odisha coastal area
-
మిస్సైల్ విధ్వంసక క్షిపణి ప్రయోగం సక్సెస్
న్యూఢిల్లీ: రక్షణ రంగంలో భారత్ మరో ఘనత సాధించింది. శత్రుదేశాల ఖండాంతర క్షిపణులను మధ్యలోనే అడ్డుకుని తుత్తునియలు చేయగల కొత్తరకం క్షిపణి ఎండో–అట్మాస్ఫెరిక్ ఇంటర్‌సెప్టర్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశా తీరంలోని యుద్ధ నౌక నుంచి శనివారం డీఆర్డీవో (రక్షణ పరిశోధన పరిశోధన సంస్థ), నావికా దళం ఈ పరీక్ష నిర్వహించాయి. శత్రు దేశాల క్షిపణిని మధ్యలోనే అడ్డుకుని, ధ్వంసం చేయగలిగే సరికొత్త బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ (బీఎండీ) సాంకేతికతను సొంతం చేసుకున్న దేశాల సరసన భారత్ నిలిచిందని రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పరీక్షలో పాలుపంచుకున్న డీఆర్డీవో, నేవీ, రక్షణ పరిశ్రమల ప్రతినిధులను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. -
ఫొని తుపాను : తిత్లీ కంటే ప్రమాదకరమైనది..!
భువనేశ్వర్ : అతి తీవ్ర తుపానుగా మారిన ఫొని తీరం వైపు దూసుకొస్తోంది. గంటకు 200 కి.మీ వేగంతో శుక్రవారం గోపాల్పూర్-చాంద్‌బలి (ఒడిశా) దగ్గర తీరం దాటే అవకాశం వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. 500 కి.మీ విస్తీర్ణంతో పూరీకి 680 కి.మీ, విశాఖకు 430 కి.మీ దూరంలో ఫొని కేంద్రీకృమై ఉందని ఐఎండీ తెలిపింది. భారీ తుపాను నేపథ్యంలో ఒడిశాలో హై అలర్ట్ ప్రకటించారు. టూరిస్టులందరూ పూరీ విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక గంటకు 22 కి.మీ వేగంతో కదులుతున్న ఫొని నేటి నుంచి దిశ మార్చుకుని పయనించే అవకాముందని ఐఎండీ అంచనా వేసింది. (చదవండి : ‘ఫొని’ని ఎదుర్కొనేందుకు అప్రమత్తం) ఫొని ప్రభావంతో బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. తీర ప్రాంతాల్లో గంటకు 90 నుంచి 110 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. జాలర్లు చేపట వేటకు వెళ్లరాదని హెచ్చరిక జారీ అయ్యాయి. శ్రీకాకుళం జిల్లా సోంపేట బారువ తీర ప్రాంతం ఉంచి ఎర్రముక్కం వరకు అలల ఉధృతి పెరిగింది. తీరంలో 10 నుంచి 20 మీటర్లు సముద్రం ముందుకొచ్చింది. తుపాను ప్రభావంతో రేపు, ఎల్లుండి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అతిభారీ వర్షాలు, విశాఖలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఒడిశాలో 20 సెం.మీ కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశముందని, పశ్చిమ బంగలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. బంగాళాఖాతం వేడెక్కడం వల్లే ఈ ఫొని పెనుతుపానుగా మారిందని ఐఎండీ ప్రకటించింది. అప్డేట్స్ : తిత్లీని మించి.. ఫొని తుపాను తిత్లీ తుపాను కంటే ప్రమాదకరమైనదని ప్రాంతీయ వాతావరణ శాఖ డైరెక్టర్ హెచ్ బిశ్వాస్ అభిప్రాయపడ్డారు. గతేడాది ఉత్తరాంధ్ర, ఒడిశాపై తిత్లీ విరుచుకుపడడంతో 60 మందికి పైగా మృతిచెందిన సంగతి తెలిసిందే. ఎంసీసీ ఎత్తివేత : ‘ఫొని’ సహాయక చర్యలకు ఆటంకాలు కలగకుండా ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. ఒడిశా తీర ప్రాంత జిల్లాల్లో ఎన్నికల కోడ్ (ఎంసీసీ)ను ఎత్తేసింది. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సమీక్ష : ఫొని తుపాను సహాయక చర్యలపై సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. గండ్లు పడే చోట పునర్నిర్మాణం చేపట్టాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.శ్రీనివాస్ సమీక్ష : రేపు, ఎల్లుండి జిల్లా వ్యాప్తంగా... భారీ ఉంచి అతిభారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. గంటలకు 100-120 కి.మీ వేంగంతో గాలులు వీచే అవకాశముంది. ‘ఫొని’తో అరటి, కొబ్బరి ఉద్యానవన పంటలకు తీవ్ర నష్టం కలగనుంది. వీలైనంత త్వరగా కోతకోసి పంటలను భద్రపరచుకోవాలి. ఐదు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాం. అధికారుల సెలవున్నింటినీ రద్దు చేశాం. 6 వేల ఎలక్ట్రికల్ పోల్స్ సిద్ధంగా ఉంచాం. కమ్యునికేషన్ సిబ్బందిని కూడా అలర్ట్ చేశాం. 48 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశాం. విశాఖ కలెక్టర్ కాటమనేని భాస్కర్ సమీక్ష : ఫొని తుపాన్‌ను ఎదుర్కోవడానికి యంత్రాంగం సిద్ధంగా ఉంది. రేపటి నుంచి 65 గ్రామాల్లో పునరావసం ఏర్పాటు చేస్తాం. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. -
అతి తీవ్ర తుపానుగా మారిన ఫొని
సాక్షి, అమరావతి : అతి తీవ్ర తుపానుగా మారిన ఫొని తీరం వైపు దూసుకోస్తుంది. ఒడిశాలోని పూరీకి నైరుతి దిశగా 830 కి.మీల దూరంలో.. విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 670 కి.మీల దూరంలో ఫొని పెను తుపాను కేంద్రీకృతమై ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. మరో 12 గంటల్లో ఫొని తీవ్ర పెను తుపానుగా మారనుంది. ఈశాన్య దిశగా కదులుతూ దిశ మార్చుకొని ఒడిశా తీరం వైపు తరలనుంది. ఫొని తుపాను మే 3 మధ్యాహ్నానికి ఒడిశా తీరానికి చేరుకుంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. తుపాను కదులుతున్న మార్గంలో గంటకు 170 నుంచి 200 కిలో మీటర్ల వేగంతో పెను గాలులు వీస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. అయితే, ఫొని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు జారీచేశారు అధికారులు. కాకినాడ, గంగవరం పోర్టుల్లో ఐదో నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేయగా.. విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో రెండో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కేబినేట్ కార్యదర్శి సమీక్ష ఫొని తుపానుపై కేబినేట్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ సిన్హా.. ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో పరిస్థితిని సమీక్షించారు. మే 2, 3 తేదీల్లో ఫొని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలపై ఉంటుందని తెలిపారు. తుపాను ప్రభావంతో రైళ్ల రాకపోకలకు ఆటంకం కలిగి నిలిచిపోయే అవకాశం ఉందన్నారు. ప్రయాణీకులకు ఇబ్బందులు ఎదురవ్వకుండా నీరు, ఆహారం అందించేందుకు రైల్వే బోర్టుకు తగిన ఆదేశాలు జారీ చేయాలని సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. -
బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి సమీపంలో అల్పపీడనం
విశాఖపట్నం : ఉత్తరబంగాళాఖాతంలో ఒడిశా తీరానికి సమీపంలో అల్పపీడనం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ గురువారం వెల్లడించింది. ఇది మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది. లక్షాద్వీప్ పరిసర ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాన, కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఈరోజు, రేపు తెలుగు రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.