nsg team
-
బ్యాగులో బాంబు కలకలం.. పోలీసులు అలర్ట్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఐఈడీ బాంబు కలకలం సృష్టించింది. సీమపురిలో ఓ ఇంట్లోని బ్యాగులో పేలుడు పదార్ధం ఐఈడీని పోలీసులు గుర్తించారు. వివరాల ప్రకారం.. ఘాజిపూర్ పూల మార్కెట్ కేసు విచారణకు వెళ్లిన పోలీసులకు ఓ ఇంట్లో అనుమానాస్పద బ్యాగు కనిపించింది. వెంటనే బ్యాగును తెరిచి చూడటంతో బాంబు కనిపించడంతో పోలీసులు షాకయ్యారు. సమాచారం అందుకున్న బాంబ్ స్వ్కాడ్, ఎన్ఎస్జీ బృందం, స్పెషల్ సెల్ పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో ఇంటి యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. గత నెలలో పూల మార్కెట్లో 3 కేజీల ఆర్డీఎక్స్ను పోలీసులు గుర్తించారు. -
‘మన ఎన్ఎస్జీ బృందం అక్కడకు వెళ్లట్లేదు’
బంగ్లాదేశ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడుల కేసులను విచారించేందుకు భారత దేశం నుంచి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ బృందం వెళ్తోందంటూ వచ్చిన కథనాలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఖండించింది. బంగ్లాదేశ్‌కు ఎన్ఎస్జీ బృందం వెళ్తోందన్న విషయం వాస్తవం కాదని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. బంగ్లా ప్రభుత్వ అభ్యర్థన మేరకు నలుగురు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ) అధికారులను కిశోర్ గంజ్ కు పంపనున్నట్లు ఇంతకుముందు కథనాలు వచ్చాయి. షోలాకియా ఈద్గా సమీపంలో దాక్కున్న ముష్కరులను మట్టుపెట్టడంతోపాటు, దర్యాప్తులో మన ఎన్ఎస్ జీ అక్కడి సిబ్బందికి సహకరిస్తుందని అప్పట్లో అన్నారు. అయితే ఈ కథనాలను వికాస్ స్వరూప్ ఖండించారు. ఢాకాలోని భారత హైకమిషన్ వర్గాలు కూడా ఈ కథనాలను ఖండించాయి.