రుణ మాయ | Now the old debt collection banks for new loans | Sakshi
Sakshi News home page

రుణ మాయ

Published Tue, Jul 7 2015 3:46 AM | Last Updated on Sun, Sep 3 2017 5:01 AM

రుణ మాయ

రుణ మాయ

ఊబకాయిల వసూలుకు బ్యాంకుల ఎత్తుగడ
ఊకొత్త రుణాలిస్తామంటూ ప్రచారం
 ఊరెన్యువల్స్ మాటున పాత బకాయిల జమ
ఊజిల్లా వ్యాప్తంగా *7 వేల కోట్ల వసూలుకు సిద్ధం

 
చిత్తూరు: రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు రుణాలు ఇవ్వని బ్యాంకులు ఇప్పుడు పాత బకాయిలు వసూలుకు కొత్త రుణాలు ఇస్తామంటూ సరికొత్త ప్రచారానికి తెరలేపాయి. రూ.7వేల కోట్ల బకాయిలు రాబట్టుకునేందుకు వ్యూహం సిద్ధం చేసుకున్నాయి. దీనికి కలెక్టర్ సహకారం కోరాయి. కరువు పరిస్థితుల్లో రైతులు పాత బకాయిలు చెల్లించే పరిస్థితి లేదన్న సంగతి తెలుసుకున్న బ్యాంకులు రుణ వసూలు కోసం కలెక్టర్‌తో పాటు వివిధ శాఖల అధికారుల మద్దతు కోరాయి. అందరూ కలిసి వారం రోజుల పాటు చర్చించిన అనంతరం రుణ వసూళ్ల కోసం సరికొత్త వ్యూహం రచించారు. పాతబకాయిలున్న వారికి కొత్త రుణాలు మంజూరు చేసి ఆ మొత్తాన్ని జమ చేసుకోవాలని నిర్ణయించారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్న సామెతగా ఇటు కొత్త రుణాలిచ్చినట్లు, అటు పాత బకాయిలు వసూలు చేసినట్లు ఉంటుందని భావించారు. కలెక్టర్ సూచన మేరకు తొలుత బ్యాంకు అధికారులతో పాటు ప్రభుత్వ శాఖలైన డీఆర్‌డీఏ, అగ్రికల్చర్, హార్టికల్చర్, వివిధ శాఖల అధికారులతో జిల్లా నుంచి మండల స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రైతులందరికీ బ్యాంకులు కొత్త రుణాలిస్తాయి.. రమ్మంటూ ఈ కమిటీలు ప్రచారం చేయనున్నాయి. దీనికి మనబ్యాంకు పేరుతో స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రాంకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం కరపత్రాలు, బ్రోచర్లు సైతం సిద్ధం చేశారు. రైతులను మభ్యపెట్టి అప్పులను వసూలు చేయడమే తరువాయి. ‘ఈ ఖర్మ మాకేంటి’ అంటూ ఓ ప్రభుత్వ అధికారి ‘సాక్షి’తో వాపోయారు.

జిల్లా వ్యాప్తంగా 1.38 లక్షల హెక్టార్లలో వేరుశెనగ సాగుకు రైతులు సిద్ధమయ్యారు. ఇందుకోసం * 500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టాల్సి ఉంది. సీఎం చంద్రబాబు రుణమాఫీ హామీ పుణ్యమా అని గత ఏడాది బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో  రైతుల పాత బకాయిలు అలాగే ఉండిపోయాయి. ఈ సీజన్‌కైనా బ్యాంకులు కొత్త రుణాలు ఇచ్చి ఆదుకుంటాయనుకుంటే పరిస్థితి అందుకు భిన్నంగా మారింది.
 
రూ.7వేలకోట్ల పాత బకాయిలు..
 జిల్లాలో ప్రస్తుతం వివిధ బ్యాంకుల పరిధిలో * 7 వేలకోట్లకు పైనే పాత బకాయిలు ఉన్నట్లు సమాచారం. 2011-12లో వ్యవసాయ, అనుబంధ రంగాలకు సంబంధించి రూ.2,763.36 కోట్ల రుణాలివ్వడం లక్ష్యం కాగా బ్యాంకులు రూ.2,985.33 కోట్లు ఇచ్చాయి. 2012-13 ఏడాదికిగాను రూ.3,556.06 కోట్లు లక్ష్యం కాగా రూ.3,784.22 కోట్లు ఇచ్చాయి. 2013-14 గాను రూ.4,267.57 కోట్లు లక్ష్యం కాగా రూ.5,368.54 కోట్లు ఇచ్చాయి. 2014 -15 సంవత్సరానికి గాను రూ.6,138.72 కోట్లు లక్ష్యం కాగా రూ.3,791.83 కోట్లు మాత్రమే రుణాలిచ్చారు. మొత్తంగా నాలుగేళ్లలో రూ.18,919.92 కోట్లు రుణాలు ఇచ్చాయి. ఇందులో రూ.7వేల కోట్ల పైగా రుణం పాతబకాయి కింద నిలిచిపోయింది..
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement