occupying
-
‘లింగమనేని’కి భూ విందు
సాక్షి, మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా, నిడమర్రు, చినకాకాని.. పెదకాకాని మండలం నంబూరు.. తాడికొండ మండలం కంతేరు గ్రామాల మధ్యలో జాతీయ రహదారి పక్కనే ఉన్న డొంక రోడ్డును విజయవాడకు చెందిన లింగమనేని రియల్ ఎస్టేట్ కంపెనీ అప్పనంగా కొట్టేసింది. రైతులు తమ పొలాలకు వెళ్లేందుకు ఉపయోగపడే ఈ రహదారిని మూసివేసి, ప్రహరీ నిర్మాణం చేపట్టింది. నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఏసీసీ యాజమాన్యం కింద విలువైన భూములు ఉండేవి. 2004 సంవత్సరానికి ముందే ఈ భూములు తొలుత ప్రభుత్వానికి చెందిన ‘ఉడా’కు, తర్వాత లింగమనేని రియల్ ఎస్టేట్ కంపెనీ పరమయ్యాయి. ఆయా గ్రామాలకు చెందిన వివిధ సర్వే నంబర్లలో 146.68 ఎకరాల భూములుండగా, వాటిలో 115.91 ఎకరాలను ‘ఉడా’ కొనుగోలు చేసి, లింగమనేని సంస్థకు విక్రయించింది. రియల్ ఎస్టేట్ కంపెనీ కోసం నిబంధనలకు విరుద్ధంగా డొంకదారిని కూడా విక్రయించడం గమనార్హం. నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా 143 సర్వే నంబర్లో దాదాపు కిలోమీటర్ పొడవున, 40 అడుగుల వెడల్పుతో ఈ రహదారి ఉంది. కంతేరు, నంబూరు గ్రామాల పొలిమేరల్లో ఉన్న ఈ డొంకరోడ్డును గతంలో రైతులు ఉపయోగించుకునేవారు. ఈ డొంకరోడ్డు విస్తీర్ణం 2.15 ఎకరాలు కాగా, 2004కు ముందు ఉడా అధికారులు లింగమనేని రియల్ ఎస్టేట్‌కు కేవలం రూ.15 లక్షలకే విక్రయించారు. లింగమనేని సంస్థ కొనుగోలు చేసిన 115.61 ఎకరాలతోపాటు 2.15 ఎకరాల డొంకరోడ్డు భూమిలో లేఔట్ వేసేందుకు ఉడా అనుమతులు ఇచ్చేసింది. దాంతో డొంక రోడ్డు చుట్టూ లింగమనేని కంపెనీ ప్రహరీ నిర్మించింది. ‘ఉడా’ ఎంతో ఉదారంగా రూ.15 లక్షలకు విక్రయించిన 2.15 ఎకరాల భూమి విలువ ఇప్పుడు అక్షరాలా రూ.30 కోట్లకు చేరడం గమనార్హం. డొంక దారి విక్రయంపై స్థానికులు కోర్టుకు వెళ్లడంతో పాటు లోకాయుక్తను సైతం ఆశ్రయించారు. డొంకదారి విక్రయంపై ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఆ రహదారిని లింగమనేని చెర నుంచి విడిపించాలని డిమాండ్ చేస్తున్నారు. -
చెరువులపై పచ్చపడగ
సాక్షి, తిరుపతి రూరల్: చంద్రగిరి నియోజకవర్గంలో 567 చిన్న, పెద్ద చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల ఆయకట్టు కింద దాదాపు 15,200 ఎకరాల భూమి సాగులో ఉంది. ఇందులో 146 చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి. ఆక్రమణలకు గురైన చెరువుల విలువ దాదాపు రూ.208 కోట్లకు పైమాటేనని రెవెన్యూ సిబ్బందే ఆఫ్ ది రికార్డుగా చెపుతున్నారు. ఆక్రమణల్లో తిరుపతి రూరల్, ఎర్రావారిపాళెం టాప్. తిరుపతి రూరల్, ఎర్రావారిపాళెం మండలాల్లో చెరువుల ఆక్రమణలు ఎక్కువగా జరిగాయి. రెండు మండలాల్లో 195 చెరువులు ఉంటే , అందులో 86కు పైగా చెరువులు ఇప్పటికే కబ్జాల పాలయ్యాయి. ∙తిరుపతి రూరల్ మండలం ఓటేరులోని చెరువును సైతం కొందరు ఆక్రమించి చెరువును మట్టితో నింపారు. చెరువులో ఇంటి పట్టాలను సైతం సృష్టించారు. జాతీయ రహదారికి ఆనుకొని 19 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ చెరువు విలువ దాదాపు రూ.80 కోట్లకు పైమాటే. ∙ఎర్రావారిపాళెం: మండలం కమళ్లయ్యగారిపల్లిలో 13.25 ఎకరాల్లో విస్తరించి ఉన్న గంగినేని చెరువులో రూ.18 లక్షలు విలువ చేసే 6 ఎకరాలను టీడీపీ, కాంగ్రెస్ నాయకులు ముగ్గురు ఆక్రమించారు. ∙ఇదే మండలంలో 25.25 ఎకరాల్లో విస్తరించి ఉన్న బడగానిపల్లి చెరువులో రూ.15 లక్షలు విలువ చేసే 10 ఎకరాలను బడంపల్లికి చెందిన ఓ వ్యక్తి ఆక్రమించాడు. ∙కమల్లయ్యగారిపల్లిలో రూ.10 లక్షల విలువైన చెరువుతో పాటు శ్మశానాన్ని సైతం అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆక్రమించుకున్నాడు. ∙తిరుపతి రూరల్ మండలం పేరూరు చెరువులో రాజకీయ లబ్ధి కోసం గతంలో ఇంటి పట్టాలు ఇప్పించారు. పచ్చనేతలు లక్షలు లక్షలు వసూలు చేసుకోని చెరువులో ఫ్లాట్లు వేసి అమ్మేశారు. పేదలు ఇళ్లు కట్టుకోని నివాసం ఉంటున్నారు. రెండేళ్ల క్రితం కురిసిన వర్షాలకు చెరువు నిండిపోవడంతో దాదాపు 90 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ∙దుర్గసముద్రం–అడపారెడ్డిపల్లె గ్రామాల మధ్య ఉన్న చెరువును కొందరు రాజకీయ అండతో అక్రమించి మామిడి తోటలను పెంచుతున్నారు. ∙రామచంద్రాపురం మండలం నూతిగుంటపల్లిలోని తాతిరెడ్డిచెరువులో రూ.1.20 కోట్ల విలువైన 10 ఎకరాలను అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఆక్రమించాడు. చెరువు తనదేనని యథేచ్ఛగా వ్యవసాయం మొదలు పెట్టాడు. ∙తమకు నష్టపరిహారం ఇవ్వడంలో ప్రభుత్వం తీరుకు నిరసనగా 9.7 ఎకరాల్లో విస్తరించి ఉన్న అనుప్పల్లి చెరువులో 4 ఎకరాలను రైతులు అక్రమించారు. అలాగే కుప్పంబాదూరు, అన్నసానిగండి చెరువు, పిళ్లారికోన, బొప్పరాజుపల్లి చెరువుల్లోనూ అక్రమణలు జరిగిపోయాయి.శెట్టిపల్లి పంచాయతీ పరిధిలో పెద్ద చెరువును ఆక్రమించి జోరుగా అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు.తిరుపతి రూరల్ మండలం కుంట్రపాకం చెరువును ఆక్రమించి సాగు చేసుకుంటున్నారు. దాదాపు 22 ఎకరాల చెరువు భూమి ఆక్రమణకు గురైంది. చెరువులను చెరపట్టారు చంద్రబాబు ప్రభుత్వంలో భూ కబ్జాలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రభుత్వ స్థలాలు, పోరంబోకులను మింగిన భూబ కాసురులు చెరువులను సైతం చెరబట్టారు. ప్రభుత్వ రికార్డుల్లో చెరువుగా ఉన్న రూ.100 కోట్ల విలువైన ఓటేరు చెరువును అధికార పార్టీ అండతో ఓ మాజీ ఎమ్మెల్యే కబ్జా చేసేందుకు ప్రయత్నించాడు. ప్రభుత్వ రికార్డులను మా ర్చేందుకు తెగబడ్డాడు. వారికి రెవెన్యూ అధి కారులు వత్తాసు పలకడంతో ఓ దశలో పట్టా భూమిగా మార్చారు. నిజాయితీపరుడైన తహసీల్దార్ వచ్చి న్యాయ పోరాటం చేయడంతో తిరిగి చెరువుగా నిలిచింది. – రమణ, ఓటేరు -
దర్జాగా కబ్జా!
నాగర్‌కర్నూల్ రూరల్: జిల్లా కేంద్రం సరిహద్దు ప్రాంతాల్లో వెలసిన అక్రమ వెంచర్లపై అధికారుల నజర్ లేకపోవడంతో ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమ వెంచర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ప్రైవేటు పట్టా భూములతో పాటు అందినంత ప్రభుత్వ భూములను కబ్జా చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎక్కడా లేనివిధంగా రియల్టర్లు సిండికేట్‌గా మారి వ్యాపారాన్ని దర్జాగా కొనసాగిస్తున్నారు. సిండికేట్ దగ్గరకు రావాలంటేనే అధికారులే ఆందోళన చెందే స్థాయికి ఎదగడంతో జిల్లా సమీపంలోని చెరువులు, కుంటలు అన్యాక్రాంతమై ప్రభుత్వ భూములు కుచించుకుపోతున్నాయి.రోజురోజుకు అక్రమంగా వెంచర్లు వెలుస్తున్నా వాటిని నిలువరించడంలో అధికారులు విఫలమవుతున్నారు. రియల్టర్లుగా పలుకుబడి కలిగిన వ్యక్తులు పలు పార్టీల నాయకుల చెలామణిలో ఉంటూ ఎప్పటికప్పుడు పుకార్లను షికార్లుగా మలుచుకుని ధరలు అమాంతం పెంచుకుంటూ లాభపడుతున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో వెంచర్లు జిల్లా కేంద్రం సరిహద్దు ప్రాంతాలైన ఎండబెట్ల, దేశియిటిక్యాల, ఉయ్యలవాడ, మంతటి, గగ్గలపల్లి, నల్లవల్లి రోడ్డు వెంబడి ప్రధాన రహదారుల ఇరువైపులా పంట పొలాలను రియల్టర్లు కొనుగోలు చేసుకుని రియల్ దందాకు కొనసాగిస్తున్నారు. వీటితో పాటు ఒకప్పుడు వర్షపు నీటితో కళకళలాడిన చెరువు శిఖం భూములు, కుంటల భూముల్లోనూ రియల్టర్లు ప్లాట్లుగా మలిచి అందినకాడికి దండుకుంటున్నారు.ఫుల్ ట్యాంక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ శిఖం భూముల్లో మట్టిని పోసి ప్లాట్లుగా మార్చేశారు. ఇంత జరుగుతున్నా ఏ ఒక్క అధికారి పట్టించుకున్న పాపాన పోలేదు. ఫలితంగా పంట భూములన్నీ ప్లాట్లుగా మారిపోతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే.. పంటలతో కళకళలాడిన పంట పొలాలు సైతం ఇప్పుడు ఎలాంటి అనుమతులు లేకుండా ప్లాట్లుగా మారిపోతున్నాయి. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకోవాలంటే ముందుగా రెవెన్యూ అధికారుల అనుమతులు పొందాల్సి ఉంది.అంతేకాక ఆయా భూముల్లో పబ్లిక్ అవసరాల కోసం 10 శాతం భూమి కేటాయించాల్సి ఉంది. ఎలాంటి అనుమతులు పొందకుండా ప్లాట్లను ఏర్పాటు చేస్తుండటంతో భవిష్యత్‌లో ప్లాట్లు కొనుగోలు చేసిన వ్యక్తులు నిర్మాణ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా అక్రమ వెంచర్ల రియల్టర్లపై అధికారులు నజర్ వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు కోరుతున్నారు. -
పేదల జాగాకు ‘పెద్దల’ ఎసరు
సాక్షి, సిరిసిల్లటౌన్ : అది 2007 అక్టోబర్ 10 పితృఅమావాస్య. అదే రోజు పితృదేవతలకు సంతర్పణలు సమర్పించుకునేందుకు ముగ్గురు రోడ్డు మీదకు వచ్చారు. ఆర్టీసీ బస్సురూపంలో మృత్యువు వచ్చి వారిని కబళించింది. ఈ సంఘటనలో సిరిసిల్లఅర్బన్ మండలం పెద్దూరుకు చెందిన గీతకార్మికుడు చనిపోగా.. వారి కుటుంబానికి ప్రభుత్వం రెండు గుంటలు పంపిణీ చేసింది. ఇప్పుడు అదే భూమిని ఓ పెద్దమనిషి కబ్జా చేసి మీకు దిక్కున్న చోట చెప్పుకోండంటూ బెదిరిస్తున్నాడు. తమకు న్యాయం చేయాలని బాధితులు కలెక్టర్‌ను ఆశ్రయించారు. భూపంపిణీ చేసిన జీవన్‌రెడ్డి బాధితులు ఆదిపెల్లి భాగ్య, సాగర్ కథనం ప్రకారం. పెద్దూరుకు చెందిన ఆదిపెల్లి పర్శరాములు వార్డుసభ్యుడు. పెద్దలకు బియ్యం ఇచ్చేందుకు అయ్యగారి వద్దకు మరో ఇద్దరు బంధువులతో కలసి రోడ్డుపైకి వచ్చాడు. అదే సమయంఓనే ఆర్టీసీ బస్సు ఢీకొని పర్శరాములుతోపాటు మరో ఇద్దరు చనిపోయారు. మృతుల్లో పర్శరాములు కుటుంబం పేదరికానికి చలించిన అప్పటి సర్కారు.. మంత్రి జీవన్‌రెడ్డి చేతుల మీదుగా గ్రామశివారులోని సర్వేనంబరు 405/1లో రెండుగుంటలు అందజేసింది. భర్త మ రణంతో కొద్దిరోజులు అందులో కాస్తు చేసుకున్న భార్య భాగ్య.. ఇంటిపనుల భారంతో చాలారోజులుగా ఖాళీగా వదిలేసింది. పిల్లల భవిష్యత్‌కు ఉపకరిస్తుందని స్థలాన్ని కాపాడుతూ వస్తోంది. ఆ స్థలం విలువ రూ.8 లక్షలు అప్పట్లో ఊరిచివరన ఉన్న ఆ స్థలానికి ఇప్పుడు డిమాండ్ వచ్చింది. ప్రస్తుతం దాని మార్కెట్ విలువ సుమారు రూ.8 లక్షలు పలుకుతుంది. దీంతో ఓ రియల్‌వ్యాపారి కన్ను పడింది. తనకు పరిచయమున్న ప్రజాప్రతినిధులు, అధికారులతో లోపాయికారి ఒప్పందం చేసుకుని కబ్జా చేశాడు. స్థల యజమాని భాగ్య, ఆమె కుమారుడు సాగర్ న్యాయం చేయాలని రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్న పట్టించుకోవడం లేదు. కొద్దిరోజుల క్రితం సదరు రియల్‌వ్యాపారి ‘స్థలం వదిలించుకుంటే మీకు డబుల్బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తానని’ చెబుతున్నాడు. ‘మా తండ్రి చనిపోతే ప్రభుత్వం ఇచ్చిన భూమి అది.. దానిని మాకు కాకుండా చేయొద్దు’ అని బతిమిలాడినా వినలేదు. తనపై దాడికి పాల్పడ్డట్లు వారిపై రియల్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రి గారూ ఆదుకోవాలి అటు పోలీసులు, ఇటు అధికారుల నుంచి తమకు న్యాయం జరగడం లేదని మంత్రి కేటీఆర్ తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. కుటుంబ పెద్దచనిపోతే స్పెషల్ కేసు కింద భూమిని సర్కారు తమకు ఇస్తే.. దానిని పెద్దలు కబ్జా చేశారని, తద్వారా తమ కుటుంబం భవిష్యత్ ఏమిటని రోదించారు. ఈ విషయంపై కలెక్టర్ స్పందించి సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. హద్దులు చూపించాలని ఆదేశాం: రియల్టర్ పెద్దూరు శివారులోని 405/1 సర్వేనంబర్‌లో నాకు రెండున్నర ఎకరాల పొలం ఉంది. 2007లో గ్రామంలో నెలకొన్న పరిస్థితుల దృష్యా్ట ఆ సర్వే నంబరులో స్థలం లేకున్నా.. రాత్రికి రాత్రే పట్టా తయారు చేయించి పర్శరాములు కుటుంబానికి రెవెన్యూ అధికారులు అందించారు. రెవెన్యూ సర్వేయర్‌తో వారి స్థలానికి హద్దులు చూపించాలని నేను కోరుతున్నా. నేను ఏ స్థలాన్ని కబ్జా చేయలేదు. నాపై వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి. -
చూసెయ్ జాగా.. వేసెయ్ పాగా
► ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న అక్రమార్కులు ► 2600 ఎకరాల భూ ఆక్రమణ ► అధికారపార్టీ నేతలు బినామీలుగా వ్యవహరిస్తున్న వైనం ప్రభుత్వ జాగా కనపడితే చాలు పాగా వేస్తున్నారు. ఏకంగా సాగుచేస్తున్నారు. తమకు అనుకూలంగా రెవెన్యూ రికార్డులను మార్చుకుంటున్నారు. దేవాదాయశాఖ భూములకు సంబంధించి అధికారులకు ముడుపులు చెల్లిస్తున్నారు. అధికారపార్టీ నేతల అండదండలతో ఈ ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. బుచ్చిరెడ్డిపాళెం(కోవూరు): కోవూరు నియోజకవర్గంలోని