వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ
ఏలూరు (ఆర్ఆర్ పేట): ఇండియన్ టుబాకో కంపెనీ (ఐటీసీ) ప్రధమ్ సంస్థ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన 18 నుంచి 30 ఏళ్లలోపు యువతీయువకులకు ఒకేషనల్ స్కిల్స్‌లో శిక్షణ ఇ్వనున్నారు. ప్రాథమిక పరీక్ష ఆధారంగా ఇంటర్వూ్య నిర్వహించి ఎంపికైన అభ్యర్థులకు ఆటోమోటివ్, కంప్యూటర్, ఎలక్ట్రీషియన్, కన్స్ట్రక్షన్, హెల్త్‌కేర్, బ్యూటీషియన్, హోటల్‌మేనేజ్‌మెంట్ తదితర రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశాలు కల్పిస్తారు. శిక్షణ కాలంలో భోజనం, వసతి, యూనిఫాం, మెటీరియల్ అందిస్తామని కో–ఆర్డినేటర్ ఎం.శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాలకు 9052380148, 9849066402లో సంప్రదించాలని కోరారు.