‘ఉగ్రవాదులు వచ్చిందే మీ దేశం నుంచి..’
న్యూఢిల్లీ: ఉగ్రవాది, జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ నేర చరిత్రకు సంబంధించిన ఆదారాలన్నీ కూడా పాకిస్థాన్‌కు అందుబాటులో ఉన్నాయని భారత్ స్పష్టం చేసింది. 2008లో ముంబయిలో పేలుళ్లకు సంబంధించి కీలక సూత్రదారి అయిన హఫీజ్‌ను ఇప్పటికే పాక్ ప్రభుత్వం గృహనిర్బంధం చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే పాక్ స్పందిస్తూ ముంబయి పేలుళ్లకు సంబంధించి స్పష్టమైన పకడ్బంధీ ఆధారాలు తమకు అందించాలని భారత్‌ను కోరింది. దీనికి భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ స్పందిస్తూ ముంబయి దాడికి సంబంధించిన ప్రణాళిక మొత్తం పాక్‌లోనే జరిగిందని స్పష్టం చేశారు. ఉగ్రవాదులు కూడా పాక్ నుంచే వచ్చారని, అందుకే ఆధారాలు కూడా పాక్‌లోనే ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని ఆయన బదులిచ్చారు.