భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ గురువారం నగరంలో సందడి చేశారు. కేవీబీఆర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఆలిండియా వీల్‌చెయిర్ బాస్కెట్ బాల్ టోర్నమెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసి అభిమానులను అలరించారు.
వీల్‌చెయిర్ బాస్కెట్‌బాల్ ఆకట్టుకుంది: సెహ్వాగ్
జూబ్లీహిల్స్: తన జీవితంలో మొదటిసారిగా చూస్తున్న వీల్‌చెయిర్ బాస్కెట్‌బాల్ క్రీడ తననెంతో ఆకట్టుకుందని భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నారు. యూసుఫ్‌గూడ కేవీబీఆర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఆలిండియా వీల్‌చెయిర్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌కు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. గురువారం జరిగిన పురుషుల ఫైనల్లో తమిళనాడుపై మహారాష్ట్ర జట్టు గెలుపొంది విజేతగా నిలిచింది. పంజాబ్ జట్టుకు మూడో స్థానం దక్కింది. మహిళల విభాగంలో తమిళనాడు, కేరళ, కర్ణాటక జట్లు వరుసగా తొలి మూడు స్థానాలను సాధించాయి. ఫైనల్ అనంతరం సెహ్వాగ్ మాట్లాడుతూ సరైన ప్రోత్సాహం అందిస్తే దివ్యాంగులు అద్భుతాలు చేస్తారని అన్నారు. దివ్యాంగులను ప్రతీ ఒక్కరూ ప్రోత్సహించాలని కోరారు. విజేతలకు ట్రోఫీలు అందజేసారు. ఈ కార్యక్రమంలో వీల్‌చెయిర్ బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ అధ్యక్షురాలు మాధవీలత, కళ్యాణి రాజారామన్, శాట్స్ ఎండీ దినకర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment