oakridge
-
ఓక్రిడ్జ్‌కు రెండు టైటిళ్లు
రాయదుర్గం: హైదరాబాద్ ఫుట్‌బాల్ అకాడమీ ప్రీమియర్ లీగ్ కప్‌లో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ జట్టు ఆధిపత్యం ప్రదర్శించింది. అండర్–13, 15 విభాగాల్లో విజేతగా నిలిచి రెండు టైటిళ్లను హస్తగతం చేసుకుంది. అండర్–13 బాలుర ఫైనల్లో ఓక్రిడ్జ్ 2–1తో ఫ్యూచర్ కిడ్స్‌పై విజయం సాధించింది. అండర్–15 తుదిపోరులో 2–1తో గోల్కొండ స్కూల్‌ను ఓడించింది. మూడు నెలల పాటు సాగిన ఈ టోర్నీ ఆసాంతం రాణించిన కొత్లూరి విశాల్ ‘మ్యాన్ ఆఫ్ ది టోర్నీ’ అవార్డును గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా రెండు కేటగిరీల్లో విజేతగా నిలిచిన ఓక్రిడ్జ్ జట్టును స్కూల్ ప్రిన్సిపాల్ అర్జున్‌రావు, స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ డేవిడ్ రాజ్‌కుమార్ అభినందించారు. -
ఫ్యూచర్‌కిడ్స్, ఓక్రి డ్జ్ జట్లకు టైటిల్స్
సాక్షి, హైదరాబాద్: దేవసియా స్మారక ఇంటర్ స్కూల్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో ఫ్యూచర్‌కిడ్స్, ఓక్రిడ్జ్ స్కూల్ జట్లు టైటిల్స్ సాధించాయి. సికింద్రాబాద్‌లోని సెయింట్ ప్యాట్రిక్స్ హైస్కూల్ ప్రాంగణంలో శనివారం జరిగిన బాలికల ఫైనల్ మ్యాచ్‌లో ఫ్యూచర్ కిడ్స్ జట్టు 32-17తో ఓక్రిడ్జ్ జట్టుపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఫ్యూచర్‌కిడ్స్ తరఫున ధాత్రి (8), ఆర్య (8)... ఓక్రిడ్జ్ జట్టులో రిషిక (6), హానియా (5) ప్రతిభ కనబరిచారు. బాలుర ఫైనల్లో ఓక్రిడ్జ్ జట్టు 27-10తో ఫ్యూచర్‌కిడ్స్ జట్టును ఓడించింది. ఈ మ్యాచ్‌లో హృతిక్ (10), శ్రీరామ్ (8) ఓక్రిడ్జ్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అంతకు ముందు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో బాలికల విభాగంలో ఫ్యూచర్‌కిడ్స్ జట్టు 24-08తో సెయింట్ ఆండ్రూస్ జట్టుపై, ఓక్రిడ్జ్ జట్టు 17-11తో హోలీ ఫ్యామిలీ జట్టుపై విజయం సాధించాయి. బాలుర సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో ఓక్రిడ్జ్ జట్టు 29-17తో ఆల్ సెయింట్స్ జట్టుపై, ఫ్యూచర్ కిడ్స్ జట్టు 25-20తో ఎంజీఎం జట్టుపై గెలుపొందాయి. -
బాస్కెట్‌బాల్ చాంప్స్ ఓక్రిడ్జ్, నీరజ్ స్కూల్స్
హైదరాబాద్: రామేందర్ రెడ్డి మెమోరియల్ ఇంటర్ స్కూల్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో నీర జ్ ఇంటర్నేషనల్ స్కూల్, ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ విజేతలుగా నిలిచాయి. ఆదివారం ఉత్కంఠభరితంగా జరిగిన బాలుర ఫైనల్ మ్యాచ్‌లో నీరజ్ ఇంటర్నేషనల్ స్కూల్ 47- 45తో సుచిత్ర అకాడమీపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో నీరజ్ స్కూల్ తరఫున కునాల్ (31), షహబ్ (8)... సుచిత్ర అకాడమీ జట్టులో వాగేశ్ (25), సర్వేశ్ (13) మెరిశారు. బాలికల ఫైనల్లో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ 15- 11తో నీరజ్ ఇంటర్నేషనల్ స్కూల్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచింది. ఓక్రిడ్జ్ తరఫున స్వాతి 5 పాయింట్లు సాధించగా... నీరజ్ జట్టులో వీణ 7పాయింట్లు, సిమ్రన్ 3పాయింట్లు స్కోర్ చేశారు. అంతకుముందు జరిగిన బాలికల సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో ఓక్రిడ్జ్ స్కూల్ 21-7తో సాధు వశ్వాని ఇంటర్నేషనల్ స్కూల్‌ను ఓడించగా... నీరజ్ ఇంటర్నేషనల్ స్కూల్ 25- 12తో సుచిత్ర అకాడమీపై గెలుపొందింది. -
సందడిగా ‘ఓక్రిడ్జ్’ వార్షికోత్సవం