సురక్షితంగా బయటపడ్డ బందీలు
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని రెస్టారెంట్లో ఉగ్రవాదుల చెరలో ఉన్న బందీలను విడిపించేందుకు భద్రత దళాలు చేపట్టిన ఆపరేషన్ ముగిసింది. భద్రత దళాలు ఆరుగురు ఉగ్రవాదులను హతమార్చి, మరో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నాయి.
శుక్రవారం రాత్రి గుర్తుతెలియని సాయుధులు ఢాకాలోని హోలి ఆర్టిసాన్ రెస్టారెంట్లోకి చొరబడి అక్కడున్నవారిని బంధించిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు పోలీసులు సహా 20 మంది పౌరులు మరణించినట్టు బంగ్లా సైన్యం వెల్లడించింది. సైనిక ఆపరేషన్ దాదాపు 11 గంటల పాటు కొనసాగింది. ఉగ్రవాదుల చెరలో ఉన్న 18 మంది బందీలను రక్షించారు. బంగ్లాదేశ్లో హై ఎలర్ట్ ప్రకటించారు. పోలీసులు కూంబింగ్ కొనసాగిస్తున్నారు. ఢాకాలోని భారతీయులు క్షేమంగా ఉన్నారని భారత విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.
ఈ దాడి చేసింది తామేనని ఇస్లామిక్ స్టేట్, అల్ ఖైదా ఉగ్రవాదులు వేర్వేరుగా ప్రకటించారు. విదేశీయులే లక్ష్యంగా ఉగ్రవాదులు రెస్టారెంట్పై దాడికి పాల్పడ్డారు.