట్లో అత్యధికంగా ఒక్కో పండు ధర రూ. 1,200 పలికింది." అని కత్తివాడకు చెందిన మామిడి సాగు రైతు శివరాజ్ సింగ్ జాదవ్ తెలిపారు . (చదవండి: చేతులు చాచారు.. అడ్డంగా బుక్కయ్యారు) -
నాడు మసీదులకు మహిళలు వెళ్లేవారు
న్యూఢిల్లీ : ఢిల్లీ సామ్రాజ్యానికి రారాణిగా సరిగ్గా 800 సంవత్సరాల క్రితం రజియా సుల్తాన్ ఎన్నికై ఢిల్లీ తొలి మహిళా పాలకులుగా చరిత్ర సృష్టించిన విషయం తెల్సిందే. యుద్ధరంగంలో పోరాడిన అనుభవం, ధైర్య సాహసాలతో పాటు నీతి, నిజాయితీ, వివేచన, విజ్ఞానం కలిగినప్పటికీ ఆమె ఆ పదవికి ఎన్నికవడానికి ఆదిలో పలు అవాంతరాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మహిళ కావడమే అందుకు కారణం. ఉలేమా (ముస్లిం గురువులతో కూడిన మండలి) ఆమె ఎన్నికకు తొలుత అభ్యంతరం వ్యక్తం చేసింది. రజియా సుల్తాన్ ఓ శుక్రవారం నాడు మెహ్రౌలీలోని కువ్వాతుల్ ఇస్లాం మసీద్‌కు వెళ్లి ప్రార్థనలు జరిపారు. ఆ తర్వాత ప్రార్థనల కోసం అక్కడికి వచ్చిన వారందరని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ రాజ్యాధికారం చేపట్టేందుకు తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా ఆమె కోరారు. అంతే కాకుండా మహిళలు మసీదులకు ఎక్కువగా రావాల్సిందిగా పిలుపునిచ్చారు. రజియా మహిళా పాలకులు అవడం వల్ల ఆమెను రజియా సుల్తానా అని అంటారుగానీ, ఆమె ఎప్పుడూ రజియా సుల్తాన్‌గానే చెప్పుకున్నారు. ఆమె ముఖాన ముసుగు ధరించేది కాదు, ఆమె గుర్రాలపై, ఏనుగులపై స్వారీ చేస్తూ మసీదులు, మదర్సాలను తరచుగా సందర్శించేవారు. నూర్జహాన్ సహా నాటి మొఘల్ రాజుల భార్యలు, పిల్లలు ముఖాన బుర్ఖాలు ధరించిన దాఖలాలు లేవు. ఒకప్పుడు ముస్లిం మహిళలు మసీదుల్లోకి వెళ్లి ప్రార్థనలు జరపడమే కాకుండా మసీదులను నిర్మించినట్లు కూడా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. మొఘల్ పాలకుడు జలాలుద్దీన్ అక్బర్ పెంపుడు తల్లి మహమ్ అంగా 1561లో ఢిల్లీలో ‘ఖైరుల్ మంజిల్ మసీద్’ను నిర్మించడమే కాకుండా దానికి ఆమె ప్రారంభోత్సవం చేశారు. ఆ మసీదులోని కేంద్ర ద్వారంపై మసీదు నిర్మాతగా మహమ్ అంగా పేరు కూడా చెక్కారు. మసీదులకు ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా మహిళలు వెళ్లకపోయినా పండుగలప్పుడు మాత్రం వారు తప్పకుండా వెళ్లేవారట. ఢిల్లీలో తుగ్లక్ కాలంలో నిర్మించిన వజీరాబాద్ మసీదులో ఓ పక్కన జాలిలాగా రంద్రాలున్న గోడలు ఉన్నాయి. అవి మహిళలు ప్రార్థనలు చేసుకోవడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గోడలని, వారు షాహీ దర్వాజా నుంచి నేరుగా వచ్చి ప్రార్థనలు చేసి, వెళ్లేవారని చరిత్రకారులు చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్లో నిర్మించిన అదీన మసీదులో కూడా ఓ అర్ద చంద్రాకార ద్వారంతో ఓ జాలి గోడ ప్రత్యేకంగా కనిపిస్తుంది. అది మహిళల ప్రార్థనల కోసమని సులభంగానే అర్థం అవుతుంది. ఇలా మధ్యకాలం నాటి మసీదుల్లో పాలకులు, మహిళలు ప్రార్థనలు చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. అయితే కాలక్రమేణా ఆ తర్వాత నిర్మించిన మసీదుల్లో ఆ ప్రత్యేక ఏర్పాట్లు లేకుండా పోవడమే కాకుండా మహిళలు కూడా మసీదులకు రాకుండా పోయారు. సూఫీ మందిరాలు, దర్గాలను కూడా మహిళలు తరచుగా సందర్శించారనడానికి ఆధారాలు ఉన్నాయి. ‘హజ్’ యాత్రలో మధ్య యుగాల నాటి నుంచి నేటి వరకు మహిళలు పాల్గొంటున్నారు. మక్కా, మదీనాలో వారు ప్రార్థనలు చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. (గమనిక: మసీదులకు మహిళలు వెళ్లి ప్రార్థనలు జరపడం ఇస్లాంకు వ్యతిరేకం కాదంటూ ముస్లిం పర్సనల్ లా బోర్డు సుప్రీంకోర్టుకు బుధవారం అఫిడవిట్ సమర్పించిన నేపథ్యంలో జియా ఉస్ సలామ్ రాసిన ‘విమెన్ ఇన్ మసీద్: ఏ క్వెస్ట్ ఫర్ జస్టిస్’ పుస్తకంలోని అంశాల ఆధారంగా ఈ వార్తా కథనం) -
టీడీపీకి షాక్‌ల మీద షాక్‌లు..!
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల వరద కొనసాగుతోంది. టీడీపీ నేతలు ఆ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన కీలక నేతలు వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకోగా... తాజాగా ఏలూరు టీడీపీ మేయర్ నూర్జహాన్, ఆమె భర్త ఎస్సెమ్మార్ పెదబాబు వైఎస్ జగన్ సమక్షంలో బుధవారం వైఎస్సార్సీపీలో చేరారు. టీడీపీలో అవమానాలు భరించలేకే ఆ పార్టీకి రాజీనామా చేశామని చెప్పారు. ఆళ్లనానిని ఎమ్మెల్యేగా గెలిపించి తీసుకొస్తామని భరోసానిచ్చారు. అధినేత ఆదేశిస్తే మేయర్ పదవికి రాజీనామా చేస్తానని నూర్జహాన్ స్పష్టం చేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే ఏపీ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని వ్యాఖ్యానించారు. ఏలూరు ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే వైఎస్ జగన్ ఆధ్వర్యంలో పనిచేయడానికి ముందుకొచ్చామని వెల్లడించారు. (వైఎస్సార్సీపీలో చేరిన మరో టీడీపీ ఎంపీ) తూర్పు గోదావరిలో టీడీపీకి మరో షాక్.. జిల్లాలోని జగ్గంపేట నియోజకవర్గంలో టీడీపీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే కాకినాడ ఎంపీ తోట నరసింహం, తోట వాణి, ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే పర్వత బాపనమ్మ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఇక జగ్గంపేట టీడపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రధాన అనుచరులైన ప్రముఖ పారిశ్రామికవేత్త అత్తులూరి నాగబాబు, జనపరెడ్డి సుబ్బారావు నియోజకవర్గ కో-ఆర్డినేటర్ జ్యోతుల చంటిబాబు సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నాగబాబు, జనపరెడ్డి అనుచరులు 2000 మంది కూడా వైఎస్సార్సీపీలో చేరారు. (‘ఎవరి ఒత్తిడి లేదు, అందుకే వైఎస్సార్సీపీలో చేరా’) -
