occultist
-
బ్రేకప్: ప్రియుడి కోసం మాంత్రికుడ్ని నమ్మి...
ముంబై : తన నుంచి విడిపోయిన ప్రియుడ్ని వెనక్కు రప్పించటానికి మాంత్రికుడ్ని ఆశ్రయించిన ఓ యువతి దారుణంగా మోసపోయింది. అతడి మాయలో పడి లక్షల రూపాయలు పోగొట్టుకుంది. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో ఆదివారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... ఖార్‌ఘర్‌కు చెందిన ఓ యువతికి కొన్ని నెలల క్రితం ప్రియుడితో బ్రేకప్ అయింది. ఆమెను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని చెప్పి, ప్రియుడు ముఖం చాటేశాడు. దీంతో అప్పటినుంచి మానసికంగా కృంగిపోయింది. ఇలాంటి సమయంలో రైలు బోగిలో అంటించిన పోస్టర్లను చూసింది. అవి ఓ మాంత్రికుడికి సంబంధించిన ప్రకటన పోస్టర్లు. తాను ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చూపుతానంటూ ఆ పోస్టర్ ప్రకటనలో పేర్కొన్నాడు ఆ మాంత్రికుడు. ఈ నేపథ్యంలో యువతి మాంత్రికుడు కరీమ్ ఖాన్‌ను ఆశ్రయించింది. ఆమె ప్రియుడ్ని వెనక్కు రప్పిస్తానని, ఇద్దరికీ పెళ్లి అయ్యేలా చేస్తానని నమ్మబలికాడు. అతడికి వచ్చే పెళ్లి సంబంధాలన్నీ చెడగొడతానని చెప్పాడు. ఇందుకోసం మీరట్ దర్గాలో కొన్ని పూజలు చేయాలని చెప్పి, ఆమె వద్దనుంచి 4.57 లక్షల రూపాయలు వసూలు చేశాడు. డబ్బులు కట్టి రోజులు గడుస్తున్నా యువతి ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో డబ్బులు వెనక్కు ఇవ్వాలని డిమాండ్ చేయగా.. బెదిరింపులకు పాల్పడ్డాడు. పోలీసులను ఆశ్రయిస్తే క్షుద్రపూజల ద్వారా ఆమెను రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయేలా చేస్తానని భయపెట్టాడు. అయినప్పటికి బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
రాత్రిళ్లు కల్లోకి వచ్చి నాపై అత్యాచారం చేస్తున్నాడు
పాట్నా : మాంత్రికుడు రాత్రిళ్లు కల్లోకి వచ్చి తనపై అత్యాచారం చేస్తున్నాడంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వింత సంఘటన బిహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో.. ఔరంగాబాద్ జిల్లా, కుద్వ పోలీస్ స్టేషన్ పరిథిలోని గాంధీ మైదాన్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ మహిళ తన కుమారుడికి అనారోగ్యంగా ఉండటంతో గత జనవరి నెలలో ప్రశాంత్ చతుర్వేది అనే మాంత్రికుడిని ఆశ్రయించింది. సదరు మాంత్రికుడు మహిళ కుమారుడి అరోగ్యం కోసం కొన్ని పూజలు నిర్వహించాడు. అయితే 15 రోజుల తర్వాత బాలుడు మరణించాడు. కుమారుడి మరణం తర్వాత ఆమె ప్రశాంత్ ఉంటున్న కాళీ బరి ఆలయానికి వెళ్లింది. తన కుమారుడు ఎందుకు మరణించాడో చెప్పాలని నిలదీసింది. ఈ నేపథ్యంలో అతడు ఆమెపై అత్యాచారం చేయబోగా.. చనిపోయిన ఆమె కుమారుడు అడ్డుకున్నాడు. ఇక అప్పటినుంచి ప్రశాంత్ రాత్రిళ్లు ఆమె కల్లోకి వచ్చి అత్యాచారం చేసేవాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రశాంత్‌ను విచారించగా ఆమె చెప్పేదంతా అబద్ధమని కొట్టిపాడేశాడు. ఆమెను ఎప్పుడూ కలుసుకోలేదని విచారణలో తెలిపాడు. నిందితుడికి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లభించకపోవటంతో పోలీసులు బాండ్‌పై సంతకం చేయించుకుని వదిలేశారు. చదవండి : పెళ్లై మూడువారాలు.. బాయ్‌ఫ్రెండ్ మెసెజేస్.. కట్ చేస్తే.. -
భూత వైద్యులే డాక్టర్లు
పట్నా : బిహార్‌లోని ముజఫర్‌పూర్ బాలికల వసతి గృహంలో మైనర్ బాలికలపై లైంగిక వేధింపుల ఘటన మరువక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. బిహార్‌లో ప్రభుత్వం అసుపత్రిలో వైద్యులకు బదులుగా తాంత్రికులు, భూతవైద్యులు రోగులకు క్షుద్ర పూజలతో వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటన వైశాలి జిల్లాలోని హజీపూర్‌లో శనివారం వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రికి వచ్చిన రోగులకు వైద్యుల చికిత్స అందించకుండా భూతవైద్యులతో చట్ట విరుద్ద కార్యాకలపాలకు పాల్పడుతున్నారు. రోగులను బెడ్లపై పడుకోపెట్టి చీపుర్లతో తీవ్రంగా కొడుతూ.. మంత్రాలు, క్షుద్ర పూజలు చేస్తున్నారు. ఓ రోగి చప్పిన సమాచారం ప్రకారం పాము కాటుకు గురైన తనని వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే అక్కడున్న వైద్యులు తాంత్రికుల వద్దకు వెళ్లమని సలహా ఇచ్చారని ఆమె తెలిపారు. ఇప్పటికే షల్టర్ హోమ్ ఘటనతో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న నితీష్ కుమార్‌కు ఈ ఘటనతో మరోసారి ఆరోపణలు ఎదుర్కొక తప్పదు. -
క్షుద్ర పూజలకు మట్టి తీశాడని..
సాక్షి, ఒడిశా : క్షుద్ర పూజ జరిపేందుకు తన ఇంటి ముంగిట మట్టిని తీసుకువెళ్తున్న ఒడిశాకు చెందిన గిరిజన యువకుడ్ని పట్టుకుని పట్టణ పోలీసులకు అప్పగించిన ఘటన సాలూరు పట్టణంలోని బంగారమ్మ కాలనీలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కాలనీలో నివాసముంటున్న చుక్క వెంకటరమణ ఇంటి ముంగిట మట్టిని ఒడిశా రాష్ట్రం రాళ్లగడ్డ సమీపంలోని పుక్కిలి గ్రామానికి చెందిన గిరిజన యువకుడు జయరాం తీసుకుని వెళుతుండగా అక్కడ వున్న మహిళలు అతడ్ని ప్రశ్నించారు. దీంతో ఆ యువకుడు తనను ఈ ఇంటి ముంగిట వున్న మట్టిని తీసుకురమ్మని రామా కాలనీకి చెందిన పల్లి వెంకటరావు పురమాయించాడని చెప్పినట్టు స్థానికులు తెలిపారు. ఆ మట్టి ఎందుకని ప్రశ్నిస్తే పూజలు చేయడానికని ఆ యువకుడు బదులివ్వడంతో దేహశుద్ది చేసి, పట్టణ పోలీసులకు అప్పగించారు. ఇదిలా వుండగా చుక్క వెంకటరమణ కుటుంబానికి, పల్లి వెంటకరావు కుటుంబానికి వైరం నడుస్తుందని, అందుకే క్షుద్ర పూజలు జరిపించి, తమ కుటుంబాన్ని నాశనం చేసేందుకు వెంకటరావు కుట్ర పన్నాడని వెంకటరమణ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. -
పిల్లలు పుట్టడం లేదని నగ్నంగా పూజలు!
వరంగల్: వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేటలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. సంతానం కలగడం లేదనే కారణంతో కొంత మంది మహిళలను గ్రామ శివార్లకు తీసుకెళ్లి నగ్నంగా క్షుద్రపూజలు నిర్వహిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు క్షుద్రపూజలను అడ్డుకుని ఇద్దరు మంత్రగాళ్లను సహా అయిదుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే... మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రానికి చెందిన ఐదుగురు గర్భం దాల్చక పోవడంతో.. పర్వతగిరికి చెందిన ఓ మహిళను సంప్రదించగా.. పూజలు నిర్వహించాలని చెప్పింది. దీంతో స్థానిక ఎస్సారెస్పీ కాలువ వద్దకు బాధితురాళ్లను పిలిపించి ప్రత్యేక పూజల పేరిట వారిని నగ్నంగా చేసి ఏవో మంత్రాలు చదివిస్తుండగా.. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన వర్ధన్నపేట సీఐ ఆదినారాయణ సంఘటనా స్థలానికి చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. మంత్రాలు చేస్తున్న ఇద్దరిలో ఓ మహిళతో పాటు ఓ పురుషుడు ఉన్నాడు. కాగా బాధితురాళ్లలో ఓ యువతి భర్త జైళ్ల శాఖలో కానిస్టేబుల్‌గా పని చేస్తుండటం గమనార్హం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కష్టాలు తీర్చమంటే ... గ్యాంగ్ రేప్ చేశారు
ఘజియాబాద్ : వితంతువుపై స్వామిజీతోపాటు మరోవ్యక్తి సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన శుక్రవారం ఉత్తరప్రదేశ్ మధురలో చోటు చేసుకుంది. ఘజియాబాద్‌కు చెందిన మహిళకు ఇటీవల భర్త చనిపోయాడు. దాంతో ఆమె తీవ్ర కష్టాలు ఎదుర్కొంటుంది. తనకు తెలిసిన ఓ స్వామిని కలిస్తే కష్టాలు తొలగిపోతాయని ఓ వ్యక్తి సదరు మహిళతో నమ్మ బలికాడు. దీంతో ఆమె సదరు వ్యక్తి, కుమారుడితో కలసి మధుర వెళ్లింది. ఆ కష్టాలు తొలగించాలని ఆమె స్వామిజీని వేడుకుంది. ఆ క్రమంలో ఆమెపై స్వామిజీ అత్యాచారం చేశాడు. అంతేకాకుండా ఆమెతో వచ్చిన వ్యక్తి కూడా అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటకు వెళ్లడిస్తే కుమారుడిని చంపేస్తామంటూ ఆమెను బెదిరించారు. దాంతో ఆమె పోలీసులను ఆశ్రయించి.. ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.