Odyssey
-
ఒడిస్సియస్ ఒరిగింది
వాషింగ్టన్: చంద్రునిపై కుదురుగా దిగని లాండర్ల జాబితాలోకి ఒడిస్సియస్ కూడా చేరింది. అమెరికాకు చెందిన ప్రైవేటు సంస్థ ఇంట్యూటివ్ మెషీన్స్ ప్రయోగించిన ఈ ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై దిగుతూనే ఓ పక్కకు పడిపోయింది. చంద్రుడి నేలకు సమాంతరంగా వాలిపోయింది. దాంతో ల్యాండర్ సమాచార వ్యవస్థల నుంచి సంకేతం అందుకోవడానికి కొన్ని నిమిషాల ముందు ల్యాండర్ పక్కకు పడిందని ఇంట్యూటివ్ మెషీన్స్ (ఏఎం) సీఈవో స్టీవ్ ఆల్టెమస్ ధ్రువీకరించారు. అది నిర్దేశిత ప్రదేశంలోనో, ఆ దగ్గర్లోనో దిగి ఉంటుందన్నారు. ఒడిస్సియస్ నుంచి డేటా స్వీకరిస్తున్నట్టు ఏఎం, నాసా వెల్లడించాయి. అది మోసుకెళ్లిన పరికరాల్లో చాలా పేలోడ్స్ పని చేసే స్థితిలోనే ఉంటాయని భావిస్తున్నట్టు చెప్పాయి. జపాన్ అంతరిక్ష సంస్థ ‘జాక్సా’ తాజాగా పంపిన ‘మూన్ స్నైపర్’ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై తలకిందులుగా దిగడం తెలిసిందే. చంద్రుడి దక్షిణ ధ్రువ సమీపంలో ల్యాండర్ కాలుమోపిన ‘మాలాపెర్ట్ ఎ’ బిలం వాస్తవానికి ల్యాండింగ్‌కు ప్రమాదభరితమైన ప్రదేశం. కానీ చంద్రుడిపై శాశ్వత స్థావరం నెలకొల్పడానికి దోహదపడే గడ్డకట్టిన నీరు అక్కడ పుష్కలంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ చోటునే ఎన్నుకున్నారు. లాండింగ్‌కు 30 సెకండ్ల ముందు ఒడిస్సియస్‌లోని ‘ఈగిల్ కామ్’ ల్యాండర్ నుంచి దూరంగా వెళ్లి ల్యాండింగ్ ఘట్టాన్ని చిత్రీకరించాల్సి ఉంది. కానీ నేవిగేషన్ అవసరాల దృష్ట్యా ల్యాండింగ్ సమయంలో కామ్‌ను స్విచాఫ్ చేశారు. ‘‘ఒడిస్సియస్ పొజిషనింగ్‌కు సంబంధించిన ఫొటో చాలా ముఖ్యం. అందుకోసం ఈగిల్ కామ్‌ను విడుదల చేసేందుకు ప్రయతి్నస్తున్నాం. అది సుమారు 8 మీటర్ల దూరం నుంచి ఒడిస్సియస్‌ను ఫొటో తీస్తుందని ఆశిస్తున్నాం’’ అని ఏఎం తెలిపింది. అయితే లాండింగ్‌కు కాస్త ముందు చంద్రునిపై షోంబర్గర్ క్రేటర్ ప్రాంతాన్ని దాదాపు 10 కిలోమీటర్ల ఎత్తు నుంచి ఒడిస్సియస్ ఫొటో తీసి పంపింది. సౌరఫలకాలు లాండర్ పై భాగంలో, యాంటెన్నా కింది భాగంలో ఉండిపోవటంతో దాన్నుంచి డేటా సేకరణ కూడా కష్టసాధ్యమవుతోంది. చంద్రుడి కక్ష్యలో పరిభ్రమిస్తున్న నాసా ఉపగ్రహం లూనార్ రీకానసన్స్ ఆర్బిటర్ (ఎల్ఆర్వో) త్వరలో ఒడిస్సియస్ ఆనుపానులు కనిపెట్టనుంది. ల్యాండర్ కచి్చతంగా ఏ ప్రాంతంలో ఉందో గుర్తించి ఫొటోలు తీయనుంది. -
పక్కకు ఒరిగిన ‘ఒడిస్సియస్’.. ఆసక్తికర విషయం వెల్లడించిన ‘నాసా’
కాలిఫోర్నియా: జాబిల్లిపై 50 ఏళ్ల తర్వాత అడుగుపెట్టిన అమెరికా ల్యాండర్ ఒడిస్సియస్కు సంబంధించి ఆసక్తికర విషయాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా వెల్లడించింది. ల్యాండ్ అయ్యే సమయంలో ఒడిస్సియస్ చంద్రుని ఉపరితలాన్ని నిర్దేశించని రీతిలో తాకింది. దీంతో ల్యాండర్ కాస్త పక్కకు ఒరిగినట్లు నాసా తెలిపింది. చంద్రుని దక్షిణ ధృవంలోని క్రేటర్(గోయి) మలాపెర్ట్ సమీపంలో ఒడిస్సియస్ గురువారం ఉదయం ల్యాండ్ అయింది. ఇంట్యూటివ్ మెషీన్స్(ఐఎమ్) అనే ప్రైవేట్ స్పేస్ కంపెనీ, నాసా సంయుక్తంగా ఒడిస్సియస్‌ను ఎలాన్‌మస్క్ స్పేస్ ఎక్స్‌కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్లో చంద్రునిపైకి పంపాయి. ల్యాండ్ అయిన తర్వాత భూమికి సిగ్నల్స్ పంపేందుకు ఒడిస్సియస్ కొంత సమయం తీసుకుంది. అయితే ల్యాండింగ్ సమయంలో తలెత్తిన ఇబ్బందితో కాస్త పక్కకు ఒరిగినప్పటికీ ఒడిస్సియస్‌లోని అన్ని కమ్యూనికేషన్ వ్యవస్థలు చక్కగా పనిచేస్తున్నట్లు ఇంట్యూటివ్ మెషిన్స్ సీఈవో స్టీవ్ ఆల్టిమస్ తెలిపారు. ఒడిస్సియస్ ల్యాండ్ అయిన చోట నీరు గడ్డకట్టి మంచు రూపంలో ఉండటంతో భవిష్యత్తు పరిశోధనలకు ఇది ఒక లూనార్ బేస్‌గా పనికొస్తుందని సైంటిస్టులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో చాలా గోతులుండటం వారిని కొంత కంగారు పెడుతోంది. ఒడిస్సియస్ భూమి నీడలోకి వెళ్లేముందు వారం రోజుల పాటు పరిశోధనలు సాగించి డేటా పంపనుంది. ఇదీ చదవండి.. ఎక్స్ మెయిల్ వచ్చేస్తోంది -
ముంగారు’ మురిసింది!
