Nubia
-
ప్రపంచ తొలి 18జీబీ ర్యామ్ స్మార్ట్ ఫోన్ విడుదల!
సాధారణంగా హై ఎండ్ మొబైల్స్ లో అత్యధికంగా 8జీబీ ర్యామ్ లేదా ఇంకొంచం ఎక్కువ అయితే 12జీబీ ర్యామ్ ఉంటుంది. కానీ, న్యూబియా అనే కంపెనీ టెన్సెంట్ గేమ్స్ తో కలిసి 18 జీబీ ర్యామ్ గల రెడ్ మ్యాజిక్ 6 ప్రో మొబైల్ ను చైనాలో తీసుకోని వచ్చింది. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. ప్రస్తుతం చైనాలో కొనుగోలుకు కూడా సిద్ధంగా ఉంది. రెడ్ మ్యాజిక్ 6 ప్రో మొబైల్ లో మూడు వేరియంట్ లు ఉన్నాయి. రెడ్ మ్యాజిక్ 6 ప్రో 18జీబీ ర్యామ్ గల మొబైల్ లో 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తీసుకొనివచ్చారు. ఇలాంటి ఫోన్ ప్రపంచంలో ఇదే మొదటిది. రెడ్‌మ్యాజిక్ 6 & రెడ్‌మ్యాజిక్ 6 ప్రో ఫీచర్స్: వీటిలో 6.8 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ అమోల్డ్ (1,080x2,400 పిక్సెల్స్) డిస్ప్లే ఉంది. సాధారణ స్మార్ట్ఫోన్ల కంటే పెద్ద బెజెల్స్ ఉన్నాయి. 165 హెర్జ్ రీఫ్రెష్ రేటు ఉన్న ఫుల్ హెచ్డీ డిస్ప్లే కలిగి ఉంది. 500 హెర్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, మల్టీ టచ్‌లో 360 హెర్జ్ ఉంటుంంది. దీనిలో స్నాప్‌డ్రాగన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ 888ను తీసుకొచ్చారు. ఇది 5జీకి, వైఫై 6ఈకి సపోర్టు చేస్తుంది. ఎల్పీడీడీఆర్ 5 ర్యామ్, 3.1 యూఎఫ్ఎస్ స్టోరేజీ ఇస్తున్నారు. కెమెరాల విషయానికొస్తే వెనుకవైపు 64 ఎంపీ ప్రధాన కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 ఎంపీ మాక్రో కెమెరా అందిస్తున్నారు. ముందు వైపు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ మొబైల్లో బ్యాటరీ కూలింగ్ కోసం చిన్న ఫ్యాన్‌ను కూడా అందించారు. బ్యాటరీ వేడిని ఇది 16 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గిస్తుందట. వెనుకవైపు మూడు కెమెరాల సెటప్ ఉంటుంది. రెడ్ మ్యాజిక్ 6 ప్రోలో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తున్నారు. ఇది 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఇది సపోర్టు చేస్తుంది. దీంతో 17 నిమిషాల్లో బ్యాటరీని ఫుల్ చేయొచ్చు. రెడ్‌మ్యాజిక్ 6లో 5,050 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు చేస్తుంది. ఈ నెల 11 నుంచి చైనాలో, 16 నుంచి ప్రపంచ మార్కెట్లోకి ఈ మొబైల్స్ విక్రయానికి రానున్నాయి. రెడ్‌మ్యాజిక్ 6 ధర: 8జీబీ + 128జీబీ వేరియంట్ ధర: చైనా యువాన్లు 3,799 (సుమారు రూ.42,700) 12జీబీ + 128జీబీ వేరియంట్ ధర: చైనా యువాన్లు 4,099 (సుమారు రూ.46,000) 12జీబీ + 256జీబీ వేరియంట్ ధర: చైనా యువాన్లు 4,399 (సుమారు రూ.49,500) రెడ్ మ్యాజిక్ 6 ప్రో ధర: 12జీబీ + 128జీబీ వేరియంట్ ధర: చైనా యువాన్లు 4,399 (సుమారు రూ.49,550) 12జీబీ + 256జీబీ వేరియంట్ ధర: చైనా యువాన్లు 4,799 (సుమారు రూ.54,000) 16జీబీ + 256జీబీ వేరియంట్ ధర: చైనా యువాన్లు 5,299 (సుమారు రూ.59,600) 18జీబీ + 512జీబీ వేరియంట్ ధర: చైనా యువాన్లు 6,599 (సుమారు రూ.74,200) చదవండి: తొలి ట్వీట్ ఖరీదు రూ.18.30 కోట్లు! వాహనదారులకు కేంద్రం శుభవార్త! -
భారత్‌కు మళ్లీ వస్తాం..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో 135 కోట్లు దాటిన జనాభా. కోట్లాది మంది యువ కస్టమర్లు. ఉద్యోగులు, వ్యాపారులకు పెరుగుతున్న వ్యయం చేయదగ్గ ఆదాయం. ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకునే వినియోగదార్లు.. ఇంకేముంది ఈ అంశాలే తయారీ, రిటైల్ కంపెనీలకు భారత మార్కెట్ బంగారు బాతుగా నిలుస్తోంది. ముఖ్యంగా టెలివిజన్, స్మార్ట్‌ఫోన్స్ తయారీ సంస్థలకైతే ఇండియా ప్రధాన మార్కెట్ కూడా. దీంతో భారత్ నుంచి వెనుదిరిగిన ఈ రంగ కంపెనీలు మళ్లీ రీ–ఎంట్రీ ఇస్తున్నాయి. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కొత్త ఫీచర్లతో రంగంలోకి దిగుతున్నాయి. కొన్ని బ్రాండ్లు అయితే ఏకంగా ప్రైస్ వార్‌కు తెరతీస్తున్నాయి కూడా. ఐవా: దేశీయ టెలివిజన్ మార్కెట్లో ఆగస్టు 1న రీ–ఎంట్రీ ఇచ్చిన ఈ సంస్థ ఏకంగా 75 అంగుళాల 4కే స్మార్ట్ టీవీతో దర్శనమిచ్చింది. వాయిస్ కమాండ్‌తో పనిచేసే ఆరు రకాల స్మార్ట్ టీవీలను ప్రవేశపెట్టింది. టీవీల ధరల శ్రేణి రూ.7,999తో మొదలుకుని రూ.1,99,000 వరకు ఉంది. వీటితోపాటు స్మార్ట్ హోం ఆడియో సిస్టమ్స్, వైర్లెస్ హెడ్‌ఫోన్స్, బ్లూటూత్ స్పీకర్స్, పర్సనల్ ఆడియో ఉత్పత్తులను సైతం అందుబాటులోకి తెచ్చింది. వినూత్న, ఆధునిక ఫీచర్లతో ప్రొడక్టులను అన్ని ధరల శ్రేణిలో తీసుకొస్తామని ఐవా ఇండియా ఎండీ మన్మిత్ చౌదరి తెలిపారు. రానున్న రోజుల్లో రూ.200 కోట్లకుపైగా ఖర్చు చేయనున్నట్టు వెల్లడించారు. నూబియా: టెక్నాలజీ కంపెనీ జెడ్‌టీఈ అనుబంధ బ్రాండ్ అయిన నూబియా తిరిగి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. రెండేళ్ల క్రితం భారత్ నుంచి నిష్క్రమించిన ఈ బ్రాండ్ రెడ్ మేజిక్–3 పేరుతో గేమింగ్ ఫోన్ ప్రవేశపెట్టింది. 8/12 జీబీ ర్యామ్, 128/256 జీబీ ఇంటర్నల్ మెమరీ, 6.65 అంగుళాల డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, సోనీ సెన్సార్‌తో 48 ఎంపీ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరాను జోడించింది. ప్రపంచంలో తొలిసారిగా ఈ స్మార్ట్‌ఫోన్‌లో లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీతో ఇంటర్నల్ టర్బో ఫ్యాన్ పొందుపరిచారు. ఇక ఆల్ఫా పేరుతో అద్దిరిపోయే స్మార్ట్‌వాచ్‌తో ఎంట్రీ అదరగొట్టింది. ఫోల్డబుల్ ఫ్లెక్సిబుల్ డిస్ప్లే ఈ స్మార్ట్‌వాచ్ ప్రత్యేకత. హెచ్‌టీసీ: తైవాన్‌కు చెందిన