లైంగిక వేధింపులపై ఫిర్యాదు
అనకాపల్లి రూరల్: ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న యువకునిపై అనకాపల్లి పట్టణ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. వెలుగు అధికారుల సమక్షంలో బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నమోదైన కేసు వివరాలు ఇలా ఉన్నాయి. అనకాపల్లి మండ లం పిసినికాడ పంచాయతీ బీఆర్టీ కాలనీకి చెందిన యల్లపు సురేష్ తమ కుమార్తె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో అనారోగ్యానికి గురైందంటూ తల్లి ధనలక్ష్మి పోలీసుస్టేషన్లో శనివారం ఫిర్యాదు చేశారు.
సమీప బంధువైన సురేష్ రోజూ ఇంటికి వస్తుంటాడని, పాపను భయపెట్టి పైశాచికంగా వ్యవహరిస్తుండడంతో ఆరు నెలలుగా ప్రసూతికి సంబంధించిన సమస్యతో బాధపడుతోందని తెలిపింది. కుటుంబ పోషణ కోసం న్యూడూల్స్ వ్యాపారం చేసుకుంటున్న తాము రాత్రి పది గంటలవరకు ఇంటికి రామని తెలిపింది. శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో పాపపట్ల అసభ్యకరంగా పవర్తించడాన్ని తన అత్త చూసిందని, దీంతో విషయం బయటకు వచ్చిందన్నారు. వెలుగు సిబ్బంది, స్థానిక డ్వాక్రా, మహిళా సంఘాల సభ్యులతో కలిసి ఫిర్యా దు చేశారు. పట్ట ణ పోలీసు లు సురేష్‌ను అదు పులోకి తీసుకొని కేసు దర్యా ప్తుచేస్తున్నారు.