obulapathi
-
పిడుగుపాటుకు గొర్ల కాపరి మృతి
కళ్యాణదుర్గం రూరల్ : కళ్యాణదుర్గం రూరల్ మండలం తూర్పుకోడిపల్లి సమీపంలో పిడుగుపడి అదే గ్రామానికి చెందిన బలికొండప్ప కుమారుడు ఓబుళపతి(35) అనే గొర్ల కాపరి గురువారం మృతి చెందినట్లు రూరల్ ఎస్ఐ నబీరసూల్ తెలిపారు. ఓబుళపతి మేత కోసం మేకలను పొలాల వద్దకు తోలుకెళ్లాడన్నారు. సాయంత్రం ఇంటికి తిరిగొస్తుండగా వర్లి వ్యవసాయ పొలాల వద్ద ఒక్కసారిగా పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందినట్లువవివరించారు. పరిసరాల్లో పని చేసే వారు గమనించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా. అప్పటికే అతను చనిపోయినట్లు పరీక్షించిన వైద్యులు నిర్ధారించారు. మృతుని భార్య లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతునికి ఒక కుమారుడు, కుమార్తె కూడా ఉన్నారు. -
సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
పుట్టపర్తి టౌన్ : ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్‌టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులపతి ఆరోపించారు. స్థానిక సాయి ఆరామంలో ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాక్రిష్ణారెడ్డి అధ్యక్షతన ప్రాంతీయ సమావేశం నిర్వహించారు.ముఖ్య అతిథిగా ఓబులపతి మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఉపాధ్యాయ రంగానికి చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారన్నారు. అధికారం చేపట్టాక వాటిని విస్మరించారన్నారు. ఉపాధ్యాయులకు రెండు డీఏలను ఇవ్వలేదన్నారు. డీవైఈఓ, డైట్ లెక్చరర్, ఎంఈఓ ఖాళీలను భర్తీలో నిర్లక్ష్యధోరణి అనుసరిస్తున్నారని విమర్శించారు. స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, కార్పొరేట్ వైద్యశాలల్లో నగదు రహిత వైద్యం అందజేయాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేవీ సుబ్బా రెడ్డికి మద్దతు తెలపాలని ఉపాధ్యాయులను కోరారు. ఫెడరేషన్ రాష్ర్ట ఉపాధ్యక్షుడు గిరిధర్‌రెడ్డి, నాయకులు ఫల్గుణ ప్రసాద్, పవన్‌కుమార్, మల్లోబులు , ప్రకాష్‌రెడ్డి, చెన్నారెడ్డి, రమణారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
'పదో పీఆర్సీ అమలు చేయాలి'
అనంతపురం: ఉపాధ్యాయులకు పదో పీఆర్సీ 43 శాతం ఫిట్మెంట్తో తక్షణం అమలు చేయాలని వైఎస్ఆర్టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబుళపతి డిమాండ్ చేశారు. వైఎస్ఆర్టీఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం అనంతపురం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ఆందోళనకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2.50 లక్షల మంది ఉపాధ్యాయులు సమస్యలతో సతమతమవుతున్నారన్నారు. వీటి పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోందంటూ ధ్వజమెత్తారు. ప్రకటించిన పీఆర్సీని ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. రాజకీయ బదిలీలను రద్దు చేయాలని, బదిలీల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. తొమ్మిది నెలలుగా ప్రీమియం చెల్లిస్తున్నా వైద్యం అందడం లేదని వాపోయారు. తక్షణం ఆరోగ్య కార్డులు ఇచ్చి అన్ని ఆస్పత్రులలో ఉచిత వైద్య సౌకర్యం కల్పించాలని కోరారు. రూ.398తో పని చేసిన ప్రత్యేక ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం జాయంట్ కలెక్టర్‌కి వినతిపత్రం అందజేసి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అశోక్‌కుమార్‌రెడ్డి, పుల్లారెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు. -
'ఉపాధ్యాయ సమస్యలపై ప్రభుత్వం దిగి రావాలి'
అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దిగిరావాలంటూ వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులపతి డిమాండ్ చేశారు. శనివారం విలేకర్లతో మాట్లాడిన ఆయన.. ఉపాధ్యాయలకు 60 శాతం ఫిట్మోంట్తో పీఆర్సీని అమలుచేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకు నిరసనగా ఈ నెల 20న ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఈ రోజు ధర్నా పోస్టర్ ను వైఎస్సార్ టీఎఫ్ నేతలు అశోక్ కుమార్ రెడ్డి, ఓబులపతి విడుదల చేశారు.