Oil farm garden
-
నష్టపోతున్న రైతులు ఈ సాగు చేస్తే డబ్బులే డబ్బులు
-
రైతులకు వరంగా పామాయిల్ సాగు
-
ఆయిల్ పామ్.. పెట్టుబడుల బూమ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆయిల్ పామ్ రంగం విస్తరించబోతోంది. ఇందుకోసం రాష్ట్ర సర్కారు మంచి ప్రణాళికలు వేస్తోంది. దేశంలోనే తొలిసారి భారీ స్థాయిలో పెట్టుబడులు ఆకర్షించే కార్యాచరణతో ముందుకు సాగుతోంది. వచ్చే నాలుగైదేళ్లలో 30 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగును పెంచి ఈ రంగంలో రూ. 3,750 కోట్ల పెట్టుబడులు వచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. సర్కారు చర్యలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 55 వేల మందికి ఉపాధి లభించనుందని ఆయిల్ ఫెడ్ వర్గాలు చెబుతున్నాయి. ఫ్యాక్టరీలు, నూనె తీత తదితరాలతో ఏడాదికి రూ. 400 కోట్ల జీఎస్టీ ప్రభుత్వానికి సమకూరనుందని అంచనా. తొలుత 26 జిల్లాల్లో 9.5 లక్షల ఎకరాల్లో.. దేశవ్యాప్తంగా వరి ధాన్యం ఉత్పత్తులు పేరుకుపోవడంతో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని కొన్నాళ్లుగా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తోంది. ఇందులో భాగంగా మంచి లాభాలు పొందే అవకాశమున్న పామాయిల్ వైపు రైతులను మళ్లిస్తోంది. మున్ముందు రాష్ట్రంలో 30 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేపట్టాలని ప్రణాళిక వేసింది. తొలుత 26 జిల్లాల్లో సుమారు 9.49 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని నిర్ణయించింది. ఇందుకు 11 ఆయిల్ పామ్ కంపెనీలకు జోన్లను కేటాయించింది. 2022–23 సంవత్సరంలో 5 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు చేపట్టాలని కంపెనీలను ఆదేశించింది. ఆయిల్ ఫెడ్‌కు 1.80 లక్షల ఎకరాలు, ప్రీ యూనిక్ కంపెనీకి లక్ష ఎకరాలు, రుచి సోయాకు 40 వేల ఎకరాలు, ఇతర కంపెనీలకు మిగిలిన భూముల జోన్లను కేటాయించింది. ఆ ప్రకారం కంపెనీలు వచ్చే మూడు, నాలుగేళ్లలో పామాయిల్ క్రషింగ్ ఫ్యాక్టరీలను నెలకొల్పాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో పామాయిల్ నూనె వినియోగం 4 లక్షల టన్నులు కాగా 45 వేల టన్నులే రాష్ట్రంలో ఉత్పత్తి అవుతోంది. 5 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు పెంచి ఫ్యాక్టరీలను స్థాపిస్తే రూ. 7,400 కోట్ల విలువైన 7.4 లక్షల టన్నుల పామాయిల్ ఉత్పత్తి కానుంది. దిగుమతికి బదులు ఎగమతి చేసే స్థాయికి రాష్ట్రం చేరుకుంటుంది. 25 క్రషింగ్ యూనిట్లు.. 3,750 కోట్ల పెట్టుబడులు సర్కారు ప్రణాళికలో భాగంగా కంపెనీలు మొదట 25 క్రషింగ్ ఫ్యాక్టరీలను నెలకొల్పాల్సి ఉంటుంది. ఆ ప్రకారం ఒక్కో ఫ్యాక్టరీకి రూ. 150 కోట్ల చొప్పున రూ. 3,750 కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. ఆ ఫ్యాక్టరీల్లో ప్రత్యక్షంగా 2,500 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఇక పామాయిల్ పంట భూముల్లో ఏకంగా 50 వేల మందికి ఉపాధి లభించనుందని. మరో 2,500 మందికి పామాయిల్ రవాణా రంగంలో ఉపాధి దొరుకుతుందని ఆయిల్ ఫెడ్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే రైతులకు పామాయిల్ సాగుతో లక్షలాది రూపాయల ఆదాయం సమకూరనుంది. రాష్ట్రంలో ఓ రైతు 33 ఎకరాల్లో పామాయిల్ సాగు చేస్తున్నాడని, అతనికి ఏడాదికి రూ. 45 లక్షల ఆదాయం వస్తోందని ఆయిల్ ఫెడ్ చెప్పింది. రూ. 750 కోట్లతో రిఫైనరీలు పామాయిల్ క్రషింగ్ ఫ్యాక్టరీల్లో క్రూడాయిల్ బయటకు తీస్తారు. దాన్ని రిఫైన్ చేసి పామాయిల్ వంట నూనె తయారు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతి క్రషింగ్ ఫ్యాక్టరీ వద్ద ఒక్కో రిఫైనరీ ఫ్యాక్టరీని నెలకొల్పాలి. ఒక్కో రిఫైనరీ ఫ్యాక్టరీ కోసం రూ. 30 కోట్ల చొప్పున రూ. 750 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. వీటి ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,500 మందికి ఉద్యోగ ఉపాధి లభించనుంది. అటు పెట్టుబడులు.. ఇటు ఉద్యోగాలు పామాయిల్ రంగంలో క్రషింగ్ ఫ్యాక్టరీల వల్ల వచ్చే మూడేళ్లలో రూ. 3,500 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఇందులో ఆయిల్‌ఫెడ్ ద్వారానే రూ. 750 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టబోతున్నాం. దీంతో ఆయిల్‌ఫెడ్‌లోనూ ప్రభుత్వ ఉద్యోగాలు భారీగా భర్తీ కానున్నాయి. – సురేందర్, ఎండీ, ఆయిల్‌ఫెడ్ -
గుడ్‌న్యూస్: తగ్గనున్న వంట నూనె ధరలు
సామాన్యులకు ఊరట కలుగనుందా? వంట నూనె ధరలు దిగిరానున్నాయా? అంటే అవును అని అంటున్నారు కేంద్ర ఫుడ్ సెక్రటరీ సుధాన్షు పాండే. గత ఏడాది నుంచి 20 - 50 శాతం మధ్య పెరిగిన వంటనూనె ధరలు త్వరలోనే తగ్గే అవకాశం ఉన్నట్లు తెలిపారు. డిసెంబర్ నుంచి వంట నూనెల ధరలు దిగిరావొచ్చన్నారు. కొత్త పంట మార్కెట్లోకి రావడం, అంతర్జాతీయ మార్కెట్లో రేట్లు తగ్గే అంచనాలు ఉండటం ఇందుకు కారణంగా పేర్కొన్నారు. "రాబోయే డిసెంబర్ నుంచి సోయాబీన్ ఆయిల్, పామాయిల్ ధరలు స్వల్పంగా తగ్గే అవకాశం కనిపిస్తుంది" అని ఆహార & ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే తెలిపారు.(చదవండి: నాలుగు నెలల్లో లక్ష కోట్లకు పైగా ఎక్సైజ్ సుంకం వసూళ్లు) పాండే మాట్లాడుతూ.. "రాబోయే రోజుల్లో సోయాబీన్ పంట కోతకు వస్తుంది. ఆ నాలుగు నెలల తర్వాత రబీ ఆవాల పంట చేతికి వస్తుంది, కాబట్టి ధరలు నియంత్రణలో ఉండాలని ఆశిస్తున్నాను" అని అన్నారు. అలాగే, కొత్త పంటల రాక, అంతర్జాతీయ మార్కెట్లో తగ్గుతున్న ఆయిల్ ధరల ఇందుకు కారణం అని అన్నారు. ప్రస్తుతం 60 శాతం ఆయిల్ భారత్ దిగుమతి చేసుకుంటుంది అని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ధర పెరిగితే, అప్పుడు ఆ ప్రభావం ఇక్కడ పడుతుంది అని పాండే అన్నారు. గత ఏడాది కాలంలో దేశంలో వంట నూనె ధరలు 64 శాతం పెరిగాయి. ఈ ధరల పెరుగుదలను అరికట్టడం కోసం మిషన్ ఆయిల్‌పామ్ పథకాన్ని చేపట్టింది. ఈ పథకం కింద వంట నూనెల తయారీలో కీలకమైన ఫామాయిల్ సాగును ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు మిషన్ ఆఫ్ ఆయిల్ ఫామ్‌ను ప్రకటించింది. -
మిషన్ ‘ఆయిల్ పామ్’.. సబ్సిడీ తీరు ఇలా..
సాక్షి, అమరావతి: పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా వంట నూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించేలా పామాయిల్ సాగును జాతీయ వంట నూనెల మిషన్ (ఎన్ఎంఈవో)లో కేంద్ర ప్రభుత్వం చేర్చింది. వంట నూనెల దిగుమతిని తగ్గించడం, ఇతర దేశాలపై ఆధారపడకుండా దేశీయంగా ఆయా పంటలు, ఉత్పత్తిని ప్రోత్సహించడం దీని లక్ష్యం. ఆహార ధాన్యాలైన వరి, గోధుమ, పంచదారలో మనదేశం స్వయం సమృద్ధి సాధించి ఎగుమతి దిశగా సాగుతుండగా వంటనూనెల్ని మాత్రం పెద్దఎత్తున దిగుమతి చేసుకుంటోంది. ఈ పరిస్థితిని నివారించేలా ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాల్లో పెద్దఎత్తున ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలని నిర్ణయించింది. దిగుమతుల్లో 56 శాతం పామాయిలే... మనదేశం ఏటా సుమారు 133.5 లక్షల టన్నుల వంట నూనెల్ని దిగుమతి చేసుకుంటుండగా దీని విలువ సుమారు రూ.80 వేల కోట్లు ఉంటుంది. దిగుమతి చేసుకునే నూనెల్లో 57 శాతం పామాయిల్ కాగా 27 శాతం సోయా, 16 శాతం సన్‌ఫ్లవర్ ఆయిల్ ఉంది. ఒక్క పామాయిల్‌పైనే కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.11 వేల కోట్లను ఖర్చు చేస్తోంది. ఈ నేపథ్యంలో దేశీయంగా ఆయిల్ పామ్ తోటల విస్తీర్ణం, ఉత్పత్తిని పెంచేలా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్ తదితర చోట్ల ఆయిల్ పామ్ సాగుపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుత 3.28 లక్షల హెక్టార్లలో సాగులో ఉండగా 2025–26 నాటికి 10 లక్షల హెక్టార్లకు, 2029–30 నాటికి 16.7 లక్షల హెక్టార్లకు పెంచాలని నిర్దేశించారు. నూనె దిగుబడిని 3.15 లక్షల టన్నుల నుంచి 11 లక్షల టన్నులకు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించారు. ప్రభుత్వ సాయం ఎలా ఉంటుందంటే... సాగు విస్తరణలో భాగంగా జాతీయ ఆహార భద్రత మిషన్ (ఎన్ఎఫ్ఎస్ఎం–ఓపీ) కింద మొక్కలకు 85 శాతం సబ్సిడీని ఉద్యాన శాఖ ఇస్తుంది. నాణ్యమైన మొక్కల్ని అందజేస్తుంది. తోటల నిర్వహణ, అంతర పంటలు, గొట్టపుబావులు, పంపు సెట్లు, వర్మీ కంపోస్ట్ యూనిట్లు, మెషినరీ, ఇతర పరికరాలకు 50 శాతం సాయం అందిస్తుంది. తోటల సాగుపై రైతులకు ఉచితంగా శిక్షణ ఇస్తుంది. రైతులకు లాభసాటిగా ఉండేలా ధరల ఫార్ములాను నిర్ణయిస్తుంది. ఏటా రూ.5 వేల కోట్లు ఖర్చు పెడితే.. వంట నూనెల దిగుమతులపై కేంద్రానికి ఏటా పన్నుల రూపంలో రూ.40 వేల కోట్ల ఆదాయం వస్తుంది. ఆయిల్ పామ్ తోటల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు వచ్చే ఐదేళ్లలో ఏటా రూ.5 వేల కోట్లను వెచ్చిస్తే సత్ఫలితాలు కనిపిస్తాయని, రైతులు కూడా పెద్దఎత్తున ఆసక్తి చూపుతారని ఆయిల్ పామ్ రైతుల జాతీయ సంఘం నేతలు క్రాంతి కుమార్ రెడ్డి, బి.రాఘవరావు పేర్కొన్నారు. దేశంలో నంబర్ వన్ ఏపీ.. ఆయిల్ పామ్ సాగు, ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉంది. ప్రస్తుతం 1.62 లక్షల హెక్టార్లలో 1.14 లక్షల మంది రైతులు దీన్ని సాగు చేస్తున్నారు. సాలీనా హెక్టార్‌కు 19.81 టన్నుల ఆయిల్ దిగుబడి వస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తూనే పామాయిల్ రైతులను ఆదుకునేలా పలు చర్యలు చేపట్టారు. ఫలితంగా రాష్ట్రంలో సాగు పెరుగుతోంది. 9 జిల్లాల్లో 229 మండలాలలో ఈ పంట సాగవుతోంది. -
గుడ్‌న్యూస్: తగ్గనున్న వంట నూనె ధరలు .. కొత్తగా మిషన్ ఆయిల్ ఫామ్
న్యూఢిల్లీ: వంట నూనెల దిగుమతి తగ్గించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికి బదులుగా దేశీయంగా నూనె గింజన ఉత్పత్తి పెంచాలని డిసైడ్ అయ్యింది. అందుకు తగ్గట్టుగా మిషన్ ఆఫ్ ఆయిల్‌పామ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మిషన్ ఆయిల్‌పామ్ పథకానికి రూ.11,040 కోట్లు కేటాయించింది. దిగుమతుల భారం వంట నూనెల ధరలు ఇటీవల అనూహ్యంగా పెరిగాయి. ఇండియా వంట నూనెల్లో సగానికి పైగా ఇండోనేషియా, మలేషియా, బ్రెజిల్, అమెరికాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇటీవల బ్రెజిల్, అమెరికాలలో ఆయిల్ ముడి సరుకుల ఉత్పత్తి తగ్గిపోవడంతో ధరలు పెరిగాయి. మరోవైపు ఇండోనేషియా, మలేషియాలు ఎగుమతి సుంకాలు పెంచాయి. వెరసి ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటి వరకు వంట నూనెల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కేంద్రం వంట నూనెలపై న్నులు తగ్గించింది. అయినా ధరలు అదుపులోకి రాలేదు. ఉత్పత్తి పెంపుకు ఇండియా ఎక్కువగా పామ్‌ఆయిల్‌ని దిగుమతి చేసుకుంటోంది. వేరు శనగ, పొద్దు తిరుడుతో పోల్చితే మన దగ్గర పామ్ ఆయిల్ సాగు తక్కువగా ఉంది. దీంతో వంట నూనెల తయారీలో కీలకమైన ఫామాయిల్ సాగును ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు మిషన్ ఆఫ్ ఆయిల్ ఫామ్‌ను ప్రకటించింది. -
హలో వెంకటయ్య.. నేను హరీశ్‌ను!
మంత్రి హరీశ్‌రావు: ‘హలో.. వెంకటయ్య నేను హరీశ్‌ను మాట్లాడుతున్నాను.. వెంకటయ్య: సార్.. సార్.. చెప్పండి హరీశ్‌రావు: అంతా బాగున్నారా? నీళ్లు మంచిగా ఉన్నాయా? బోరు పోస్తుందా.. ? వెంకటయ్య: సార్ బాగున్నాం.. నీళ్లకు ఢోకాలేదు.. హరీశ్‌రావు: ఆయిల్ పామ్ గురించి మొన్న మీటింగ్‌లో విన్నావు కదా! ఎన్ని ఎకరాలు సాగు చేస్తావు.. వెంకటయ్య: రెండు ఎకరాలు వేద్దామని అనుకుంటున్న సార్ హరీశ్‌రావు: రెండు ఎకరాలు వేస్తే ఏం లాభం.. మూడు ఎకరాలు సాగు చేయి.. వెంకటయ్య: మీరు చెప్పినంక మాకేం భయం సార్.. మూడు కాదు.. నాలుగు ఎకరాల్లో పామ్ ఆయిల్ వేస్తా సార్.. హరీశ్‌రావు: ఓకే వెంకటయ్య.. నీతోపాటు పక్క రైతులను కూడా సాగుచేయమని చెప్పు. మంచి లాభాలు వచ్చే సాగు. ఎకరానికి ప్రభుత్వం రూ.30 వేలు ప్రోత్సాహకాలు కూడా అందజేస్తుంది. ఫ్యాక్టరీని కూడా మన సిద్దిపేటలోనే ఏర్పాటు చేస్తున్నం. మంచి లాభం వచ్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది.. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్ గ్రామానికి చెందిన రైతు వెంకటయ్యతో బుధవారం ఫోన్లో చేసిన సంభాషణ ఇది. సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో మొత్తం 55 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేసేందుకు రైతులను సమాయత్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా మార్చి 28వ తేదీన సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా రైతులకు ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రైతుల ఉత్సాహాన్ని చూసిన మంత్రి హరీశ్‌రావు బుధవారం హైదరాబాద్ నుంచి 300 మంది రైతులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి రైతులు ఆయిల్ పామ్ వేసేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, ఆయిల్ పామ్ దిగుబడి, లాభాలు, జిల్లాలో ఆయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు చర్యలు వంటి విషయాలను మంత్రి రైతులకు వివరించారు. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి జిల్లా రైతులకు దశల వారీగా ఆయిల్ పామ్ తోటలు సాగుచేసిన రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 2వ తేదీన సిద్దిపేట నియోజకవర్గం నుంచి 150 మంది రైతులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట, దమ్మపేటలకు పంపిస్తున్నామని, రైతులు అక్కడకు వెళ్లి ఆయిల్ పాం సాగులో మెలకువలు తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ సురేందర్‌రెడ్డి, సిద్దిపేట జిల్లా వ్యవసాయాధికారి శ్రావణ్, హార్టికల్చర్ అధికారి రామలక్ష్మి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
ఆయిల్‌పామ్‌కు ఆధరణ
ఆయిల్‌పామ్ రైతుల ఆనందం ఆకాశాన్ని తాకింది. ప్రతి కర్షకుని మోముపై ‘ధర’హాసం చిందులేసింది. హృదయాలు సంతోషంతో బరువెక్కాయి. జననేత, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని, తమ మనసులు గెలుచుకున్నారని ఉప్పొంగిపోయాయి. జంగారెడ్డిగూడెం/ద్వారకాతిరుమల: ధరల వ్యత్యాసంతో నష్టపోయిన ఆయిల్‌పామ్ రైతులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదుకున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆయిల్ గెలల టన్ను ధరలో ఎక్కువ వ్యత్యాసం ఉంది. అలాగే ఓఈఆర్ (ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేట్) 1.72 శాతం వ్యత్యాసం ఉంది. దీంతో రైతులకు టన్నుకు రూ.500 నుంచి రూ.600లకు పైగా నష్టం వచ్చేది. రైతులు అవస్థలు పడ్డారు. దీనిపైగత ప్రభుత్వాన్ని వేడుకున్నా.. ఉపయోగం లేకుండా పోయింది. ఈ సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయిల్‌పామ్ రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అప్పట్లో ఆయిల్‌పామ్ రైతుల కోసం ఇప్పటి గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు 2018 నవంబర్ 1 నుంచి మూడు రోజులపాటు ద్వారకాతిరుమల మండలంలోని సీహెచ్.