ఫ్యూచర్ కిడ్స్, ఓక్రిడ్జ్ స్కూల్ జట్లకు టైటిల్స్ | inter school basket ball tourney finish | Sakshi
Sakshi News home page

ఫ్యూచర్ కిడ్స్, ఓక్రిడ్జ్ స్కూల్ జట్లకు టైటిల్స్

Published Sun, Jul 31 2016 9:14 AM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

ఫ్యూచర్ కిడ్స్, ఓక్రిడ్జ్ స్కూల్ జట్లకు టైటిల్స్ - Sakshi

ఫ్యూచర్ కిడ్స్, ఓక్రిడ్జ్ స్కూల్ జట్లకు టైటిల్స్

సాక్షి, హైదరాబాద్: బ్రదర్ జగన్, బ్రదర్ రవి స్మారక ఇంటర్ స్కూల్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌లో ఫ్యూచర్ కిడ్స్, ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ జట్లు చాంపియన్లుగా నిలిచాయి. శనివారం జరిగిన బాలికల ఫైనల్  మ్యాచ్‌లో ఫ్యూచర్ కిడ్స్ జట్టు 30-11తో హోలీ ఫ్యామిలీ జట్టుపై గెలుపొందింది. ఫ్యూచర్ కిడ్స్ తరఫున ధాత్రి 8 పాయింట్లు, నిధి 7 పాయింట్లు సాధించగా... హోలీ ఫ్యామిలీ తరఫున శివాని 8 పాయింట్లు రాబట్టింది.

బాలుర ఫైనల్స్‌లో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ 45-22 స్కోరుతో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డీపీఎస్)ను ఓడించింది. ఓక్రిడ్జ్ తరఫున హృతిక్ (10), శ్రీరామ్ (15) రాణించగా... డీపీఎస్ తరఫున సుజీత్ (12) ఆకట్టుకున్నాడు. తెలంగాణ బాస్కెట్‌బాల్ సంఘం కార్యదర్శి నార్మన్ ఐజాక్ విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ బాస్కెట్‌బాల్ ఆటగాడు నిహాల్ యాదవ్, సెయింట్ పాల్స్ హైస్కూల్ ప్రిన్సిపాల్ రాయప్ప రెడ్డి, పీఈటీ సంజీవ్ రావు, ఫ్యూచర్‌కిడ్స్ పాఠశాల కోచ్ అరవింద్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement