ఒడిశా మాజీ సీఎం జేబీ పట్నాయక్ కన్నుమూత
తిరుపతి: ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, అసోం మాజీ గవర్నర్ జానకీ బల్లభ పట్నాయక్ (88) మంగళవారం వేకువజామున కన్నుమూశారు. తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. జేబీ పట్నాయక్ గత కొంతకాలంగా గుండెపోటుతో బాధపడుతున్నారు.
తిరుపతిలో జరిగే రాష్ట్రీయ విద్యాపీఠ్ కార్యక్రమానికి వచ్చిన జేబీ పట్నాయక్ కు సోమవారం రాత్రి తీవ్ర గుండెపోటు రావటంతో ఆయన్ని స్విమ్స్‌లో చేరారు. చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున మృతి చెందారు. ఒడిశాకు రెండు దఫాలుగా దాదాపు 14 ఏళ్లు సీఎంగా పని చేశారు. కేంద్రమంత్రిగా కూడా జేబీ పట్నాయక్ పని చేశారు. తర్వాత అసోంకు గవర్నర్ గా పని చేశారు. ఆయన మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు.