బాస్కెట్‌బాల్ చాంప్స్ ఓక్రిడ్జ్, నీరజ్ స్కూల్స్ | oakridge and neeraj schools won basket ball titles | Sakshi
Sakshi News home page

బాస్కెట్‌బాల్ చాంప్స్ ఓక్రిడ్జ్, నీరజ్ స్కూల్స్

Published Mon, Aug 8 2016 11:45 AM | Last Updated on Mon, Sep 4 2017 8:25 AM

oakridge and neeraj schools won basket ball titles

హైదరాబాద్: రామేందర్ రెడ్డి మెమోరియల్ ఇంటర్ స్కూల్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌లో నీర జ్ ఇంటర్నేషనల్ స్కూల్, ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ విజేతలుగా నిలిచాయి. ఆదివారం ఉత్కంఠభరితంగా జరిగిన బాలుర ఫైనల్ మ్యాచ్‌లో నీరజ్ ఇంటర్నేషనల్ స్కూల్ 47- 45తో సుచిత్ర అకాడమీపై విజయం సాధించింది.

 

ఈ మ్యాచ్‌లో నీరజ్ స్కూల్ తరఫున కునాల్ (31), షహబ్ (8)... సుచిత్ర అకాడమీ జట్టులో వాగేశ్ (25), సర్వేశ్ (13) మెరిశారు. బాలికల ఫైనల్లో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ 15- 11తో నీరజ్ ఇంటర్నేషనల్ స్కూల్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచింది. ఓక్రిడ్జ్ తరఫున స్వాతి 5 పాయింట్లు సాధించగా... నీరజ్ జట్టులో వీణ 7పాయింట్లు, సిమ్రన్ 3పాయింట్లు స్కోర్ చేశారు. అంతకుముందు జరిగిన బాలికల సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో ఓక్రిడ్జ్ స్కూల్ 21-7తో సాధు వశ్వాని ఇంటర్నేషనల్ స్కూల్‌ను ఓడించగా... నీరజ్ ఇంటర్నేషనల్ స్కూల్ 25- 12తో సుచిత్ర అకాడమీపై గెలుపొందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement