నృసింహుని సన్నిధిలో నరసింహన్
మంగళగిరి: రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మంగళగిరిలో వేంచేసి ఉన్న శ్రీలక్ష్మీ నృసింహస్వామి వారిని శుక్రవారం దర్శించుకున్నారు. ఆయనకు పాలకవర్గ సభ్యులు, ఆలయ ఈవో పానకాలరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలకగా, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.