old money
-
రూ.5 కోట్ల పాత కరెన్సీ, జింకకొమ్ములు స్వాధీనం
► నలుగురి అరెస్టు బనశంకరి (బెంగళూరు) : రద్దయిన పాత కరెన్సీనోట్లకు కొత్తనోట్లు ఇచ్చే చెలామణి దందాకు పధకం పన్నిన నలుగురు వ్యక్తులను మంగళవారం సీసీబీ పోలీసులు అరెస్ట్చేశారు. వీరి వద్ద నుంచి రూ.5 కోట్ల విలువ చేసే పాత కరెన్సీనోట్లును స్వాధీనం చేసుకున్నారు. రాజాజీనగర శివాలిలాడ్జ్లో పాత కరెన్సీ నోట్లును చెలామణి చేయడానికి పధకం రూపొందించినట్లు సీసీబీ పోలీసులకు సమాచారం అందింది. మంగళవారం సర్కిల్ఇన్స్స్పెక్టర్ రాజు బృంధం రాజాజీనగరలోని శివాలిలాడ్జ్ పై దాడిచేశారు. జయనగర కు చెందిన అంబ్రోస్, న్యూగురప్పనపాళ్య నివాసి ఆరీఫ్పాషా, కేరళ కు చెందిన పెలిక్స్ అనే ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.1 కోటి 98 లక్షల విలువచేసే రూ.500, 1000 పాత కరెన్సీనోట్లు, 2 కార్డు, మూడు సెల్పోన్లు తో పాటు లక్షలాదిరూపాయల విలువచేసే జింకకొమ్ములను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో భాగస్వామ్యులుగా ఉన్న అరుణ్, మంజునాథ్ అనే ఇద్దరిలో పరారిలో ఉన్నారని అదనపు పోలీస్ కమిషనర్ ఎస్.రవి తెలిపారు. వీరిపై రాజాజీనగర పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశామన్నారు. శంకరపుర పోలీస్స్టేషన్ పరిధిలోని బుల్టెంపుల్ రోడ్డులో గల మరాఠ హాస్టల్ పై సీసీబీ పోలీసులు దాడిచేసి శాంతినగర కు చెందిన నంజుండ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇతడి వద్ద నుంచి రూ.3 కోట్ల విలువ చేసే పాతకరెన్సీనోట్లు, ఒక కారు, సెల్పోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇతడి పై శంకరపుర పోలీస్స్టేషన్లో కేసునమోదు చేశారు. -
నోట్ల రద్దు: కమిటీ ముందు నోరిప్పని అధికారులు
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు అనంతరం ఎన్ని పాత నోట్లు వెనక్కి వచ్చాయి? ఎన్ని కొత్త కరెన్సీ నోట్లు ప్రింట్ చేశారు? అంటే అసలు ఎవరిదగ్గరా ఏం సమాధానాలు లేనట్టు ఉన్నాయి. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ అడిగిన ప్రశ్నలకు ఆర్థికమంత్రిత్వ శాఖ అధికారులూ ఏం సమాధానాలు చెప్పలేదని తెలుస్తోంది. నోట్ల రద్దు నిర్ణయంలో ఆర్బీఐ పాత్ర, నల్లధనం వసూళ్లు, విత్ డ్రా పరిమితిపై ఆంక్షలు వంటి పలు విషయాలపై సమాధానం చెప్పాల్సిందిగా పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సెంట్రల్ బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్, ఆర్థికమంత్రిత్వ శాఖ అధికారులను ఆదేశించింది. ఇదే విషయంపై వివరణ ఇవ్వాల్సిందిగా ప్రజాపద్దుల కమిటీ(పీఏసీ) సైతం వారికి నోటీసులు జారీచేసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన వీరప్పమొయిలీ నేతృత్వంలోని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ముందు బుధవారం హాజరైన ఆర్థికమంత్రిత్వ శాఖ అధికారులు, ఆ కమిటీ అడిగిన ప్రశ్నలకు సరిగ్గా సమాధానం చెప్పలేదని తెలుస్తోంది. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఎన్ని పాత నోట్లు వచ్చాయంటే వారిదగ్గర సమాధానం లేదట. ఇక ఎన్ని కొత్త నోట్లు ప్రింట్ చేశారన్నా వారు ఏం చెప్పలేదట. ఇక కేవీ థామస్ అధినేతగా ఉన్న మరో కమిటీ పీఏసీ ముందు వీరు శుక్రవారం హాజరుకావాల్సి ఉంది. అప్పుడు కూడా ఇదే మాదిరి సమాధానం చెబితే ప్రధాని నరేంద్రమోదీకైనా సమన్లు జారీచేస్తామని ఆయన ముందస్తుగానే హెచ్చరించారు. నోట్ల రద్దు అనంతరం రిజర్వు బ్యాంకు తన స్వతంత్రను కాపాడుకోవడంలో విఫలమైందని పలు విమర్శలు వచ్చాయి. మరోవైపు నగదు కొరతతో ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. ఈ విషయాలన్నింటిన్నీ విచారిస్తున్న కమిటీలు ఆర్బీఐ గవర్నర్, ఇతర అధికారులకు నోటీసులు జారీచేశాయి. -
నోట్లరద్దుతో పాక్ ఐఎస్ఐ కొత్త కుయుక్తులు!
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దు నిర్ణయం పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)పైనా తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో తనవద్ద పెద్దమొత్తంలో ఉన్న భారత కరెన్సీని మార్చుకోవడానికి తెరచాటు యత్నాలకు దిగుతున్నట్టు సమాచారం. తన వద్ద ఉన్న పాత కరెన్సీని ఏజెంట్ల ద్వారా పెద్ద ఎత్తున మార్చుకునేందుకు ఐఎస్ఐ ప్రయత్నిస్తున్నట్టు నిఘావర్గాలకు సమాచారం అందింది. దీంతో దేశంలోని బ్యాంకులన్నింటినీ ఇంటెలిజెన్స్ అధికారులు అప్రమత్తం చేశారు. బ్యాంకుల్లో పెద్దమొత్తంలో డిపాజిట్ అయ్యే నగదు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దేశంలోకి పెద్ద ఎత్తున నకలీ కరెన్సీని తరలించి.. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని ఐఎస్ఐ ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.