The old arrears
-
రుణ మాయ
ఊబకాయిల వసూలుకు బ్యాంకుల ఎత్తుగడ ఊకొత్త రుణాలిస్తామంటూ ప్రచారం ఊరెన్యువల్స్ మాటున పాత బకాయిల జమ ఊజిల్లా వ్యాప్తంగా *7 వేల కోట్ల వసూలుకు సిద్ధం చిత్తూరు: రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు రుణాలు ఇవ్వని బ్యాంకులు ఇప్పుడు పాత బకాయిలు వసూలుకు కొత్త రుణాలు ఇస్తామంటూ సరికొత్త ప్రచారానికి తెరలేపాయి. రూ.7వేల కోట్ల బకాయిలు రాబట్టుకునేందుకు వ్యూహం సిద్ధం చేసుకున్నాయి. దీనికి కలెక్టర్ సహకారం కోరాయి. కరువు పరిస్థితుల్లో రైతులు పాత బకాయిలు చెల్లించే పరిస్థితి లేదన్న సంగతి తెలుసుకున్న బ్యాంకులు రుణ వసూలు కోసం కలెక్టర్‌తో పాటు వివిధ శాఖల అధికారుల మద్దతు కోరాయి. అందరూ కలిసి వారం రోజుల పాటు చర్చించిన అనంతరం రుణ వసూళ్ల కోసం సరికొత్త వ్యూహం రచించారు. పాతబకాయిలున్న వారికి కొత్త రుణాలు మంజూరు చేసి ఆ మొత్తాన్ని జమ చేసుకోవాలని నిర్ణయించారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్న సామెతగా ఇటు కొత్త రుణాలిచ్చినట్లు, అటు పాత బకాయిలు వసూలు చేసినట్లు ఉంటుందని భావించారు. కలెక్టర్ సూచన మేరకు తొలుత బ్యాంకు అధికారులతో పాటు ప్రభుత్వ శాఖలైన డీఆర్డీఏ, అగ్రికల్చర్, హార్టికల్చర్, వివిధ శాఖల అధికారులతో జిల్లా నుంచి మండల స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రైతులందరికీ బ్యాంకులు కొత్త రుణాలిస్తాయి.. రమ్మంటూ ఈ కమిటీలు ప్రచారం చేయనున్నాయి. దీనికి మనబ్యాంకు పేరుతో స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రాంకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం కరపత్రాలు, బ్రోచర్లు సైతం సిద్ధం చేశారు. రైతులను మభ్యపెట్టి అప్పులను వసూలు చేయడమే తరువాయి. ‘ఈ ఖర్మ మాకేంటి’ అంటూ ఓ ప్రభుత్వ అధికారి ‘సాక్షి’తో వాపోయారు. జిల్లా వ్యాప్తంగా 1.38 లక్షల హెక్టార్లలో వేరుశెనగ సాగుకు రైతులు సిద్ధమయ్యారు. ఇందుకోసం * 500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టాల్సి ఉంది. సీఎం చంద్రబాబు రుణమాఫీ హామీ పుణ్యమా అని గత ఏడాది బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో రైతుల పాత బకాయిలు అలాగే ఉండిపోయాయి. ఈ సీజన్‌కైనా బ్యాంకులు కొత్త రుణాలు ఇచ్చి ఆదుకుంటాయనుకుంటే పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. రూ.7వేలకోట్ల పాత బకాయిలు.. జిల్లాలో ప్రస్తుతం వివిధ బ్యాంకుల పరిధిలో * 7 వేలకోట్లకు పైనే పాత బకాయిలు ఉన్నట్లు సమాచారం. 2011-12లో వ్యవసాయ, అనుబంధ రంగాలకు సంబంధించి రూ.2,763.36 కోట్ల రుణాలివ్వడం లక్ష్యం కాగా బ్యాంకులు రూ.2,985.33 కోట్లు ఇచ్చాయి. 2012-13 ఏడాదికిగాను రూ.3,556.06 కోట్లు లక్ష్యం కాగా రూ.3,784.22 కోట్లు ఇచ్చాయి. 2013-14 గాను రూ.4,267.57 కోట్లు లక్ష్యం కాగా రూ.5,368.54 కోట్లు ఇచ్చాయి. 2014 -15 సంవత్సరానికి గాను రూ.6,138.72 కోట్లు లక్ష్యం కాగా రూ.3,791.83 కోట్లు మాత్రమే రుణాలిచ్చారు. మొత్తంగా నాలుగేళ్లలో రూ.18,919.92 కోట్లు రుణాలు ఇచ్చాయి. ఇందులో రూ.7వేల కోట్ల పైగా రుణం పాతబకాయి కింద నిలిచిపోయింది.. -
కొర్రీ వర్రీ!
కార్పొరేషన్ గ్రాంట్‌కు ఏలికల మెలిక పాత బకాయిలు వసూలుచేస్తేనే నిధులు రూ. 22.19 కోట్లు రావాల్సింది ప్రభుత్వాల నుంచే అయోమయంలో అధికారులు విజయవాడ సెంట్రల్ : స్థానిక సంస్థలు తామిచ్చే నిధులపై ఆధారపడకూడద ని పదేపదే చెబుతున్న ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఆస్తి పన్ను నూరు శాతం వసూలుచేయడంతోపాటు పాత బకాయిలు రాబట్టనట్లయితే గ్రాంట్‌ను నిలిపివేస్తామంటూ తాజాగా జీవో జారీ చేసింది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.74.60 కోట్ల ఆస్తి పన్ను వసూలు లక్ష్యం కాగా ఇప్పటివరకు రూ.55 లక్షలు వసూలైంది. మిగిలిన రూ. 19.60 కోట్లను ఈ నెలాఖరులోగా వసూలుచేయాల్సి ఉంది. ఏటా 90 నుంచి 95 శాతం మేర పన్నులు వసూలవుతున్నాయి. కాబట్టి ఆస్తి పన్ను డిమాండ్ లక్ష్యాన్ని చేరుకుంటారనడంలో ఎలాంటి అనుమానం లేదు. వచ్చిన చిక్కల్లా మొండి బకాయిలతోనే. మొహం చాటేసిన మంత్రులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ. 22.19 కోట్ల మేర ఆస్తి పన్ను రావాల్సి ఉంది. 1995 నుంచి బకాయిలు పేరుకుపోయాయి. వీటిని రాబట్టేందుకు మేయర్ కోనేరు శ్రీధర్ రాష్ట్ర మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అలాగే చూద్దామన్న వారు ఆచరణలో రిక్తహస్తం చూపారు. దక్షిణ మధ్య రైల్వే నుంచి రూ.8 కోట్ల 19 లక్షల 56 వేల 740 రావాల్సి ఉంది. 2001 నుంచి బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. సేవలు, సర్దుబాటు విషయమై గతంలో కార్పొరేషన్, రైల్వే అధికారుల మధ్య చర్చలు జరిగాయి. 50 శాతం చెల్లించాల్సిందిగా కార్పొరేషన్ కోరగా, 30 శాతానికి మించి చెల్లించలేమని రైల్వే అధికారులు పేచీకి దిగారు. ఇలాంటి మొండి సమస్యలు కార్పొరేషన్‌ను పట్టిపీడిస్తుంటే గ్రాంటు ఆపేస్తాననడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సర్కార్ బకాయిల మాటేమిటి? రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వస్తే నగరపాలక సంస్థ పరిధిలో 22 శాఖలకు సంబంధించి 189 అసెస్మెంట్ల నుంచి రూ.13 కోట్ల 67 లక్షల 97 వేల 493 వసూలుకావాల్సి ఉంది. ఏటా కార్పొరేషన్ రెవెన్యూ అధికారులు అందిస్తున్న ఆస్తి పన్ను డిమాండ్‌ను ఆయా శాఖలు బుట్టదాఖలు చేస్తున్నాయి. దీనిపై ప్రభుత్వ స్పందన అంతంతమాత్రమే. వివిధ కోర్టుల్లో ఉన్న కేసులు పరిష్కారమైతే మరో రూ.8 కోట్లు వసూలయ్యే అవకాశం ఉందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఎరి యర్స్ వసూలైతేనే గ్రాంట్ ఇస్తామని ప్రభుత్వం మెలిక పెట్టడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. స్పెషల్‌డ్రైవ్.. దీర్ఘకాల పన్ను బకాయిలు ఉన్న గృహాలు, వ్యాపార సంస్థలపై చర్యలు తీసుకోవాల్సిందిగా కమిషనర్ ఆదేశించారు. బకాయిదారుల జాబితాను కార్పొరేషన్ వెబ్సైట్లో ఉంచిన అధికారులు గురువారం నుంచి ప్రత్యక్ష దాడులకు దిగారు. సర్కిల్-2 పరిధిలో ఎప్పట్నుంచో బకాయిలున్న గృహా లకు నీటి కనెక్షన్లు తొలగించారు. పూర్ణానందంపేటలో నాలుగేళ్లుగా పన్ను చెల్లించని గృహాన్ని, గవర్నర్‌పేటలోని వ్యాపార సం స్థను సీజ్ చేశారు. స్పెషల్ డ్రైవ్‌లో రూ.10,93,216 వసూలు చేసినట్లు ఏసీ ఆర్.శ్రీనివాసరావు తెలిపారు.