ఫైనల్లో ఫ్యూచర్ కిడ్స్, హోలీ ఫ్యామిలీ | future kids, holy family school teams entered final of inter school basket ball tourny | Sakshi
Sakshi News home page

ఫైనల్లో ఫ్యూచర్ కిడ్స్, హోలీ ఫ్యామిలీ

Published Sat, Jul 30 2016 2:57 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

future kids, holy family school teams entered final of inter school basket ball tourny

హైదరాబాద్: బ్రదర్ జగన్ మోహన్ రెడ్డి, బ్రదర్ రవి స్మారక ఇంటర్ స్కూల్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌లో ఫ్యూచర్ కిడ్స్, హోలీ ఫ్యామిలీ స్కూల్ జట్లు ఫైనల్లోకి దూసుకెళ్లాయి. శుక్రవారం జరిగిన బాలికల విభాగం సెమీఫైనల్స్‌లో ఫ్యూచర్ కిడ్స్ 27-12తో ఓక్రిడ్జ్ స్కూల్‌పై, హోలీ ఫ్యామిలీ జట్టు 17-5తో చిరెక్ పబ్లిక్ స్కూల్‌పై విజయం సాధించాడు. 

 

అంతకుముందు జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో హోలీ ఫ్యామిలీ 20-5తో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (ఖాజాగూడ)పై, చిరెక్ స్కూల్ 31-13తో సెయింట్ పాయిస్ స్కూల్‌పై నెగ్గాయి. బాలుర విభాగం క్వార్టర్ ఫైనల్స్‌లో ఓక్రిడ్జ్ 22-5తో లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ (ఆబిడ్స్)పై, మెరిడియన్ స్కూల్ 28-5తో చిరెక్ స్కూల్‌పై, ఫ్యూచర్ కిడ్స్ 36-21తో సెయింట్ పాల్స్‌పై, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (సికింద్రాబాద్) 20-9తో ఎంజీఎం స్కూల్‌పై గెలిచాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement