
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల వరద కొనసాగుతోంది. టీడీపీ నేతలు ఆ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన కీలక నేతలు వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకోగా... తాజాగా ఏలూరు టీడీపీ మేయర్ నూర్జహాన్, ఆమె భర్త ఎస్సెమ్మార్ పెదబాబు వైఎస్ జగన్ సమక్షంలో బుధవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. టీడీపీలో అవమానాలు భరించలేకే ఆ పార్టీకి రాజీనామా చేశామని చెప్పారు. ఆళ్లనానిని ఎమ్మెల్యేగా గెలిపించి తీసుకొస్తామని భరోసానిచ్చారు. అధినేత ఆదేశిస్తే మేయర్ పదవికి రాజీనామా చేస్తానని నూర్జహాన్ స్పష్టం చేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే ఏపీ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని వ్యాఖ్యానించారు. ఏలూరు ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే వైఎస్ జగన్ ఆధ్వర్యంలో పనిచేయడానికి ముందుకొచ్చామని వెల్లడించారు.
(వైఎస్సార్‌సీపీలో చేరిన మరో టీడీపీ ఎంపీ)
తూర్పు గోదావరిలో టీడీపీకి మరో షాక్..
జిల్లాలోని జగ్గంపేట నియోజకవర్గంలో టీడీపీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే కాకినాడ ఎంపీ తోట నరసింహం, తోట వాణి, ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే పర్వత బాపనమ్మ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఇక జగ్గంపేట టీడపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రధాన అనుచరులైన ప్రముఖ పారిశ్రామికవేత్త అత్తులూరి నాగబాబు, జనపరెడ్డి సుబ్బారావు నియోజకవర్గ కో-ఆర్డినేటర్ జ్యోతుల చంటిబాబు సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నాగబాబు, జనపరెడ్డి అనుచరులు 2000 మంది కూడా వైఎస్సార్‌సీపీలో చేరారు. (‘ఎవరి ఒత్తిడి లేదు, అందుకే వైఎస్సార్‌సీపీలో చేరా’)
Comments
Please login to add a commentAdd a comment