బళ్లారి సాక్షి, యశవంతపుర: బాగలకోటె జిల్లా జమఖండి తాలూకా హున్నూర చెక్‌పోస్టు వద్ద లెక్కలు లేకుండా తరలిస్తున్న రూ.2.10 కోట్ల నగదును ఎన్నికల అధికారులు సీజ్ చేశారు. చెక్‌పోస్ట్‌లో అధికారులు ఒక కారును శోధించగా నగదు కట్టలు లభించాయి.
ఈ నగదు ఒక సహకార బ్యాంకుకు చెందినదిగా నగదు తరలింపుదారులు తెలిపారు. అయితే అందుకు సంబంధించి దాఖలాలు చూపలేదని తెలిసింది. పత్రాలను చూపించి నగదు తీసుకెళ్లాలని అధికారులు సూచించారు. ఆ నగదును జమఖండిలోని ట్రెజరీకి తరలించారు.
కారులో రూ.2.10 కోట్ల నగదు ఎవరిది!
Published Tue, Apr 11 2023 7:39 AM | Last Updated on Tue, Apr 11 2023 9:53 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment