కష్టాలు తీర్చమంటే ... గ్యాంగ్ రేప్ చేశారు | Widow alleges gang-rape by occultist, friend | Sakshi
Sakshi News home page

కష్టాలు తీర్చమంటే ... గ్యాంగ్ రేప్ చేశారు

Published Sat, May 30 2015 12:44 PM | Last Updated on Wed, Aug 1 2018 4:24 PM

కష్టాలు తీర్చమంటే ... గ్యాంగ్ రేప్ చేశారు - Sakshi

కష్టాలు తీర్చమంటే ... గ్యాంగ్ రేప్ చేశారు

ఘజియాబాద్ : వితంతువుపై స్వామిజీతోపాటు మరోవ్యక్తి సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన శుక్రవారం ఉత్తరప్రదేశ్ మధురలో చోటు చేసుకుంది. ఘజియాబాద్కు చెందిన మహిళకు ఇటీవల భర్త చనిపోయాడు. దాంతో ఆమె తీవ్ర కష్టాలు ఎదుర్కొంటుంది. తనకు తెలిసిన ఓ స్వామిని కలిస్తే కష్టాలు తొలగిపోతాయని ఓ వ్యక్తి సదరు మహిళతో నమ్మ బలికాడు. దీంతో ఆమె సదరు వ్యక్తి, కుమారుడితో కలసి మధుర వెళ్లింది. ఆ కష్టాలు తొలగించాలని ఆమె  స్వామిజీని వేడుకుంది.

ఆ క్రమంలో ఆమెపై స్వామిజీ అత్యాచారం చేశాడు. అంతేకాకుండా ఆమెతో వచ్చిన వ్యక్తి కూడా అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటకు వెళ్లడిస్తే కుమారుడిని చంపేస్తామంటూ ఆమెను బెదిరించారు. దాంతో ఆమె పోలీసులను ఆశ్రయించి.. ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement