‘మన ఎన్ఎస్జీ బృందం అక్కడకు వెళ్లట్లేదు’ | No NSG team going to Dhaka, says MEA | Sakshi
Sakshi News home page

‘మన ఎన్ఎస్జీ బృందం అక్కడకు వెళ్లట్లేదు’

Published Fri, Jul 8 2016 7:01 PM | Last Updated on Mon, Sep 4 2017 4:25 AM

‘మన ఎన్ఎస్జీ బృందం అక్కడకు వెళ్లట్లేదు’

‘మన ఎన్ఎస్జీ బృందం అక్కడకు వెళ్లట్లేదు’

బంగ్లాదేశ్లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడుల కేసులను విచారించేందుకు భారత దేశం నుంచి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ బృందం వెళ్తోందంటూ వచ్చిన కథనాలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఖండించింది. బంగ్లాదేశ్కు ఎన్ఎస్జీ బృందం వెళ్తోందన్న విషయం వాస్తవం కాదని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు.

బంగ్లా ప్రభుత్వ అభ్యర్థన మేరకు నలుగురు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ) అధికారులను కిశోర్ గంజ్ కు పంపనున్నట్లు ఇంతకుముందు కథనాలు వచ్చాయి. షోలాకియా ఈద్గా సమీపంలో దాక్కున్న ముష్కరులను మట్టుపెట్టడంతోపాటు, దర్యాప్తులో మన ఎన్ఎస్ జీ అక్కడి సిబ్బందికి సహకరిస్తుందని అప్పట్లో అన్నారు. అయితే ఈ కథనాలను వికాస్ స్వరూప్ ఖండించారు. ఢాకాలోని భారత హైకమిషన్ వర్గాలు కూడా ఈ కథనాలను ఖండించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement