nuclear force
-
మిలిటరీ మీటింగ్‌లో కిమ్
సియోల్: గత కొంతకాలంగా జాడ లేకుండా పోయిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఈ మధ్యే ఎరువుల ఫ్యాక్టరీ ఓపెనింగ్‌లో ప్రత్యక్షమైన విషయం తెలిసిందే. ఇది జరిగి మూడు వారాలు కావస్తుండగా మరోసారి మీడియాకు చిక్కారు. కానీ ఈసారి మాత్రం ఆషామాషీ కార్యక్రమం కాదు. సెంట్రల్ మిలిటరీ కమిషన్‌తో అణ్వాయుధాల సామర్థ్యం గురించి చర్చించేందుకు సమావేశమయ్యారని అక్కడి అధికారిక మీడియా కేసీఎన్ఏ వెల్లడించింది. ఈ కార్యక్రమంలో అణుసామర్థ్యాన్ని పెంపొందించునే దిశగా విధివిధానాలను ఖరారు చేస్తున్నట్లు తెలుస్తోంది. (మొన్న కనబడింది నకిలీ కిమ్.. ఇదిగో రుజువు!) అలాగే రక్షణ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చర్చలు జరిపినట్లు సమాచారం. ఇందుకోసం సైనికా విద్యా సంస్థలను మరింత మెరుగుపర్చడం, భద్రతా వ్యవస్థలను పునర్ వ్యవస్థీకరణ చేసే దిశగానూ చర్యలు చేపట్టినట్లు తెలిపింది. ఈ సమావేశం మిలిటరీ దళాలతో గత కొద్దిరోజులుగా జరుగుతోందని కేసీఎన్ఏ పేర్కొంది. కాగా ఆమధ్య కిమ్ ఆరోగ్యం విషమించిందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. సుమారు 20 రోజుల తర్వాత ఆయన ఫ్యాక్టరీ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.. కానీ, నోరు విప్పి మాట్లాడలేదు. పైగా శరీరంలో కొన్ని మార్పులు కనిపించడంతో అతను నకిలీ కిమ్ అన్న వాదనలు తెర మీదకు వచ్చినప్పటికీ అది రుజువు కాలేదు. (20 రోజుల తర్వాత కనిపించిన కిమ్) -
భారత్ విషయంలో మాకా తెలివి ఉంది!
బీజింగ్: ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న సరిహద్దు సమస్యను పరిష్కరించుకునే తెలివి భారత్-చైనాలకు ఉందని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ సమస్య శాంతియుత పరిష్కారం కోసం భారత్-చైనా ఉమ్మడిగా చేస్తున్న కృషిని గౌరవించాలని అమెరికాకు సూచించింది. భారత్ సరిహద్దుల్లో చైనా భారీగా సైనికుల్ని మోహరిస్తుందంటూ అమెరికా రక్షణవిభాగం పెంటాగాన్ ఆరోపించడంపై చైనా స్పందించింది. 'భారత్-చైనా సరిహద్దు ప్రాంతంలో శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి, శాంతి పరిరక్షణకు చర్యలు తీసుకోవడానికి చైనా కట్టుబడింది. భారత్‌తో చర్చల ద్వారా సరిహద్దు అంశాన్ని పరిష్కరించుకోవాలని భావిస్తోంది' అని చైనా విదేశాంగ శాఖ పీటీఐ వార్తాసంస్థకు తెలిపింది. 'భారత సరిహద్దులకు సమీపంలో చైనా సైనిక మోహరింపు బాగా పెరిగిపోవడం, ఇక్కడ రక్షణ సామర్థ్యాన్ని మరింతగా పెంచుకోవడం మేం గుర్తించాం' అని అమెరికా రక్షణవిభాగం పెంటాగాన్ ఇటీవల చట్టసభ కాంగ్రెస్‌కు నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై విరవణ కోరగా చైనా విదేశాంగశాఖ స్పందిస్తూ.. సరిహద్దు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునే మేధస్సు ఇరుదేశాలకు ఉన్నదని, దీనిని వ్యతిరేకించుకోవడం అమెరికా మానుకోవాలని పేర్కొంది. -
భారత్‌పై ఉరుముతున్న చైనా!
సరిహద్దుల్లో పెరిగిన సైనిక మోహరింపు వేగంగా అణ్వాయుధాల ఆధునీకరణ చైనా ఇటీవలికాలంలో తన రక్షణ సామర్థ్యాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ పోతున్నది. అంతేకాకుండా భారత సరిహద్దుల్లో సైనిక మోహరింపు మరింతగా పెంచింది. ప్రపంచంలోని వివిధ ప్రదేశాల్లో చైనా సైనిక స్థావరాల ఉనికి కూడా పెరిగిపోతున్నది. మరీ, ముఖ్యంగా పాకిస్థాన్‌లో ఆ దేశ ప్రమేయం భారీగా ఉన్నదని అమెరికా రక్షణవిభాగం పెంటాగాన్ హెచ్చరించింది. 'భారత సరిహద్దులకు సమీపంలో చైనా సైనిక మోహరింపు బాగా పెరిగిపోవడం, ఇక్కడ రక్షణ సామర్థ్యాన్ని మరింతగా పెంచుకోవడం మేం గుర్తించాం' అని ఈస్ట్ ఆసియా వ్యవహారాలపై అమెరికా రక్షణశాఖ డిప్యూటీ సెక్రటరీ అబ్రహం డెన్మార్క్ తెలిపారు. 'చైనా సైనిక, రక్షణ అభివృద్ధి'పై ఆయన అమెరికా చట్టసభ కాంగ్రెస్‌కు 2016 వార్షిక నివేదికను సమర్పించారు. అయితే, ఇలా రక్షణ సామర్థ్యాలు పెంచుకోవడం, సైనిక మోహరింపు ఎక్కువ చేయడంపై చైనా అసలు ఉద్దేశాలేమిటో కనుగొనడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. చైనా అణ్వాయుధాల గురి ఆ 3 దేశాలపైనే అమెరికా, రష్యా, భారత్ రక్షణ సామర్థ్యానికి పోటీగానే చైనా ఇటీవలికాలంలో తన అణ్వాయుధ సామర్థ్యాన్ని మరింతగా ఆధునీకరించుకుంటున్నదని పెంటాగాన్ తెలిపింది. ఈ మూడు దేశాలతో పోటీ వల్ల తన వ్యూహాత్మక దాడి సామర్థ్యాన్ని చైనా మరింత విస్తృత పరుచుకుంటున్నదని వివరించింది. అణ్వాయుధ రంగంలోని వివిధ యూనిట్లపై మరింత నియంత్రణ సాధించడానికి ఆ దేశం ప్రయత్నిస్తున్నదని, ఇందులో భాగంగానే అణ్వాయుధాల కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్‌ను మరింత ఆధునీకరిస్తున్నదని పెంటాగాన్ తెలిపింది. మొబైల్ క్షిపణలు, వార్హేడ్స్, వాటిని స్వతంత్రంగా మోసుకెళ్లే రీ ఎంట్రీ వెహికిల్స్, వాటికి సహాయపడే యంత్రాలు.. తదితర వాటిని నూతన తరం సాకేంతకతతో విసృత పరుచుకొని.. అమెరికా, రష్యాకు దీటుగా అణ్వాయుధ నిరోధ వ్యవస్థను చైనా పటిష్టం చేసుకుంటున్నదని వివరించింది.