'నాన్నను చూడాలని ఉంది.. స్కూల్‌కి వెళ్లాలి'
లెబనాన్: ఓ వైపు బాంబుల వర్షం.. ఎప్పుడు ఎవరి ఇంటిమీద పడుతుందో ఎవరు ప్రాణాలుకోల్పోతారో తెలియదు. మరోవైపు అప్పటికే బాంబుల దాడికి గురై వినిపిస్తున్న బాధితుల ఆర్తనాదాలు. ఇవి సిరియాలో ప్రతి రోజు ఏదో ఒక చోట కనిపించే సజీవ దృశ్యాలు. ఇలాంటి పరిస్థితులమధ్య ఓ తల్లి తన కుమారుడిని, నోర్ అనే ఎనిమిదేళ్లపాపను ఎత్తుకొని అరచేత ప్రాణాలుపట్టుకొని కాలినడకన బయలుదేరింది.
సిరియాలోని మౌంట్ హెర్మాన్ పర్వతం గుండా దాదాపు కొన్ని రోజులపాటు కాలినడకన దాటుకుంటూ వెళ్లి ఏదో ఒకలాగా లెబనాన్‌లో అడుగుపెట్టింది. ఆ సమయంలో నోర్ బిక్కమొహం వేసుకొని అప్పటికే సిరియాలో చిక్కుకుపోయిన తన తండ్రికోసం వెనక్కి తిరిగి చూస్తూ మరోపక్క దుప్పట్లు చేతపట్టుకొని ఆ రాళ్లమధ్యలో నడుచుకుంటూ రెండేళ్ల కిందట తల్లితో పాటు వెళ్లిపోయింది. కానీ మమకారమంతా మాతృదేశంపైనే.. తను చదువుకున్న బడిపైనే.
ప్రస్తుతం లెబనాన్ లో ఉంటున్న ఆ చిన్నారి తనకు మళ్లీ తన ఇంటికి వెళ్లిపోవాలని ఉందని, తన స్కూల్లో చదువుకోవాలని ఉందని అంటోంది. అంతేకాకుండా అప్పటి నుంచి కనిపించకుండా పోయిన తన తండ్రిని ఓసారి చూడాలని ఉందంటూ బోరుమంటోంది. ఇలాంటి విషాధగాధలు ఇప్పుడు సిరియాలో కొకొల్లలు.