ఫ్యూచర్‌కిడ్స్, ఓక్రి డ్జ్ జట్లకు టైటిల్స్ | future kids, oakridge teams won titles in inter ball basket ball | Sakshi
Sakshi News home page

ఫ్యూచర్‌కిడ్స్, ఓక్రి డ్జ్ జట్లకు టైటిల్స్

Published Sun, Aug 21 2016 12:15 PM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM

future kids, oakridge teams won titles in inter ball basket ball

సాక్షి, హైదరాబాద్: దేవసియా స్మారక ఇంటర్ స్కూల్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌లో ఫ్యూచర్‌కిడ్స్, ఓక్రిడ్జ్ స్కూల్ జట్లు టైటిల్స్ సాధించాయి. సికింద్రాబాద్‌లోని సెయింట్ ప్యాట్రిక్స్ హైస్కూల్ ప్రాంగణంలో శనివారం జరిగిన బాలికల ఫైనల్ మ్యాచ్‌లో ఫ్యూచర్ కిడ్స్ జట్టు 32-17తో ఓక్రిడ్జ్ జట్టుపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఫ్యూచర్‌కిడ్స్ తరఫున ధాత్రి (8), ఆర్య (8)... ఓక్రిడ్జ్ జట్టులో రిషిక (6), హానియా (5) ప్రతిభ కనబరిచారు. బాలుర ఫైనల్లో ఓక్రిడ్జ్ జట్టు 27-10తో ఫ్యూచర్‌కిడ్స్ జట్టును ఓడించింది. ఈ మ్యాచ్‌లో హృతిక్ (10), శ్రీరామ్ (8) ఓక్రిడ్జ్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

 

అంతకు ముందు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో బాలికల విభాగంలో ఫ్యూచర్‌కిడ్స్ జట్టు 24-08తో సెయింట్ ఆండ్రూస్ జట్టుపై, ఓక్రిడ్జ్ జట్టు 17-11తో హోలీ ఫ్యామిలీ జట్టుపై విజయం సాధించాయి. బాలుర సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో ఓక్రిడ్జ్ జట్టు 29-17తో ఆల్ సెయింట్స్ జట్టుపై, ఫ్యూచర్ కిడ్స్ జట్టు 25-20తో ఎంజీఎం జట్టుపై గెలుపొందాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement