దెయ్యం పాత్రలో మెగా వారసురాలు
మెగా వారసురాలిగా భారీ అంచనాల మధ్య టాలీవుడ్‌కు పరిచయం అయిన హీరోయిన్ నిహారిక. మెగా బ్రదర్ నాగబాబు కూతురిగా, పలు టివి షోస్‌కు వ్యాఖ్యతగా సుపరిచితురాలైన నిహారిక సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఈ స్టార్ వారసురాలు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన 'ఒక్క మనసు' నిరాశపరచటంతో ఇక నిహారిక నటిగా కంటిన్యూ అవుతుందా.. లేదా..? అన్న టాక్ కూడా వినిపించింది.
అలాంటి అనుమానాలకు ఫుల్స్టాప్ పెడుతూ త్వరలోనే తన రెండో సినిమాను పట్టాలెక్కించడానికి నిహారిక రెడీ అవుతుందట. మరాఠిలో విజయం సాధించిన హ్యాపీజర్నీ అనే సినిమాను తెలుగు రీమేక్ చేయడానికి రెడీ అవుతోంది. అన్న చెల్లెల్ల మధ్య జరిగే కథగా తెరకెకెక్కనున్న ఈ సినిమాలో.. నిహారిక దెయ్యంగా నటించనుంది. ప్రస్తుతానికి చర్చల దశలో ఉన్న ఈ సినిమాపై త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానుంది.