Dhaka terror attack
-
‘మన ఎన్ఎస్జీ బృందం అక్కడకు వెళ్లట్లేదు’
బంగ్లాదేశ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడుల కేసులను విచారించేందుకు భారత దేశం నుంచి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ బృందం వెళ్తోందంటూ వచ్చిన కథనాలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఖండించింది. బంగ్లాదేశ్‌కు ఎన్ఎస్జీ బృందం వెళ్తోందన్న విషయం వాస్తవం కాదని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. బంగ్లా ప్రభుత్వ అభ్యర్థన మేరకు నలుగురు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ) అధికారులను కిశోర్ గంజ్ కు పంపనున్నట్లు ఇంతకుముందు కథనాలు వచ్చాయి. షోలాకియా ఈద్గా సమీపంలో దాక్కున్న ముష్కరులను మట్టుపెట్టడంతోపాటు, దర్యాప్తులో మన ఎన్ఎస్ జీ అక్కడి సిబ్బందికి సహకరిస్తుందని అప్పట్లో అన్నారు. అయితే ఈ కథనాలను వికాస్ స్వరూప్ ఖండించారు. ఢాకాలోని భారత హైకమిషన్ వర్గాలు కూడా ఈ కథనాలను ఖండించాయి. -
‘నేను అలాంటి ముస్లింను కాను’
ముంబై: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉగ్రవాదుల దాడిని బాలీవుడ్ రచయిత, హీరో సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ ఖండించారు. ఉగ్రవాదులు అమాయకులను చంపడం అమానుషమని ట్వీట్ చేశారు. ‘ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి దాడులకు పాల్పడుతున్నవారు ముస్లింలని చెబుతున్నారు. ముస్లింగా ఉండాలంటే ప్రతి ఒక్కరు ఖురాన్‌ను అనుసరించాలి. దాడులకు పాల్పడుతున్నవారు దేన్ని పాటిస్తున్నారో తెలియదు కానీ వాళ్లు ఇస్లాంను అనుసరించడం లేదు. దాడులకు పాల్పడుతున్నవాళ్లు ఏ కారణంగా అయినా ముస్లింలు కావచ్చు. నేను అలాంటి ముస్లింను కాను. అమాయకులను చంపడమంటే మానవత్వాన్ని చంపడమే’ అని సలీం ట్వీట్ చేశారు. ఉగ్రవాదులు ఢాకాలోని కేఫ్‌పై దాడిచేసి 20 మందిని అతికిరాతకంగా చంపిన సంగతి తెలిసిందే. భారత్‌కు చెందిన తరుషి జైన్ అనే అమ్మాయితో పాటు విదేశీయులు ప్రాణాలు కోల్పోయారు. -
సురక్షితంగా బయటపడ్డ బందీలు
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని రెస్టారెంట్లో ఉగ్రవాదుల చెరలో ఉన్న బందీలను విడిపించేందుకు భద్రత దళాలు చేపట్టిన ఆపరేషన్ ముగిసింది. భద్రత దళాలు ఆరుగురు ఉగ్రవాదులను హతమార్చి, మరో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నాయి. శుక్రవారం రాత్రి గుర్తుతెలియని సాయుధులు ఢాకాలోని హోలి ఆర్టిసాన్ రెస్టారెంట్లోకి చొరబడి అక్కడున్నవారిని బంధించిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు పోలీసులు సహా 20 మంది పౌరులు మరణించినట్టు బంగ్లా సైన్యం వెల్లడించింది. సైనిక ఆపరేషన్ దాదాపు 11 గంటల పాటు కొనసాగింది. ఉగ్రవాదుల చెరలో ఉన్న 18 మంది బందీలను రక్షించారు. బంగ్లాదేశ్‌లో హై ఎలర్ట్ ప్రకటించారు. పోలీసులు కూంబింగ్ కొనసాగిస్తున్నారు. ఢాకాలోని భారతీయులు క్షేమంగా ఉన్నారని భారత విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. ఈ దాడి చేసింది తామేనని ఇస్లామిక్ స్టేట్, అల్ ఖైదా ఉగ్రవాదులు వేర్వేరుగా ప్రకటించారు. విదేశీయులే లక్ష్యంగా ఉగ్రవాదులు రెస్టారెంట్‌పై దాడికి పాల్పడ్డారు. -
ఢాకాలో కొనసాగుతున్న ఆపరేషన్
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని రెస్టారెంట్లో ఉగ్రవాదుల చెరలో ఉన్న బందీలను విడిపించేందుకు భద్రత దళాల ఆపరేషన్ కొనసాగుతోంది. ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు పోలీసులు మరణించగా, 30 మందికిపైగా గాయపడ్డారు. భద్రత దళాలు ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చి, 12 మంది బందీలను విడిపించాయి. శుక్రవారం రాత్రి గుర్తుతెలియని సాయుధులు ఢాకాలోని హోలి ఆర్టిసాన్ రెస్టారెంట్లోకి చొరబడి అక్కడున్నవారిని బంధించిన సంగతి తెలిసిందే. ఈ దాడి చేసింది తామేనని ఇస్లామిక్ స్టేట్, అల్ ఖైదా ఉగ్రవాదులు వేర్వేరుగా ప్రకటించారు. విదేశీయులే లక్ష్యంగా ఉగ్రవాదులు రెస్టారెంట్‌పై దాడికి పాల్పడ్డారు. బందీలుగా ఉన్నవారిలో విదేశీయులే ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. భద్రత దళాలు రెస్టారెంట్‌ను చుట్టుముట్టి బందీలను రక్షించేందుకు ఆపరేషన్ చేపట్టాయి. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఢాకాలోని భారతీయులు క్షేమంగా ఉన్నారని భారత విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.