పారిశ్రామిక శిక్షణ సంస్థకు దరఖాస్తులు
కందుకూరు అర్బన్: స్థానిక ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలో 2016–17 సంత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో ప్రవేశానికి రెండో విడత దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ ఏ.రాజేశ్వరరావు తెలిపారు. డ్రాఫ్ట్‌మెన్ సివిల్, ఫిట్టర్ తదితర ఖాళీలను కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తామన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులన్నారు. రూ.10 చెల్లించి స్థానిక ఐటీఐ కళాశాలలో 20 నుంచి దరఖాస్తులు పొందాలన్నారు. దరఖాస్తులను వచ్చే నెల 10 లోపు అందజేయాలన్నారు. వివరాలకు ఫోన్:08598 224497 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.