‘అతిథి’గా హరీష్ శంకర్.. ఏ సినిమాలో అంటే..
‘గబ్బర్ సింగ్, రామయ్యా వస్తావయ్యా, దువ్వాడ జగన్నాథమ్’ వంటి పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన హరీష్ శంకర్(Harish Shankar ) ‘ఓ భామ అయ్యో రామ’(Oh Bhama Ayyo Rama) చిత్రంలో గెస్ట్ రోల్లో కనిపించనున్నారు. సుహాస్ హీరోగా రూపొందుతోన్న ఈ సినిమా ద్వారా మలయాళ నటి మాళవికా మనోజ్ తెలుగుకి హీరోయిన్గా పరిచయమవుతున్నారు. నూతన దర్శకుడు రామ్ గోధల దర్శకత్వంలో హరీష్ నల్ల నిర్మిస్తున్న ఈ సినిమాని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా విడుదల చేయనుంది. ఈ చిత్రంలో హరీష్ శంకర్ అతిథి పాత్ర చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. సినిమాలో ఆయన గెస్ట్ రోల్ అందరిని సర్ఫ్రైజ్ చేస్తుందట. ఈ పాత్ర ఆయన చేస్తేనే బాగుంటుందని భావించిన మేకర్స్ హరీష్ శంకర్‌ను ఒప్పించి ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను ఇటీవల పూర్తిచేశారు.‘‘ఈ సినిమాలో సున్నితమైన ప్రేమ, భావోద్వేగాలతో పాటు మంచి వినోదం ఉంటుంది. ఈ మూవీలోని ఓ పాత్ర కోసం హరీష్ శంకర్‌గారిని ఒప్పించి, ఆయన పాత్ర షూటింగ్ పూర్తి చేశాం. ఆయన గెస్ట్ రోల్ సర్ప్రైజ్ చేస్తుంది. మా చిత్రాన్ని ఈ వేసవిలో విడుదల చేస్తాం’’ అన్నారు హరీష్ నల్ల.