not attended
-
ఇంద్రవెల్లి సభకు రాలేను: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: గత వారం రోజులుగా తనకు జ్వరంగా ఉందని, అందుకే ఇంద్రవెల్లి దళిత, గిరి జన దండోరా సభకు తాను రాలేనని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే సభ విజయవంతం కోసం అన్ని ప్రయత్నాలు చేశామని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. నాయకులందరినీ సమన్వయం చేయడంలో కీలకపాత్ర పోషించిన తాను సభకు రానంత మాత్రాన చిలువలు పలువలు చేయొద్దని, కాంగ్రెస్ కేడర్ కూడా గందరగోళానికి గురికావద్దని వెల్లడించారు. తనకు జ్వరం వచ్చినందున కోర్టుకు కూడా వెళ్లలేకపోయానని, అందుకే వారంట్ కూడా జారీ అయిందని తెలిపారు. ఇంద్రవెల్లి సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు, శ్రేణులు కృషి చేయాలని ఆ ప్రకటనలో జగ్గారెడ్డి కోరారు. కాగా, ఆదివారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నివాసానికి వెళ్లారు. ఇంద్రవెల్లి సభ విజయవంతంపై ఆయనతో చర్చించిన రేవంత్, సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. -
విచారణకు కోల్‌కతా మాజీ చీఫ్ డుమ్మా
కోల్‌కతా: శారదా చిట్‌ఫండ్ కుంభకోణం కేసులో కోల్‌కతా మాజీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ సోమవారం సీబీఐ ఎదుట విచారణకు గైర్హాజరయ్యారు. తాను మూడు రోజులపాటు సెలవులో ఉన్నానని, వ్యక్తిగత కారణాల వల్ల వారం రోజుల వరకు హాజరు కాలేనని రాజీవ్ కుమార్ సీబీఐకి రాసిన లేఖను.. ఓ సీఐడీ అధికారి ఇక్కడి సాల్ట్ లేక్‌లోని సీబీఐ కార్యాలయంలో అందజేశారు. పలుమార్లు రాజీ వ్‌కు కాల్ చేసినా ఆయన వైపు నుంచి స్పందన లేదని సీబీఐ అధికారి ఒకరు చెప్పారు. అయినా వెనక్కి తగ్గకుండా కోల్‌కతాలోని రాజీవ్ అధికారిక నివాసానికి సీబీఐ అధికారుల బృందం వెళ్లగా ఆయన నివాసంలో లేరు. శనివారం రాజీవ్ దేశం విడిచి వెళ్లకుండా లుకౌట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. -
జగ్జీవన్‌రామ్ జయంతికి టీడీపీ నేతలు దూరం
కర్నూలు అర్బన్: దేశ ఉప ప్రధాని దివంగత బాబూ జగ్జీవన్‌రామ్ 108వ జయంతి వేడుకలకు కర్నూలు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు పలువురు దూరంగా ఉండటాన్ని దళిత సంఘాల నేతలు తప్పు పడుతున్నారు. ఉప ముఖ్యమంత్రి కేఈ క్రిష్ణమూర్తి అనంతపురంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న జయంతి కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు సమాచారం. కర్నూలు జిల్లాకు చెందిన బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి జయంతి కార్యక్రమాలకు గైర్హాజరయ్యారు. కాగా, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే విదేశీ పర్యటనలో ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్యేలు ఈ విధంగా ఉంటే మునిసిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు తదితర ప్రజా ప్రతినిధులు కూడా జయంతి వేడుకలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడం గమనార్హం.