officials raids
-
కారులో రూ.2.10 కోట్ల నగదు ఎవరిది!
బళ్లారి సాక్షి, యశవంతపుర: బాగలకోటె జిల్లా జమఖండి తాలూకా హున్నూర చెక్‌పోస్టు వద్ద లెక్కలు లేకుండా తరలిస్తున్న రూ.2.10 కోట్ల నగదును ఎన్నికల అధికారులు సీజ్ చేశారు. చెక్‌పోస్ట్‌లో అధికారులు ఒక కారును శోధించగా నగదు కట్టలు లభించాయి. ఈ నగదు ఒక సహకార బ్యాంకుకు చెందినదిగా నగదు తరలింపుదారులు తెలిపారు. అయితే అందుకు సంబంధించి దాఖలాలు చూపలేదని తెలిసింది. పత్రాలను చూపించి నగదు తీసుకెళ్లాలని అధికారులు సూచించారు. ఆ నగదును జమఖండిలోని ట్రెజరీకి తరలించారు. -
ఆదిలాబాద్ జిల్లాలో ఎక్సైజ్ దాడులు
కోటపల్లి: ఆదిలాబాద్ జిల్లాలో బుధవారం ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. కోటపల్లి మండలం అన్నారం గ్రామ శివార్లలో మద్యం తయారుచేస్తున్నారన్న సమాచారంతో అధికారులు దాడులు జరిపారు. జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ రమేష్ ఆధ్వర్యంలో దాడులు జరిపి మూడు వేల క్వింటాళ్ల బెల్లం పానకం ధ్వంసం చేయడంతోపాటు 50 లీటర్ల నాటుసారా సీజ్ చేశారు. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న అధికారులు వారిపై కేసులు నమోదు చేశారు.