అభ్యంతరం లేని వారిని పంపించండి
అఖిల భారత సర్వీసు అధికారులపై కేంద్రానికి రెండు రాష్ట్రాల లేఖ
హైదరాబాద్: ఇరు రాష్ట్రాలకు అఖిల భారత సర్వీసు అధికారులను పంపిణీ చేస్తూ ఈ నెల 10వ తేదీన ప్రత్యూషసిన్హా కమిటీ ప్రకటించిన జాబితాల్లో అభ్యంతరాలున్న అధికారులను మినహాయించి మిగతా అధికారులను ఆయా రాష్ట్రాల్లో పనిచేసేందుకు వీలుగా ‘సర్వ్ టు వర్క్’ ఆర్డర్‌ను జారీ చేయాల్సిందిగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు రాజీవ్‌శర్మ, ఐ.వై.ఆర్.కృష్ణారావులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
సిన్హా కమిటీ ప్రకటించిన జాబితాపై ఎవరికైనా అభ్యంతరాలు, సమస్యలు ఉంటే ఈ నెల 25వ తేదీ సాయంత్రంలోగా తెలియజేయాలని సదరు కమిటీ పేర్కొన్న విషయం తెలిసిందే. ఏకాభిప్రాయమున్న అధికారులకు రెండు రాష్ట్రాల్లో సర్వ్ టు ఆర్డర్ జారీ చేయాలని కేంద్ర వ్యక్తిగత శిక్షణ విభాగానికి సీఎస్‌లు లేఖలు రాశారు.