Notorious criminal
-
ఇంటర్వ్యూ కోసం వెళ్తే.. కిడ్నాప్ చేశారు
ఈరోజుల్లో యూట్యూబర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. కొందరు జెన్యూన్‌గా సబ్ స్క్రైబర్లను పెంచుకునేందుకు ప్రయత్నిస్తుంటే.. మరికొందరు మాత్రం రకరకాల ఫీట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో.. కాస్త ఫేమ్ సంపాదించుకున్న ఓ యూట్యూబర్ సాహసం ప్రదర్శించబోయి చిక్కుల్లో పడ్డాడు. జార్జియాకు చెందిన యూట్యూబర్ అడిసన్ పీయెర్రె మాలౌఫ్(యూట్యూబ్‌లో YourFellowArab/Arab). ప్రపంచంలో ప్రమాదకరమైన ప్రాంతాలుగా పేరున్న చోట్లకు వెళ్తూ.. అత్యంత ప్రమాదకరమైన వ్యక్తుల్ని ఇంటర్వ్యూలు చేస్తూ ఆ వీడియోలతో 1.4 మిలియన్ సబ్స్కయిబర్లను సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో.. కరేబియన్ దేశం హైతీలో ఓ ముఠా నాయకుడ్ని ఇంటర్వ్యూ చేయాలని డిసైడ్ అయ్యాడు. మావోజో అనే ముఠా నాయకుడు జిమ్మీ ‘బార్బీక్యూ’ చెరిజైర్కు హైతీలోనే కరడుగట్టిన గ్యాంగ్ లీడర్‌గా పేరుంది. అలాంటి వ్యక్తిని ఇంటర్వ్యూ చేయడానికి అడిసన్ వెళ్లాడు. ఇందుకోసం హైతీలో ఓ స్థానిక టూరిస్ట్ సాయం తీసుకున్నాడు. అయితే.. ఆ గ్యాంగ్ ఉండే ప్రాంతానికి వెళ్లగానే వాళ్లిద్దరినీ తుపాకులతో 400 మంది చుట్టుముట్టారు. వదిలిపెట్టాలంటే 6 లక్షల డాలర్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. this is the last footage arab uploaded for me before he got kidnapped pic.twitter.com/vRbYdarPn1 — masih (@VFXmasih) March 29, 2024 తన దగ్గరున్న 40 వేల డాలర్లను వాళ్లకు ఇచ్చేసి విడిచిపెట్టమని అడిసన్ బతిమాలాడట. అయితే ఆ ముఠా అవి లాగసుకుని.. మిగతాది ఇస్తేనే రిలీజ్ చేస్తామని షాకిచ్చింది ఆ గ్యాంగ్. దీంతో తన స్నేహితుల కాంటాక్ట్ కోసం అడిసన్ ప్రయత్నిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో.. మార్చి 14వ తేదీన అడిసన్ను మావోజో ముఠా కిడ్నాప్ చేయగా, రెండు వారాలు ఆలస్యంగా ఆ విషయం బయటి ప్రపంచానికి తెలిసిందే. తోటి యూట్యూబర్ ఒకరు ఈ సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అతన్ని విడిపించేందుకు అవసరమైన డబ్బును సమీకరించేందుకు కొందరు యూట్యూబర్లు ముందుకు వచ్చారు. -
‘ఎస్కేప్’ కార్తీక్ దొరికాడు.. 80 ఇళ్లలో చోరీ, 17వసారి అరెస్ట్
సాక్షి, బెంగుళూరు: చోరీ కేసులో అరెస్ట్ అవడం.. జైలు నుంచి లేదా, పోలీసుల అదుపులో నుంచి తప్పించుకొని మళ్లీ దొంగతనాలు చేయడం అతనికి అలవాటుగా మారింది. కర్ణాటకలోని కల్యాణ్ నగర్లో నివాసం ఉంటున్న 32 ఏళ్ల కార్తిక్ కుమార్ అలియాస్ (ఎస్కేప్ కార్తిక్)ను కామాక్షిపాళ్య పోలీసులు 17వసారి అరెస్ట్ చేశారు. ఇటీవల జరిగిన ఓ చోరీ కేసులో దర్యాప్తు చేసిన పోలీసులకు ఎస్కేప్ కార్తిక్ మళ్లీ పట్టుబడ్డాడు. అతని వద్ద ఉన్న సుమారు రూ.11లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 16 ఏళ్ల వయసు నుంచే కార్తిక్‌కు చోరీలు చేయటం అలవాటుగా మారిందని పోలీసులు పేర్కొన్నారు. సుమారు 80 ఇళ్లలో దొంగతనాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. రాత్రి వేళల్లో వీధుల గుండా తిరుగుతూ ముందుగానే రెక్కీ నిర్వహించిన ఇళ్లలోకి వెళ్లి చోరీలు చేస్తాడని పోలీసులు వివరించారు. 2008లో ఓ చోరీ కేసులో అరెస్టై పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు ఉన్న సమయంలో భోజనం పంపిణీ చేసేందుకు వచ్చిన ఫుడ్ వ్యాన్‌లో దాక్కొని పారిపోయాడు. దీంతో అతనికి ‘ఎస్కేప్ కార్తీక్’ అనే పేరు వచ్చింది. పోలీసులు 45 రోజుల తర్వాత అతన్ని పట్టుకున్నారు. 2010లో మరోసారి కార్తిక్ పోలీసుల కస్టడీ నుంచి పారిపోయాడు. కామాక్షిపాళ్య పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి.. బసవేశ్వర నగర్, కేపీ అగ్రహారాల్లో కూడా కేసులు నమోదైనట్లు గుర్తించారు. -
కేక్ ముక్క ఇన్స్పెక్టర్కు కష్టాలు తెచ్చిపెట్టింది
ఢిల్లీ: తనకు తెలియకుండానే కరుడుగట్టిన నేరస్తుడికి కేక్ తినిపించి ఒక సీనియర్ ఇన్స్పెక్టర్ కష్టాలు కొనితెచ్చుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటన రెండు వారాల క్రితం జరగ్గా.. తాజాగా గురువారం ఈ ఘటనపై డీసీపీ విచారణకు ఆదేశించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. దానిష్ షేక్ హత్యయత్నం సహా ఇతర కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇటీవలే ఒక కేసు విషయమై జోగేశ్వరి పోలీసులు దానిష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. అదే స్టేషన్లో సీనియర్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న మహేంద్ర నెర్లీకర్ పుట్టినరోజు వేడుకలు హౌసింగ్ సొసైటీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆ సమయంలో దానిష్ కూడా అక్కడే ఉన్నాడు. ఈ సందర్భంగా దానిష్‌కు మహేంద్ర కేక్ తినిపించాడు. దాదాపు 15 సెకన్ల నిడివి ఉన్న వీడియో లీకవడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటనపై మహేంద్ర నెర్లీకర్ స్పందింస్తూ..'' ఇది పాత వీడియో. కూల్చివేత పనులు జరుగుతున్న హౌసింగ్ సొసైటీని సందర్శించాను. అదే రోజు నా పుట్టినరోజు కావడంతో అక్కడే కొందరు అధికారులు నా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఆ సమయంలో దానిష్ అక్కడ ఉన్నట్లు నాకు అసలు తెలియదు. ఆ వ్యక్తి ఒక అధికారి అని భావించి కేక్ తినిపించా. అనవసరంగా దీనిని ఒక ఇష్యూగా చూపిస్తున్నారు.'' అంటూ చెప్పుకొచ్చారు.ఘీ ఈ ఘటనపై డిప్యూటీ పోలీసు కమిషనర్ మహేష్ రెడ్డి ప్రాథమిక విచారణకు ఆదేశించారు. అసలు ఒక నేరస్తుడు ఆ సమయంలో అక్కడ ఎందుకు ఉన్నాడు.. అతన్ని ఎవరు తీసుకొచ్చారు అనే కోణంలో విచారిస్తున్నారు. కాగా సకినాకా డివిజన్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ఈ విచారణను నిర్వహిస్తారని తెలిపారు. ప్రస్తుతం మహేంద్ర నెర్లీకర్‌ను కంట్రోల్ రూమ్‌కు అటాచ్ చేశారు. https://t.co/FW51cp6WPu — varun seggari (@SeggariVarun) July 16, 2021 -
మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్ భరత్ హతం
యశవంతపుర : హత్యలు, వసూళ్లు, భూకబ్జాలు, కిడ్నాప్‌లు ఇలా అన్ని రకాల్లో నేరాల్లో ఆరితేరి, ముఠాలు నడుపుతూ బెంగళూరువాసులను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఘరానా రౌడీ స్లం భరత్ కథకు పుల్‌స్టాప్ పడింది. ఉత్తరప్రదేశ్‌లో దాక్కున్న అతన్ని పోలీసులు బెంగళూరుకు తీసుకురాగా, అతని అనుచరులు అడ్డగించి విడిపించుకెళ్లారు. ఈ క్రమంలో రౌడీ భరత్, పోలీసుల మధ్య ఎదురుకాల్పులు జరగ్గా నేరగాడు హతమైనట్లు పోలీసుల వెల్లడించారు. గురువారం తెల్లవారుజామున పోలీసులు జరిపిన కాల్పుల్లో పేరుమోసిన రౌడీ స్లం భరత్ హతమయ్యాడు. 20 రోజుల క్రితం పుట్టినరోజు విందులో తాగి సుబ్రమణ్యనగర సీఐ శివస్వామి, ఎస్ఐ శివరాజ్‌లను వాహనంతో ఢీకొట్టి పరారయ్యాడు. రౌడీ లక్ష్మణ హత్య కేసు, కోలారు, చిక్కబళ్లాపుర, తుమకూరు, బెంగళూరు నగరంలో స్లం భరత్ అనేక గొడవల్లో పాల్గొన్నాడు. 150 మంది అనుచరులను వెంటపెట్టుకొని బెంగళూరులో రౌడీయిజంను చలాయించాలని ప్రయత్నాలు చేశాడు. ఇతనిపై హత్య, హత్యాయత్నం, దోపిడీ, పోలీసులపై దాడులతో పాటు రాజగోపాలనగర, కామాక్షిపాళ్య, మాదనాయకనళ్లి పోలీసుస్టేషన్ పరిధిలో 50కి పైగా కేసులున్నాయి. రాష్ట్రంలోనే మోస్ట్ వాంటెడ్‌గా మారాడు. నిత్యం నేరాలతో బెంగళూరు పోలీసులకు తలనొప్పిగా మారటంతో అతనికి చెక్ పెట్టాలని నిర్ణయించారు. ఉత్తర విభాగం పోలీçసు అధికారుల ప్రత్యేక బృందాలతో వెంటాడి ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఉన్న భరత్‌ను బెంగళూరుకు తీసుకొచ్చారు. పోలీసుల వాహనంపై కాల్పులు జరిపి.. ఉత్తర విభాగం డీసీపీ శశికుమార్ కథనం మేరకు గురువారం రాత్రి రెండు గంటల సమయంలో తుమకూరు రోడ్డులోని పీణ్య ఎస్ఆర్ఎస్ బస్‌స్టేషన్ వద్ద స్లం భరత్‌ను తీసుకువస్తుండగా అనుచరులు పోలీసులు జీపును మారుతీ ఓమ్ని, జెన్ కారుతో ఢీకొట్టించారు. కొడవలి, లాంగ్ కత్తులతో పోలీసు జీపుపై దాడి చేసి పోలీసులపై రెండు రౌడ్లు కాల్పులు జరిపారు. సినిమా ఫక్కీలో పోలీసుల అదుపులో ఉన్న భరత్‌ను అనుచరులు విడిపించుకుని జెన్ కారులో పరారయ్యారు. దీంతో పోలీసులు నగరవ్యాప్తంగా పోలీసులను అలర్ట్ చేశారు. అన్ని ప్రాంతాల్లో నాకాబందీ నిర్వహించి బెంగళూరు నుంచి బయటకు వెళ్లే మార్గాల్లో మోహరించారు. హెసరఘట్ట వద్ద ఎదురుకాల్పులు తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో హెసరఘట్ట చెరువు వద్ద సోలదేవనహళ్లి సమీపంలో జెన్ కారులో స్లం భరత్ ఉన్నట్లు సమాచారం అందింది. తక్షణం రాజగోపాలనగర సీఐ దేనేశ్ పాటిల్, నందిని లేఔట్ సీఐ లోహిత్‌లు చేరుకున్నారు. తనను పట్టుకోవటానికి పోలీసులు వస్తున్న విషయంను గ్రహించి భరత్ పోలీసులపై మూడు రౌడ్లు కాల్పులు జరిపాడు. ఒక బులెట్ సీఐ దినేశ్ కడుపులోకి వెళ్లింది. గతంలో ఇతడు పోలీసులపై కాల్పులు జరిపిన ఘటనలు ఉన్న దృష్ట్యా ముందుజాగ్రత్తతో సీఐ దినేశ్ బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్‌ను ధరించాడు. దీనితో స్వల్ప గాయంతో ప్రమాదం నుండి బయట పడ్డారు. భరత్ రెండో రౌడ్‌ను పోలీసుల జీపుపై గుర్తి పెట్టి కాల్పులు జరిపాడు. లొంగిపోవాలని పోలీసులు హెచ్చరించినా భరత్ పట్టించుకోలేదు. దీనితో సీఐ లోహిత్ మొదట గాలిలోకి కాల్పులోకి తరువాత ఆత్మరక్షణ కోసం భరత్‌పై లోహిత్ జరిపిన కాల్పులు జరిపారు. భరత్‌కు బులెట్ తగలటంతో అక్కడిక్కడే కూప్పకూలి పడిపోయాడు. గాయాలైన భరత్‌ను పోలీసులు చికిత్స కోసం సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.