పోతేపల్లి ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ వద్ద దీక్ష కూడా చేశారు. అయినా అప్పటి ప్రభుత్వంలో చలనం లేకపోయింది. అధికారంలోకి వచ్చిన ఏడునెలల్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఆయిల్‌పామ్ రైతులకు అండగా నిలిచింది. 2018 నవంబర్ నుంచి 2019 అక్టోబర్ వరకు రైతులు నష్టపోయిన వ్యత్యాసాన్ని పూడ్చేందుకు ప్రభుత్వం 76,01,43,673 రూపాయలను విడుదల చేసింది. 3 పనిదినాల్లో ఈ నగదును రైతుల ఖాతాల్లో జమచేయాలని ఆయా ఆయిల్ కంపెనీలను ఆదేశించింది. ఉద్యాన శాఖ కమిషనర్ చిరంజీవి చౌదరి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. 2018 అక్టోబర్ నుంచి 2019 నవంబర్ వరకు ఆంధ్ర, తెలంగాణల్లో నెలవారీగా ఏడాది కాలం ఆయిల్ గెలల ధరల్లో ఉన్న వ్యత్యాసాన్ని ప్రభుత్వం చెల్లించేలా నిధులు మంజూరు చేశారు. -
సాగుకు సర్కారీ సాయం
వ్యవసాయ శాఖ పథకాలు 1. మాగాణి భూములకు పచ్చి రొట్ట పైర్ల విత్తనాలు, అంతర పంటల విత్తనాలు 50శాతం సబ్సిడీపై సరఫరా. 2. విత్తన గ్రాస పథకం కింద రైతులు వారికి కావాల్సిన విత్తనం వారే తయారు చేసుకునేందుకు ఫౌండేషన్ విత్తనాల సరఫరా. 3. భూసార వారోత్సవాల నిర్వహణ- మట్టి నమూనాల విశ్లేషణ ఆధారంగా ఎరువుల వాడకానికి ప్రోత్సాహం. 4. మండలానికి పది చొప్పున ముఖ్యమైన పంటల్లో ఆధునిక పద్ధతుల సమగ్ర ప్రదర్శనకు పదెకరాల ప్రదర్శనా క్షేత్రాల నిర్వహణ. 5. సమగ్ర సస్యరక్షణ యాజమాన్య పద్ధతుల ప్రచారానికి వరి, పత్తి, వేరుశనగ, కంది పంటల్లో క్షేత్ర పాఠశాల నిర్వహణ. 6. సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు, పరికరాలు సరఫరా. 7. పురుగు మందులు కల్తీల నిరోధానికి శాంపుల్స్ రహస్య కోటింగ్ పద్ధతిన కొనసాగింపు. 8. జీవ నియంత్రణ విధానాల ప్రచారానికి తక్కువ ధరకు ట్రైకోడెర్మా విరిడి, ఎన్పీవీ ద్రావణం, ట్రైకోగ్రామా కార్డుల సరఫరా. 9. రైతులకు వ్యవసాయ పరిజ్ఞానం అందించేందుకు శిక్షణా కార్యక్రమాలు, రైతు గ్రూపులు తదితర కార్యక్రమాల నిర్వహణ. ఉద్యానవన శాఖ పథకాలు 1. ఆయిల్ ఫామ్ తోటల అభివృద్ధి. 2. అధిక దిగుబడి నిచ్చే కూరగాయ, ఉల్లి విత్తనాలను 50శాతం సబ్సిడీపై సరఫరా. 3. మేలు రకం పండ్ల మొక్కలు, టిష్యూ కల్చర్ మొక్కలను రాయితీపై అందజేత. 4. ఉద్యాన పంటల ఉత్పత్తుల నాణ్యత, దిగుబడి పెంపునకు సబ్సిడీపై డ్రిప్ ఇరిగేషన్ యూనిట్లు సరఫరా. 5. సమగ్ర పండ్ల అభివృద్ధి పథకం, కూరగాయల అభివృద్ధి పథకం, సమగ్ర సుగంధ ద్రవ్యాల అభివృద్ధి పథకం. 6. పూల తోటలు, సుగంధ ద్రవ్యాలు, ఔషధ మొక్కల పెంపకం కోసం ప్రత్యేక పథకాల అమలు. 7. ఆకులలో పోషకాలను విశ్లేషణ చేసే లేబొరేటరీ ద్వారా ఆకులను విశ్లేషించే సమగ్ర పోషక యాజమాన్యం అమలు. 8. రైతు బజార్ల రైతులకు విత్తనాల సబ్సిడీ, సాంకేతిక సలహాలు అందజేయడం. 9. రైతు శిక్షణా కార్యక్రమాలు, ఎగ్జిబిషన్ల ఏర్పాటు, రైతు విజ్ఞాన యాత్రల ద్వారా అవగాహన పెంపొందించడం. 10. మామిడి, ద్రాక్ష, గులాబీ, పుట్టగొడుగుల ఎగుమతి ప్రోత్సాహానికి చర్యలు.