వైఎస్సార్సీపీలో చేరిన ఏలూరు మేయర్ నూర్జహాన్
-
విద్యుత్ షాక్‌తో మహిళ మృతి
జమ్మలమడుగు: పట్టణంలో నాగులకట్ట ప్రాంతానికి చెందిన నూర్జహాన్(50) కరెంటు షాక్‌కు గురై మృతి చెందగా, ఆమె కోడలు మహబూబ్‌బీ గాయాలపాలైంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం ఉదయం నూర్జహాన్, మహబూబ్‌బీ కలిసి దుస్తులు ఉతికి ఆరవేయసాగారు. రెండు రోజులుగా వర్షం పడుతుండటంతో ఇంటి ఆవరణలో ఉన్న రేకులకు అర్తు వైరు తగిలి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అవుతోంది. ఇంటి ముందు భాగంలో వారు రేకులను వంచుకున్నారు. ఆ రేకుల షెడ్డు నుంచి చెట్టుకు దుస్తులను ఆరవేసేందుకు ఇనుప తీగను లాగారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అవుతున్న విషయం తెలియక నూర్జహాన్ దుస్తులను ఆరవేసే ప్రయత్నం చేసింది. కరెంటు షాక్‌తో అల్లాడుతున్న అత్తను గమనించకుండా కోడలు ఆరవేసే ప్రయత్నం చేయడంతో షాక్‌కు గురైంది. తీగలను పట్టుకుని ఇద్దరూ ఊగుతుండటంతో పక్కనే ఉన్న యువకుడు రాజు గమనించి పరుగున వచ్చి కర్ర సాయంతో మహబూబ్‌బీని రక్షించాడు. ఎక్కువ సమయం కావడంతో నూర్జహాన్‌కు కరెంటు తీగ అతుక్కు పోయింది. ఎంత ప్రయత్నించినా రాకపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. గాయాలపాలైన మహబూబ్‌బీని వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు తరలించారు. ఆమె గర్భవతి. సంఘటన స్థలాన్ని సీఐ శ్రీనివాసులు, విద్యుత్‌శాఖాధికారులు పరిశీలించారు. అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కన్నతండ్రే కాలయముడు
15 రోజుల శిశువును బండకేసి కొట్డాడు.. నాదెండ్ల, న్యూస్‌లైన్: కన్నులైనా తెరవని పసికందును కన్నతండ్రే కాలయముడుగా కర్కశంగా హత్యచేసిన సంఘటన గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరులో విషాదం నింపింది. గ్రామంలోని ఆదం షఫి, నూర్జహాన్ల కుమార్తె మిరాబీకి సత్తెనపల్లి మండలం సిరిపురం గ్రామానికి చెందిన షేక్ ఉమర్‌తో 2012 ఏప్రిల్ 19న వివాహం జరిగింది. రెండు నెలలకే మనస్పర్థలు రావడంతో మీరాబీ పుట్టింటికి వచ్చేసింది. మనసు మార్చుకున్న ఉమర్ ఆరునెలల తరువాత వచ్చి, సాతులూరులోనే అద్దె ఇంట్లో కాపురం పెట్టాడు. మళ్లీ గొడవలు రావడంతో సిరిపురం వెళ్లిపోయిన అతడు అప్పుడప్పుడు వచ్చివెళ్లేవాడు. గత నెల 23న మీరాబీ ఆడపిల్లకు జన్మనిచ్చింది. వారం నుంచి సాతులూరులోని అద్దె ఇంట్లో కాపురం పెట్టారు. రెండు రోజులుగా తనతోపాటు సిరిపురం రావాలని ఉమర్ భార్యను వేధిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం భార్యభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన ఉమర్ ముక్కుపచ్చలారని పసికందును భార్య ఒడిలోంచి లాగి బండకేసి కొట్టాడు. ఆ చిన్నారి ఆ రాక్షసచర్యతో ప్రాణాలు కోల్పోయింది. గ్రామస్తులు ఉమర్‌ను పోలీసులకు అప్పగించారు.