భరత్ కాల్పుల్లో మృతి చెందిన విషయం తెలుసుకున్న అతడి అనుచరులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. దీనితో 10 మంది అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అనేక మందిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. భరత్ నేరాల చిట్టా పెద్దదే బెంగళూరులో తనదైన పంథాను సృష్టించిన భరత్ మృతి బెంగళూరు రౌడీ వర్గాల్లో కలకలం రేపింది. భరత్ అతని అనుచరుల నేర చిట్టా పెద్దదే. బెంగళూరులో అండర్‌వరల్డ్ డాన్ కావాలని కలలు కనేవాడు. 150 మంది అనుచరులను పెట్టుకుని అమాయకులను బెదిరించేవారు. రాజగోపాలనగర పోలీసుస్టేషన్ పరిధిలో జనవరి 19న మధ్యాహ్నం 1:30 గంటలకు శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంటి ముందు నిలిపిన వాహనాలను భరత్ అనుచరులు ఆరు మంది నుజ్జునుజ్జు చేశారు. అదే రోజు తెల్లవారు జామున నందినిలేఔట్లో చేతన్ అనే వ్యక్తి కారులో నిద్రిస్తుండగా భరత్ అనుచరులు దాడి చేసి అద్దాలను ధ్వసం చేశారు. అతడి వద్దనున్న 22 వేలు విలువ గల ముబైల్, డబ్బులను దోచుకెళ్లారు. పీణ్య పోలీసుస్టేషన్ పరిధిలోని తిప్పేనహళ్లి డెల్లి పబ్లిక్ స్కూల్ వద్ద జనవరి 1న హొంబేగౌడనగరలో గిరిశ్ అనే వ్యక్తి పిస్తోల్‌ను చూపించి నగదు, కారును లాక్కోని పరారయ్యారు. సోలదేవనహళ్లి పోలీసుస్టేషన్పరిధిలోని హెసరఘట్ట మెయిన్ రోడ్డులో జనవరి 21న గస్తీలో ఉన్న పోలీసు కానిస్టేబుల్స్ శ్రీనివాస్, సిద్ధలింగస్వామిలపై భరత్ అనుచరులు దాడి చేశారు. జనవరి 24న సుబ్రమణ్యపుర పోలీసులు అరెస్ట్ చేయటానికీ వెళ్లగా పోలీసులపై కారును ఎక్కించటానికీ యత్నించారు. -
లగ్జరీ కార్లు...లగ్జరీ బంగ్లా
-
సినీఫక్కీలో సైకో ఖైదీ పరార్
బెంగళూరు, న్యూస్‌లైన్: కర్ణాటక రాజధాని బెంగళూరు శివార్లలోని పరప్పన అగ్రహార జైలు నుంచి ఓ సైకో ఖైదీ శనివారం అర్ధరాత్రి దాటాక సినీఫక్కీలో తప్పించుకున్నాడు. పటిష్ట బందోబస్తు, చుట్టూ ఎత్తై గోడలు ఉన్నా అనూహ్యంగా పోలీసుల కళ్లుగప్పి 42 అత్యాచార, హత్య కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న జైశంకర్ అలియాస్ సైకో శంకర్ (36) అనే కరడుగట్టిన ఖైదీ పరారయ్యాడు. పోలీసు దుస్తుల్లో ఖాకీలకే టోకరా వేసి రెండు 15 అడుగుల గోడలతోపాటు మరో 30 అడుగుల గోడ దూకి పలాయనం చిత్తగించాడు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు 11 మంది జైలు అధికారులను సస్పెండ్ చేసింది. కర్ణాటక అదనపు డీజీపీ (జైళ్లశాఖ) కె.వి. గగన్‌దీప్ వివరాల ప్రకారం... మానసిక సమస్యలతో బాధపడుతున్న శంకర్‌ను జైలు అధికారులు అండర్‌గ్రౌండ్ సెల్లో ఉంచారు. అయితే శనివారం అర్ధరాత్రి 2 నుంచి 4 గంటల మధ్య వర్షం వల్ల జైల్లో కరెంటు పోవడంతో శంకర్ నకిలీ తాళం ఉపయోగించి సెల్లోంచి బయటకు వచ్చాడు. అనంతరం అక్కడున్న ఓ పోల్ సాయంతో బెల్ట్, గ్లౌజ్‌లు ఉపయోగించి రెండు 15 అడుగుల గోడలు దూకాడు. ఆపై వెంట తెచ్చుకున్న పోలీసు దుస్తుల్లో పలువురు సెంట్రీ సిబ్బందిని బురిడీ కొట్టించి 30 అడుగుల ప్రధాన ప్రహరీ వద్దకు చేరుకొని బెడ్‌షీట్ సాయంతో పెకైక్కి కిందకు దూకి పారిపోయాడు. ఆదివారం ఉదయం ఖైదీల హాజరు సమయంలో జైశంకర్ కనిపించకపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అతని కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.