'23 జిల్లాల్లో ఎన్టీఆర్ మోడల్ స్కూల్స్'
హైదరాబాద్: దివంగత మాజీ ముఖ్యమంత్రి, మహానటుడు ఎన్టీఆర్ ఆశయసాధన కోసం కృషి చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో ఆ మహానటుడు వర్ధంతి సందర్బంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.
అనంతరం లోక్ష్ మాట్లాడుతూ... ఎన్టీఆర్ ఆశయాలు ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన ఘనత ఎన్టీఆర్ ట్రస్ట్‌కే దక్కుతుందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని మొత్తం 23 జిల్లాల్లో ఎన్టీఆర్ మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.