
ఏసీబీ విచారణకు సహకరించని రేవంత్!
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఏసీబీ అధికారుల విచారణకు సహకరించడం లేదని సమాచారం. అన్ని ప్రశ్నలకు రేవంత్ ఒకటే సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో ఏసీబీ విచారణ ముందుకు సాగడం లేదు. రేవంత్ తో ఏసీబీ రెండో రోజు విచారణ ముగిసింది.
రేవంత్ను ఆదివారం ఉదయం ఏసీబీ హెడ్ క్వార్టర్స్కు తీసుకువచ్చారు. కాసేపటి తర్వాత ఏసీబీ డీజీ ఏకే ఖాన్ కార్యాలయానికి వెళ్లారు. రేవంత్ రెడ్డితో పాటు నిందితులు సెబాస్టియన్, ఉదయ్ సింహాలను ఏసీబీ అధికారులు విచారించారు. ఏసీబీ అధికారులు ప్రశ్నలకు రేవంత్ మౌనం వహించినట్టు తెలుస్తోంది. రేవంత్ కొన్నిసార్లు అసహనం వ్యక్తం చేశారని ఏసీబీ కార్యాలయ వర్గాలు తెలిపాయి.