కొడవలూరు, విడవలూరు, బుచ్చిరెడ్డిపాళెం, ఇందుకూరుపేట మండలాల్లో ప్రభుత్వ భూముల ఆక్రమణలు జోరుగా సాగుతున్నాయి. దేవాదాయశాఖ నిర్లక్ష్యంతో ఆలయ భూములను అక్రమార్కులు స్వాహా చేస్తున్నారు. ఏకంగా రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేయిస్తున్నారు. వాటిని తమ భూములుగా మార్చుకుని రిజిస్ట్రేషన్ సైతంచేయిస్తున్నారు. కోవూరు ఎమ్మెల్యేతో పాటు పలువురు అధికారపార్టీ నాయకులు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని బంధువుల పేరిట బినామీలుగా చిత్రీకరిస్తున్న పరిస్థితి నెలకొంది. మండలాల వారిగా భూ ఆక్రమణ విడవలూరు మండలంలోని వరిణి రెవెన్యూ పరిధిలో 1600 ఎకరాల తీరప్రాంత భూములను అధికారపార్టీ నేతలు ఆక్రమించారు. అదేవిధంగా రామచంద్రాపురం ప్రాంతంలో సైతం 400 ఎకరాలు ఆక్రమించారు. అధికారపీర్టీ నేతలకు బినామీలకు స్థానికులుగా కొందరి పేర్లను చేర్చారు. అదేవిధంగా కొడవలూరు మండలంలోని బొడ్డువారిపాళెంలో కోవూరు ఎమ్మెల్యేతో పాటు టీడీపీ నేతలు కొందరు ఏకంగా వంద ఎకరాలకు పైగా స్వాహా చేశారు. పోలంరెడ్డి తన అత్త, తండ్రులను బినా మీలుగా చేసుకుని భూములను రిజిస్ట్రేషన్ చేయించారు. ఇవి కాకుండా బొడ్డువారిపాళెం పరీవాహక ప్రాంతంలోనే చుక్కల పేరిట ఉన్న ప్రభుత్వ భూములను తహసీల్దార్ సహకారంతో పట్టా భూములుగా మార్చి స్వాధీనం చేసుకున్నారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ భూములకు కోట్ల రూపాయల మార్కెట్ విలువ ఉండడంతో నేతలు అక్రమాలకు పాల్పడ్డారు. ఇక ఇందుకూరుపేట మండలం రాముడుపాళెం, గంగపట్నం, కొరుటూరు, కుడితిపాళెం ప్రాంతాల్లో 150 ఎకరాలకు పైగా తీర ప్రాంత భూములను అధికారపార్టీ నేతలు కబ్జా చేశారు. సముద్రానికి అతి సమీపంలో ఉన్న భూములను టీడీపీ నేతలు చదును చేయించి రొయ్యలగుంతలు వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని కనిగిరి రిజర్వాయర్ బండ్ పరిధిలో 250 ఎకరాల భూమి ఆక్రమణలో ఉంది. బ్రహ్మానందేశ్వర స్వామి భూములతో కామాక్షితాయి ఆలయ భూములు, రెవెన్యూ భూములు కలిపి మరో వంద ఎకరాలు ఆక్రమణలకు గురయ్యాయి. మామూళ్ల మత్తులో రెవెన్యూ, దేవాదాయశాఖాధికారులు రెవెన్యూ, దేవాదాయ శాఖ పరిధిలోని ఆక్రమణకు గురవుతున్నా సంబంధిత శాఖాధికారులు పట్టించుకోవడం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేసినప్పుడు మాత్రమే స్థల పరిశీలన జరుపుతున్నారు. అనంతరం అక్రమార్కుల నుంచి తాయిలాలను తీసుకుని మౌనం వహిస్తున్నారు. ఎవరైనా కోర్టుకు వెళితే, లాయరు సలహాతో కోర్టుకు హాజరవుతున్నారు. ఆక్రమణ జరుగుతున్న సమయంలో స్పందిస్తే ప్రభుత్వ భూముల పరిరక్షణ జరిగేది. కాని అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సి న అవసరం ఎంతైనా ఉంది. దేవాదాయ భూములు ఆక్రమిస్తే చర్యలు తప్పవు దేవాదాయ భూముల ఆక్రమణపై విచారణ జరుపుతాం. ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. భూమిని స్వాధీనం చేసుకుంటాం. -వేగూరు రవీంద్రరెడ్డి, ఏసీ ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు ప్రభుత్వ భూములు ఆక్రమించడం నేరం. ఆక్రమణలపై విచారణ జరిపిస్తాం. ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటాం. -వెంకటేశ్వర్లు, ఆర్డీఓ -
ప్రభుత్వ స్థలం కబ్జా