ఈ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ భారత్‌లో రెండవ ఇన్నింగ్స్‌కి సిద్ధమైంది. వైల్డ్‌ఫైర్ ఎక్స్ పేరుతో కొత్త మోడల్‌ను రెండు వేరియంట్లలో ఆవిష్కరించింది. వెనుకవైపు 12, 8, 5 ఎంపీ కెమెరాలు, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా పొందుపరిచింది. ధర 4 జీబీ ర్యామ్ రూ.12,999 కాగా, 3 జీబీ ర్యామ్ మోడల్ రూ.9,999 ఉంది. ఆగస్టు 22 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తుంది. రానున్న రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వినూత్నమైన ఫీచర్లను పరిచయం చేయనున్నట్టు కంపెనీ వర్గాల సమాచారం. 2018లో కంపెనీ భారత్‌లో తన కార్యకలాపాలను నిలిపివేసింది. ప్రీమియం లుక్, నాణ్యమైన మోడళ్లతో కస్టమర్ల మది దోచిన ఈ బ్రాండ్‌కు ఇప్పటికీ మంచి ఇమేజ్ ఉంది. ఎల్జీ: డబ్ల్యూ సిరీస్‌తో భారత్‌లో రీఎంట్రీ ఇచ్చిన ఎల్జీ మొబైల్స్ ఈ ఏడాది మరో అయిదు కొత్త స్మార్ట్ఫోన్లను ప్రవేశపెట్టనుంది. డబ్ల్యూ సిరీస్‌తోపాటు విదేశాల్లో విక్రయిస్తున్న ‘జీ’, ‘క్యూ’ సిరీస్ మోడళ్లను పరిచయం చేయనుంది. ప్రస్తుతం సంస్థ ఖాతాలో అయిదు మోడళ్లున్నాయి. 2020 ఏడాది ద్వితీయార్ధానికి దేశవ్యాప్తంగా విస్తరిస్తామని ఎల్జీ మొబైల్స్ బిజినెస్ హెడ్ అద్వైత్ వైద్య సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఏడాది తర్వాత 5జీ స్మార్ట్‌ఫోన్ ‘వి–50’ని భారత్‌లో ఆవిష్కరించనుంది. 5జీలో నాయకత్వ స్థానాన్ని దక్కించుకోవాలన్నదే కంపెనీ లక్ష్యం. దక్షిణ కొరియా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఎల్జీ.. భారత్‌లో తొలిసారిగా డబ్ల్యూ సిరీస్ ద్వారా ఫోన్ల అభివృద్ధితో పాటు తయారీ కూడా చేపట్టింది. -
స్పెషల్ ఫీచర్లతో నుబియా స్మార్ట్‌ఫోన్
న్యూఢిల్లీ: నుబియా తన కొత్త స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఎన్ 1 సిరీస్ కొనసాగింపులో ‘ఎన్ 1 లైట్’ పేరుతో ఈ డివైస్‌ను సోమవారం విడుదల చేసింది. ఈ ఫోన్లు నేటి మధ్నాహ్నం 12 గం.లనుంచి వినియోగదారులకు అమెజాన్‌లో ప్రత్యేకంగా అందుబాటులో ఉంటాయని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఫింగర్ ప్రింట్ సెన్సర్, సాఫ్ట్ లైట్ ఫ్రంట్ ఫ్లాష్ తో ప్రత్యేకంగా అందుబాటులోకి తెచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ ధరను రూ.6,999గా నిర్ణయించింది. ఎన్1 లైట్ ఫీచర్స్ 5.5 ఇంచెస్ హెచ్ డీడిస్ప్లే 720x1280 రిజల్యూషన్ 2 జీబీ ర్యామ్ 16 జీబీ ఇంటర్నెల్ స్టోరేజ్, 8ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ భారతదేశంలో వినియోగదారులందరికీ అన్ని ధరల శ్రేణిలో క్లాస్ టెక్నాలజీలో అత్యుత్తమ ఉత్పత్తులను అందించడానికి తాము కట్టుబడి ఉన్నామని నుబియా ఇండియా హెడ్ ఎరిక్ హు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.