
సాక్షి, హైదరాబాద్: ఎన్‌బీఏ డ్రీమ్ జూనియర్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌లో ఆతిథ్య స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్ (ఎస్‌సీఎఫ్) బాలికల జట్టు అండర్–12 విభాగంలో టైటిల్ గెలిచింది. ఫైనల్లో ఎస్‌సీఎఫ్ 8–0 స్కోరుతో ఆల్ సెయింట్స్ జట్టుపై నెగ్గింది. బాలుర విభాగంలో నిజామ్ కాలేజి అకాడమీ విజేతగా నిలిచింది. ఫైనల్లో నిజామ్ జట్టు 9–7తో ఎస్‌సీఎఫ్‌పై గెలిచింది. అండర్–14 బాలికల ఫైనల్లో సెయింట్ పాయిస్ హైస్కూల్ 6–4తో ఎస్.ఎమ్.ఆర్. కమ్యూనిటీ అకాడమీపై విజయం సాధించింది. బాలుర టైటిల్‌ను సీసీఓబీ చేజిక్కించుకుంది. తుదిపోరులో సీసీఓబీ 9–7తో సెయింట్ జోసెఫ్ హైస్కూల్‌ను ఓడించింది. అండర్–16 బాలికల టైటిల్ పోరులో సెయింట్ జోసెఫ్ 12–4తో సెయింట్ ఆన్స్‌పై నెగ్గింది. బాలుర ఈవెంట్‌లో ఎన్‌సీసీ 13–9తో సీసీఓబీపై గెలిచి విజేతగా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment