టీసర్కార్ సీరియస్.. ముగ్గురిపై వేటు
హైదరాబాద్: నకిలీ విత్తనాల వ్యవహారంపై తెలంగాణ సర్కార్ చర్యలు తీసుకుంది. ఈ వ్యవహారంలో ప్రాథమిక నివేదిక ప్రకారం ముగ్గురు వ్యవసాయ అధికారులను సర్కార్ సస్పెండ్ చేసింది. కుత్బుల్లాపూర్ వ్యవసాయ అధికారి జి.ప్రసన్నలక్ష్మీ, హైదరాబాద్ అర్బన్ అధికారి ఐ.పల్లవి, సరూర్ నగర్ వ్యవసాయ అధికారి జి.సుందరిలపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.
నకిలీ విత్తనాలు అమ్ముతూ తప్పిదాలకు పాల్పడుతున్న డీలర్ల లైసెన్స్ లు రద్దుచేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. గ్రీన్ ఏరా, జీవా అగ్రిజెనెట్స్ కంపెనీల అనుమతులు రద్దయ్యాయి. క్యాంప్సన్ సీడ్స్, లక్కీ సీడ్స్, అగ్రోజెన్స్, మహానంది సీడ్స్ కంపెనీలకు సర్కార్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సంబంధిత జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో నకిలీ మిర్చి విత్తనాల వ్యాపారం జరుగుతోందని టీసర్కార్ ఆగ్రహం వ్యక్తంచేసింది.