ప్రారంభమైన ‘తొలకర్లు’ ఓడీచెరువులో భారీ వర్షం 49 మండలాల పరిధిలో వాన 6.6 మి.మీ సగటు నమోదు అనంతపురం అగ్రికల్చర్ : ముంగారు వర్షాలు మొదలయ్యాయి. ఆదివారం రాత్రి జిల్లాలోని 49 మండలాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిశాయి. మే నెల సాధారణ వర్షపాతం 39.8 మిల్లీమీటర్లు (మి.మీ) కాగా.. తొలిరోజే 6.6 మి.మీ సగటు నమోదైంది. ఓడీచెరువు మండలంలో 49.8 మి.మీ భారీ వర్షం కురిసింది. అలాగే అమడగూరు 35.4 మి.మీ, నల్లచెరువు 35.4, యల్లనూరు 28.2, యాడికి 24.7, ముదిగుబ్బ 24.3, తలుపుల 20.5 మి.మీ, పామిడి 19.8 మి.మీ, నల్లమాడ 18.1, పెద్దవడుగూరు 17.5, గుంతకల్లు 16.9, గాండ్లపెంట 12.4, గుత్తి 12.2, తాడిపత్రిలో 11.1 మి.మీ మేర వర్షం కురిసింది. వీటితో పాటు వజ్రకరూరు, ధర్మవరం, తాడిమర్రి, చెన్నేకొత్తపల్లి, తనకల్లు, ఉరవకొండ, కొత్తచెరువు, బుక్కపట్నం, కూడేరు, ఎన్పీకుంట, బొమ్మనహాళ్, కుందుర్పి, నార్పల, పుట్టపర్తి, రాయదుర్గం, కళ్యాణదుర్గం, రామగిరి, కంబదూరు, డి.హీరేహాళ్, పుట్లూరు తదితర మండలాల్లో చిరుజల్లులు పడ్డాయి. వర్షాలు కురిసిన ప్రాంతాల్లో లోతుగా దుక్కులు చేసుకోవాలని, ఖరీఫ్ సాగుకు సమాయత్తం కావాలని వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ (జేడీఏ) పీవీ శ్రీరామమూర్తి, శాస్త్రవేత్తలు డాక్టర్ బి.సహదేవరెడ్డి, డాక్టర్ ఎం.జాన్‌సుధీర్, డాక్టర్ డి.సంపత్‌కుమార్ రైతులకు సూచించారు. పొంగిన వాగులు, వంకలు ఓడీ చెరువు : మండలంలో ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో సున్నంపల్లి, డబురువారిపల్లి, కుసుమవారిపల్లి, తిప్పేపల్లి, ఓడీసీ, దాదిరెడ్డిపల్లి, గౌరాపురం, చౌడేపల్లి గ్రామాల్లోని చిన్న చిన్న కుంటలు, చెక్‌డ్యాంలు పొంగి పొర్లాయి. తిప్పేపల్లి చెరువుకు సగం వరకు నీరు వచ్చి చేరింది. మహమ్మదాబాద్ క్రాసింగ్‌లో ఎగువ ప్రాంతం నుంచి నీరు వచ్చి చేరడంతో ఇళ్లు జలమయ్యాయి. ఇళ్లలోని తిండిగింజలు, దుస్తులు తడిచిపోయాయి. మండల కేంద్రంలోని థియేటర్ వద్దనున్న వాగు కదిరి - హిందూపురం రోడ్డుపై భారీగా ప్రవహించింది. దీంతో వాహన రాకపోకలకు కొంతసేపు అంతరాయం కల్గింది. గత 30 ఏళ్లలో ఏనాడూ ఈ వాగు ప్రవహించిన దాఖలాలు లేవని స్థానికులు తెలిపారు. తహసీల్దార్ కార్యాలయ ఆవరణలోకి వర్షపు నీరు చేరడంతో సోమవారం ‘మీకోసం’కు వచ్చిన అధికారులు, ప్రజలు అసౌకర్యానికి గురయ్యారు. శేషయ్యగారిపల్లి, ఓడీసీ, మామిళ్లకుంట్లపల్లి గ్రామాల్లో మామిడి కాయలు రాలిపోవడం, చెట్లు విరిగి పడటంతో రైతులకు నష్టం వాటిల్లింది. జెరికుంటపల్లిలో చిన్న వెంకటరమణ అనే రైతుకు చెందిన మొక్కజొన్న పంట, మిట్టపల్లి, ఓడీసీకి చెందిన రైతులు నరసింహారెడ్డి, వెంకటనర్సుకు చెందిన కనకంబరాల పంట దెబ్బతిన్నాయి.