త్వరలో వెయ్యి నర్స్ పోస్టుల భర్తీ: లక్ష్మారెడ్డి
హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న వెయ్యి నర్స్ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి తెలిపారు. తెలంగాణరాష్ట్ర నర్స్‌ల అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ నర్సులదినోత్సవాన్ని గురువారం హైదరాబాద్ కోఠిలోని ఐఎంఏ ఆడిటోరియంలో నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి లక్ష్మారెడ్డి నైటింగేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో నర్స్‌ల డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేస్తామని, కాంట్రాక్ట్ నర్స్‌లను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారు.