not cooperate
-
రైల్వే విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదు
సాక్షి, హైదరాబాద్/బన్సీలాల్‌పేట్: రైల్వే లైన్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని... తెలంగాణలో అత్యంత తక్కువగా రైల్వే లైన్లు ఉండటంతో ఇక్కడ భారీ ఎత్తునరైల్వే ప్రాజెక్టుల ఏర్పాటుకు చొరవ తీసుకుంటోందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. కానీ గతేడాదిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, సహాయ నిరాకరణ వల్ల రాష్ట్రంలో దాదాపు 700 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల పనులు ముందుకు సాగడం లేదన్నారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లింపు, భూసేకరణలో బాధ్యతారాహిత్యంగా కేసీఆర్ సర్కారు వ్యవహరిస్తుండటం వల్లే ఈ పనులు నిలిచిపోయాయని ఆరోపించారు. రాష్ట్రంలో రైల్వే వ్యవస్థ అభివృద్ధికి కేంద్రం పెద్దపీట.. తెలంగాణలో రైల్వే వ్యవస్ధ అభివృద్ధికి 30 ప్రాజెక్టుల కోసం కేంద్రం రూ. 83,543 కోట్లు మంజూరు చేయడంతోపాటు 5,239 కిలోమీటర్ల మేర నూతన రైల్వే లైన్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి వెల్లడించారు. తెలంగాణ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో, ఏకకాలంలో రైల్వే ప్రాజెక్టులు చేపట్టడానికి కేంద్రం నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారని వివరించారు. దాదాపు 15 కొత్త రైల్వే లైన్ల ఏర్పాటు కోసం ఫైనల్ లొకేషన్ సర్వేకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆయన వివరించారు. దీంతోపాటు 8 లైన్ల డబ్లింగ్, 3 ట్రిప్లింగ్, 4 క్వాడ్రప్లింగ్ లైన్లకు రైల్వే శాఖ పచ్చజెండా ఊపిందని, ఈ మొత్తం ప్రాజెక్టులకు ఫైనల్ లొకేషన్ సర్వే కోసం నిధులు మంజూరయ్యాయని తెలిపారు. సర్వే పూర్తవగానే సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. రాష్ట్రంలో 40 రైల్వేస్టేషన్ల ఆధునీకరణకు రైల్వే శాఖ ఆమోదముద్ర వేయగా అందులో 21 స్టేషన్ల ఆధునీకరణకు ప్రధాని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారని కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ 40 స్టేషన్ల ఆధునీకరణ, అభివృద్ధికి కేంద్రం రూ. 2,300 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. తెలంగాణలో 2014కు ముందు ఏడాదికి సగటున 17.4 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ల నిర్మాణం జరిగితే మోదీ ప్రభుత్వం అధికారంతోకి వచ్చాక రాష్ట్రంలో ఏటా సగటున 55 కిలోమీటర్ల రైల్వే లైన్ల నిర్మాణం జరుగుతోందన్నారు. -
కోట్లు దండుకుని.. పొంతనలేని సమాధానాలు!
సాక్షి, మణికొండ: శిల్పా చౌదరికి మూడురోజుల కస్టడీ ముగిసింది. విచారణకు ఏ మాత్రం సహకరించలేదని పోలీసులు తెలిపారు. కిట్టీ పార్టీలకు పిలిచి సంపన్న మహిళల నుంచి కోట్లు దండుకున్న శిల్పాచౌదరి పొంతనలేని సమాధానాలు, కాలయాపనకే ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిసింది. ఆమెను నార్సింగి పోలీసులు రెండవ సారి కస్టడీకి తీసుకుని శుక్రవారం నుంచి విచారిస్తున్న విషయం తెలిసిందే. విచారణలో రెండవ రోజు శనివారం వాట్సాప్ గ్రూపులు, నిర్వహించిన కిట్టీ పార్టీలు, వాటికి హాజరయ్యే మహిళల వివరాలు, వారి నుంచి తీసుకున్న డబ్బు, ఎక్కడకు మళ్లించారనే విషయంలో పోలీసులు ప్రశ్నలు సంధించినట్టు తెలిసింది. అయితే.. ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పటం, పాత విషయాలు తనకు గుర్తు లేదని, కొందరు బ్లాక్ మనీని వైట్ చేయాలనే ఇచ్చారని, అప్పు రూపంలో ఎవరూ ఇవ్వలేని పేర్కొన్నట్టు సమాచారం. కిట్టీ పార్టీలతో పాటు పేకాట, స్పాలను నిర్వహించినట్టు తమ వద్ద సమా చారం ఉందని పేర్కొన్నారని అయినా.. మౌనమే సమాధానమైందని తెలిసింది. చదవండి: (పోలీసుల విచారణ.. మౌనమే శిల్పా సమాధానం?) -
కేంద్రానికి సహకరించని పశ్చిమబెంగాల్
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ప్రభుత్వం సహాయనిరాకరణ చేస్తోందని కోవిడ్–19 ప్రభావాన్ని అంచనా వేసేందుకు వచ్చిన రెండు కేంద్ర బృందాలు విమర్శించాయి. లాక్‌డౌన్‌ని కఠినంగా అమలుచేయాలని స్పష్టం చేశాయి. అలాగే తమ సభ్యుల రక్షణకు అధికార పార్టీ బాధ్యత వహిస్తుందా అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. కోల్‌కతా, సిలిగురిలో పర్యటిస్తోన్న బృందానికి అవసరమైన సమాచారం అందించడంలోనూ, ప్రభుత్వం నుంచి ఎదురైన సహాయనిరాకరణపై రెండు కేంద్ర బృందాలు ప్రభుత్వ కార్యదర్శి రాజీవ్ సిన్హాకి లేఖలు రాశాయి. ఇప్పటి వరకు నాలుగు లేఖలు రాశామనీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం రాలేదని కేంద్ర బృందానికి నేతృత్వం వహిస్తోన్న సీనియర్ అధికారి అపూర్వ చంద్ర చెప్పారు. కేంద్ర బృందం రాష్ట్రంలో ఎక్కడైనా పర్యటించే స్వేచ్ఛ ఉందనీ, అయితే వారితో కలవడం వల్ల తమ సమయం వృథా అవుతుందనీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్పారు. -
రెండో రోజు ముగిసిన ఏసీబీ విచారణ
-
ఏసీబీ విచారణకు సహకరించని రేవంత్!
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఏసీబీ అధికారుల విచారణకు సహకరించడం లేదని సమాచారం. అన్ని ప్రశ్నలకు రేవంత్ ఒకటే సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో ఏసీబీ విచారణ ముందుకు సాగడం లేదు. రేవంత్ తో ఏసీబీ రెండో రోజు విచారణ ముగిసింది. రేవంత్‌ను ఆదివారం ఉదయం ఏసీబీ హెడ్ క్వార్టర్స్‌కు తీసుకువచ్చారు. కాసేపటి తర్వాత ఏసీబీ డీజీ ఏకే ఖాన్ కార్యాలయానికి వెళ్లారు. రేవంత్ రెడ్డితో పాటు నిందితులు సెబాస్టియన్, ఉదయ్ సింహాలను ఏసీబీ అధికారులు విచారించారు. ఏసీబీ అధికారులు ప్రశ్నలకు రేవంత్ మౌనం వహించినట్టు తెలుస్తోంది. రేవంత్ కొన్నిసార్లు అసహనం వ్యక్తం చేశారని ఏసీబీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. -
విచారణకు సహకరించని రేవంత్‌రెడ్డి